Anti-Rape Awareness Video Released
సమాజమా స్పందించు మా..అత్యాచారం క్షమిం చరాని నేరం
సీఐ,ఎస్ఐ ఆధ్వర్యంలో వీడియో ఆవిష్కరణ
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రంజిత్ రావు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పరమేష్ ఆధ్వర్యంలో సమాజమా అత్యాచారం క్షమించరాని నేరం పాటను విడుదల చేశారు.ఈ సంద ర్భంగా సిఐ,ఎస్ఐ మాట్లాడు తూ రచయిత మొగ్గం సుమన్ పాటను రాసి సింగర్ తుడుం క్రాంతి కుమార్ తో పాడించి వీడియో రూపం లో రిలీజ్ చేయడం గొప్ప విషయమని సమాజంలో స్త్రీ యొక్క ప్రా ముఖ్యతను, విలువను తెలి పేవిధంగా ప్రయత్నం చేయడం మంచి పరిణామం. ప్రస్తుత సమాజంలో మహిళలపై చేస్తున్న అత్యాచారాలను పారద్రోలాల్సిన అవసరం ఉందని ఆడవారిని రక్షిం చుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. రచయిత మొగ్గంసుమన్ మంచి సాహిత్య విలువలతో పాట రాశాడని భవిష్యత్తులో మరెన్నో పాటలు రాసి సమా జ శ్రేయస్సుకోసం ముందుకు సాగాలని కొనియాడారు. సింగర్ తుడుం క్రాంతి కుమార్ ఇలాంటి పాటలు మరెన్నో పాడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సమాజంలో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మాజీ జడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబాసి కృష్ణ మూర్తి, బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్య క్షులు మారపల్లి క్రాంతికు మార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు అరికిల్ల దేవయ్య, బి ఎస్ ఎస్ జిల్లా ఉపాధ్య క్షులు మరపల్లి విజయకు మార్, శాయంపేట మండల అధ్యక్షులు మారపల్లి సుధా కర్ తదితరులు పాల్గొన్నారు.
