Gold Prices Surge Amid War Tensions
బంగారం ధరలకు రెక్కలు.. రూ.1.73 లక్షలు దాటిన పది గ్రాముల పసిడి..
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. శనివారం నుంచి భారీ పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. యుద్ధం కారణంగా పది గ్రాముల బంగారం ధర మళ్లీ రూ.2 లక్షలు దాటే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,73,230కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,58,800కి చేరుకుంది. మరోవైపు వెండి ధర మళ్లీ మూడు లక్షల రూపాయల మార్క్‌ను దాటేసింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3.25 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.95 లక్షలుగా ఉంది.
