SSA Employees Protest for Strike Salaries
సమ్మె జీతాలు, పేస్కేల్ అమలు చేయాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, పేస్కేల్ అమలు చేయాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం (టీఎస్ యూటీఎఫ్) పిలుపు మేరకు మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఎదుట జరిగిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించకపోతే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవి, మోహన్, రాజు, గోపాల్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
