Beautification of Narsampet is Our Agenda
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఎజెండా
మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్.
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన ఎజెండా అని మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. మున్సిపాలిటీలోని 20వ వార్డులో మున్సిపల్ చైర్ పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ గంధం నరేందర్,స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీరామోజు రోజా రాణితో కలిసి పర్యటించారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అదే వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులు, పారిశుధ్యం,వీధి దీపాలు,మెరుగైన రోడ్లకై,మరియు డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పట్టణ రూపురేఖలను మారుస్తామన్నారు.వార్డు కౌన్సిలర్స్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో 19వ వార్డు కౌన్సిలర్ ఎలుకంటి విజయ్,17వ కౌన్సిలర్ అయూబ్ ఖాన్,కాంగ్రెస్ నాయకులు బైరి మురళి, బైరి కృష్ణ,శివ,తదితరులు పాల్గొన్నారు.
