BRS Slams Govt Over Failed Promises
ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలం
సీఎం రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయ్యారు
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయడంలో విఫలమైందని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం
రేవంత్ రెడ్డి “యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ప్రజల ఆశీస్సులతో కాకుండా పరిస్థితుల వలన ఆ పదవి దక్కింది అని వారు ఆరోపించారు
అందరూ ఆయనలా “తొక్కుకుంటూ” ఎదగలేరని వ్యాఖ్యానించారు.
సీఎం నిర్వహిస్తున్న సభలు ప్రజా ధనం వృథా చేయడమే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని ఆరోపించారు.మళ్లీ నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం సరైంది కాదని, ఆ నిర్ణయం ప్రజలదేనని స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలవుతుందని, కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి డిపాజిట్ కూడా కోల్పోతారని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణలో సాగు, త్రాగునీటి అవసరాలను తీర్చే గొప్ప ప్రాజెక్ట్ అని ప్రతి ఒక్కరికీ తెలుసని, అయితే ప్రస్తుత ప్రభుత్వం విచారణల పేరుతో ఆలస్యం చేసి ప్రాజెక్ట్ పునరుద్ధరణ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.
ప్రజలు ప్రభుత్వ వైఖరిని గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని వారు అన్నారు
సీఎం ప్రజలకు మాటలు చెబుతున్నాడు కానీ ఏ ఒక్క పనిని చేతల ద్వారా చేయడం లేదు మహిళలకు ఇచ్చిన హామీ 2500 రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పటివరకు ఇవ్వలేదు అలాగే తులం బంగారం మహిళలు నూతనంగా పెళ్లి చేసుకుంటే ఇస్తాను హామీ ఇచ్చాడు ఇప్పటివరకు ఇవ్వలేదు వృద్ధులకు వితంతువులకు 4000 వికలాంగులకు పింఛన్ 6000 రూపాయలకు పెంచుతా అని హామీ ఇచ్చి ఇప్పటివరకు వికలాంగుల పెన్షన్స్ పెంచలేదు జగిత్యాల లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 20 తారీకున మీటింగ్ పెడుతున్నాడు తెలిసి ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాటారంలో సభ పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సభలో ప్రదేపదే ప్రస్తావించడం జరిగింది. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేవంత్ రెడ్డిని సభలో ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాంటి నాయకుడిని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదే లేదు అని వారు విమర్శించారు వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో డిపాజిట్లు కూడా రావు అలా చిత్తుగా ఓడియ్యడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జనార్దన్ మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటరాణి సిద్దు మేకల సంపత్ రఘుపతిరావు కౌన్సిలర్ పూర్ణచందర్ భోగం నరేందర్ మంజుల శ్యామల తదితరులు పాల్గొన్నారు
