Excise Raids on Illicit Liquor Units
గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ ఆకస్మిక దాడులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
అక్రమంగా నాటు సారును తయారు చేస్తే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నర్సంపేట ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని నందిగామ, రేలకుంట గ్రామాలలో జిల్లా, రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ దాడులలో 800 లీటర్ల చక్కెర పానకం ధ్వంసం చేసి 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భవిష్యత్తులో నాటు సారును తయారు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ దాడులలో జిల్లా టాస్క్ ఫోర్స్ రమేష్ చందర్, స్టేట్ టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు, ట్రైనీ ఎస్ఐ నరేష్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
