`ఏకపక్షంగా సాగని మున్సిపల్ ఎన్నికలు.
`కాంగ్రెస్ కు కొంత మోదం.. కొంత ఖేదం.

`కాంగ్రెస్ మీద ఇంకా ఎంతో కొంత నమ్మకం చూపిన ప్రజలు.
`సంక్షేమ పథకాల అమలుపై కాంగ్రెస్ మీద ఆశలు.

`ఇంకా కాంగ్రెస్ మీద ప్రజలకు సన్నగిళ్ళని నమ్మకాలు.
`ప్రజా వ్యతిరేకత పెద్దగా కనిపించలేదు.
`ఆరు గ్యారంటీలు అమలు చేస్తే కాంగ్రెస్ కు తిరుగు లేదు.
`జనం మళ్ళీ పట్టం కట్టొచ్చు..కాంగ్రెస్ గెలవచ్చు.
`మున్సిపల్ ఎన్నికల గెలుపు గొప్పగా ఊహించుకోవద్దు.
`ప్రజలు మా వెనుకే వున్నరన్న భ్రమలు ఎక్కువగా వద్దు.
`సమిష్టి నాయకత్వం మాత్రమే విజయానికి దారి మర్చిపోవద్దు.
`బీఆరఎస్ బలంగా కాంగ్రెస్ ను డీకొట్టింది.
`బీఆరఎస్ నాయకులకు మనో దైర్యం మిగిలింది.
`పార్టీ బలపడుతుందనే విశ్వాసం మరింత పెరిగింది.
`కష్టపడితే ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల వరకు మరింత పుంజుకోవచ్చు.
`ప్రభుత్వం మీద పోరాటం చేయకపోతే ఇబ్బందులు రావొచ్చు.
`ప్రజా వ్యతిరేకతను పెంచకపోతే మరింత వెనుకబడి పోవొచ్చు.
`కేటీఆర్, హరీష్ ల నాయకత్వ పటిమ మరింత పెరగాలి.
`పూర్తిగా కేసీఆర్ చరిష్మా తగ్గలేదు.
`కేసీఆర్ పదేళ్ల పాలనా కాలం ప్రజలు మర్చిపోలేదు.
`ప్రజలు బీఆరఎస్ వెనుక బాగానే వున్నారు.
`బీజేపీ ని కూడా తక్కువగా అంచనా వేయొద్దు.
`బీజేపీ పెరుగుతోందని పాలక, ప్రతిపక్షాలు మర్చిపోవద్దు.
హైదరాబాద్, నేటిధాత్రి:
ఈసారి తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. బిఆరఎస్‌ను ఆదరించారు. బిజేపిని కూడా చూసుకున్నారు. గత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి తీర్పురాలేదు. ప్రభుత్వానికి అండగా నిలిచారు. ప్రశ్నించమని బిఆరఎస్‌కు కూడా బాగానే మద్దతిచ్చారు. ఇలాంటి విచిత్రమైన తీర్పు వస్తుందని ఎవరూ అనుకోలేదు. ప్రభుత్వానికి పూర్తి స్దాయి మద్దతు లభిస్తుందని అదికార కాంగ్రెస్ పార్టీ అనుకున్నది. ప్రజా వ్యతిరేకతగా బాగా వుందని ప్రచారం చేసిను బిఆరఎస్ మెజార్టీ మున్సిపాలిటీలు గెలుస్తామని కలలుగన్నారు. అయినా అన్ని పార్టీల మాటలు విన్నారు. ఎవరిని గెలిపించాలో వారినే గెలిపించారు. అయితే ఇక్కడ స్ధానిక నాయకత్వాన్ని కూడా చూసినట్లు వున్నారు. తమ వార్డు ప్రజల పట్ల సన్నిహితంగా వున్న నాయకుల వైపు కూడా జనం నిలిచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పార్టీలను చూసి మాత్రమే జనం ఓట్లు వేయలేదని, పార్టీలకు పట్టం కట్టలేదని అర్దం చేసుకోవచ్చు. అదే జరిగితే ఏ రకంగా చూసినా వార్ వన్ సైడ్ కావాలి. కాని అలా జరగలేదు. ఆ తీర్పును ప్రజలు ఎక్కడా ఇవ్వలేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం బలంగానే చెప్ప్పుకోవచ్చు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత మాత్రం లేదని రుజువైంది. నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వుంటే ఖమ్మం జిల్లాలో కూడా అది కనిపించాలి. అక్కడ ఎక్కడా వ్యతిరేకత కనిపించిన దాఖలాలు లేవు. అలాగే నల్లగొండ జిల్లా, మహాబూబ్ నగర్ జిల్లాలోనూ ప్రభుత్వానికి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక రకంగా కాంగ్రెస్ స్వీప్ చేసినట్టే అని చెప్ప్పుకోవాలి. ఇలా మూడు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది. ఈ మూడు జిల్లాల్లో జనం ఎందుకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపు నిలిచారన్నదానిపై కూడా అద్యయనం చేయాల్సి వుంటుంది. మిగతా జిల్లాల కన్నా, ఈ మూడు జిల్లాలకు ప్రభుత్వ నిదుల వరద పారిస్తోందా? అభివద్ది మీద ఎక్కువ దష్టిపెడుతుందా? అనేది కూడా తెలియాలి. ఎందుకంటే గతంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ నియోజకవర్గాలకేనా నిదులు అంటూ కాంగ్రెస్ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చేది. అలాగే ఇక్కడ కూడా బలమైన మంత్రులున్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. అందులో ఒÅ£రు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వున్నారు. తెలంగాణలో పవర్ ఫుల్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వున్నారు. రాజకీయంగా, పాలనా పరంగా అనుభవం వున్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వున్నారు. ఈ ముగ్గురి రాజకీయం ముందు బిఆరఎస్ మరోసారి చతికిలపడింది. కోలుకోలేని దెబ్బ తిన్నది. ఇక నల్లగొండ విషయానికి వస్తే ఇక్కడ బలమైన నాయÅ£త్వం పనిచేసిందనే చెప్పాలి. రాజకీయంగా, పాలనాపరంగా అపరామైన అనుభవం వున్న సీనియర్ నాయకుడు జానారెడ్డితోపాటు, ఆయన వారసులు, ఇద్దరూ ప్రజా ప్రతినిదులుగా వున్నారు. వారికి తోడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వున్నారు. సీనియర్ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి వున్నారు. ఆయన సోదరుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వున్నారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు అన్ని నియోజకవర్గాలలోనూ కాంగ్రెస్‌పార్టీ జెండా ఎగిరింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఎక్కువ సర్పంచ్‌లు గెలిచింది. ఆ పరంపర మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఇక్కడ వార్ వన్ సైడ్ జరిగింది. ఇక సిఎం. రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు మరో సారి కాంగ్రెస్ జయకేతనం ఎగురువేసింది. పాలమూరు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించినట్లైంది. సిఎం. రేవంత్‌రెడ్డి సొంత ఇలాఖా కొడంగల్‌లో బిఆరఎస్‌కు చోటు లేకుండాపోయింది. మొత్తం సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. పాలమూరు ఉమ్మడి జిల్లా నుంచి సిఎం.తో పాటు మరో ఇద్దరు మంత్రులున్నారు. వారు కూడా తమ సత్తాను చాటుకున్నారు. సీనియర్ మంత్రి జూపల్లి కష్ణారావు, మరో మంత్రి వాకిటి శ్రీహరిలు కూడా బాగా కష్టపడ్డారనేది విషయం తేట తెల్లమైంది. మహాబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అయితే ఈ విజయాన్ని సిఎం. రేవంత్‌రెడ్డి పాలనకు అంకితమివ్వొచ్చని చెప్పొచ్చు. ఆయన అన్ని ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలే కదా? అని ఊరుకోలేదు. ఏది ఏమైనా గెలుపు ముఖ్యం. గెలిచి తీరుడు చాలా ముఖ్యం. అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ సిఎం. రేవంత్ రెడ్డి సభలు నిర్వహించారు. ప్రజలను ఒప్పించారు. తనపై నమ్మకం వుంచాలని కోరారు. ప్రజలు కూడా అలాగే తీర్పునిచ్చారు. ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం సన్నగిల్లలేదని కాంగ్రెస్‌ను గెలిపించారు. ఈ గెలుపు కాంగ్రెస్‌కు మరింత ఊపునిచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. తెలంగాణలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత లేదని చెప్పడానికి ఈ మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. అదే సమయంలో కాంగ్రెస్‌ను బిఆరఎస్ కూడా బలంగానే డీ కొట్టిందనే చెప్పాలి. బిఆరఎస్‌కు ఊహించని సీట్లే వచ్చాయి. నిజానికి ఓ ఐదారు మున్సిపల్ చైర్మన్లు వస్తాయని మాత్రమే అనుకున్నారు. కాంగ్రెస్‌కు 80శాతానికి పైగా కౌన్సిలర్లు , కార్పోరేటర్లు గెలుస్తారని అంచానా వేశారు. కాని బిఆరఎస్ బలంగానే కాంగ్రెస్‌తో కొట్లాడిందనే చెప్పాలి. అయినా ఇంకా ఎక్కడో బిఆరఎస్ వెనుకబడింది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్దగా ప్రచారం కూడా సాగించినట్లు లేదు. ఎంత సేపు హరీష్‌రావు సిద్దిపేట, మెదక్ జిల్లాల మీదనే దష్టిపెట్టారు. మిగతా జిల్లాల్లో ఇంత విరివిగా ప్రచారం సాగించలేదు. బిఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కూడా అన్ని జిల్లాలను చుట్టి వచ్చినా, ఆయన ప్రభావం పూర్తిగా కనిపించలేదు. బిఆరఎస్ బలంగా వుండే ఉత్తర తెలంగాణలో బిఆరఎస్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. కరీంనగర్ జిల్లాలో బిఆరఎస్‌కు మంచి పట్టు వుంది. కరీంనగర్ కార్పోరేష్న్ను నిలబెట్టుకోవాల్సిన చోట చతికిలపడింది. గతంలో వార్ వన్ సైడ్ అనేలా విజయాలు అందుకున్న బిఆరఎస్‌కు వరస ఓటములు వెంటాడుతున్నా, పార్లమెంటు ఎన్నికల తర్వాత కొంత కోలుకున్నట్లే కనిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో మూడో స్దానానికి పడిపోయిన, బిఆరఎస్ గత సర్పంచ్ ఎన్నికలు, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రెండో స్ధానానికి చేరుకోవడం ఒక రకంగా ఊరటనిచ్చే అంశమే. అయినా ఈ బలం చాలదు. వచ్చే ఎన్నికలకు ఈ మాత్రం బలం అసలే సరిపోదు. కాకపోతే బిఆరఎస్ నాయకులకు, కార్యకర్తలకు మున్సిపల్ ఎన్నికలు కొంత మనో ధైర్యాన్నే కల్పించాయని చెప్పాలి. పార్లమెంటు ఎన్నికల తర్వాత చతికిలపడిపోయిన బిఆరఎస్‌కు సర్పంచ్ ఎన్నిÅ£లు, మున్సిపల్ ఎన్నికలు ఆక్సీజన్‌ను అందించాయి. పార్టీ నాయకుల్లో వచ్చే ఎన్నికల వరకు మరింత బలపడుతుందనే విశ్వాసం పెరిగిందని అనుకోవచ్చు. అయితే బిఆరఎస్ ఎవరిని నిలబెడితే వారిని గెలిపించాలన్న ప్రకటనలు మాత్రం తప్ప్పు. పార్టీకోసం పనిచేసిన వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించాలి. ప్రజల్లో ఆదరణ వున్న నాయకులను ప్రజాక్షేత్రంలోకి దింపాలి. ఎన్నికల బరిలో నిలపాలి. పార్టీ పేరు చెప్ప్పుకొని అరాచకాలు గతంలో చేసిన వారు చాలా మంది వున్నారు. వారికి ప్రజల్లో బలం లేదు. సానుభూతి లేదు. వారికి గౌరవం అసలే లేదు. అలాంటి వారికి టిక్కెట్లు ఇచ్చి గెలిపించాలంటే ప్రజలు ఒప్ప్పుకోరు. జనం మెచ్చిన నేతలకు టిక్కెట్లు ఇ స్తేనే గెలిపిస్తారు. మున్సిపల్ పరిధిలో స్దానికంగా బిఆరఎస్‌లో బలమైన నాయకుడు, ప్రజలకు చేరువలో వుండే నాయకుడికి కాకుండా పార్టీ పేరు చెప్ప్పుకునే నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. సీనియర్ నాయకులకు ఎక్కడో అక్కడ టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. కాని ఆ వార్డలకు సంబంధం లేని నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం అనేది కూడా సరైంది కాదు. గెలుస్తామన్న దీమాలో కూడా నిజాలు వెతుక్కోవాలి. స్దానిక నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలి. అంతే కాని ఎక్కడో నివాసం వుండే నాయకుడిని, సంబంధం లేని వార్డులలో టిక్కెట్టు ఇవ్వడం వల్ల ఆ నాయకుడు అందుబాటులో వుండలేరు. ప్రజలకు ఆ నాయకుడి దగ్గరకు వెళ్లలేరు. ప్రజలకు నిత్యం స్ధానికంగా అందుబాటులో వుండే నాయకులను కాదని, బిఆరఎస్ నేల విడిచి సాము చేసింది ఓటమిని కొని తెచ్చుకున్నది. అతి విశ్వాసం మరోసారి బిఆరఎస్ కొంప ముంచింది.
