Vang Shireesha Ravi Campaigns for Marginalized Communities
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే పోటీ:
*ఇంటింటి ప్రచారం చేస్తున్న వంగ శిరీష రవి
నర్సంపేట, నేటిధాత్రి:
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే
నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగ శిరీష రవి తెలిపారు. బిసి రాజ్యాధికార సమితి నుండి 17 వ వార్డు అభ్యర్థిగా పోటీ బరిలో నిలిచిన వంగ శిరీష రవి లు ప్రచారంలో దూసుకు పోతున్నారు.గెలుపే లక్ష్యంగా నామినేషన్ వేసిన మరుసటి రోజు నుండి శిరీష రవిలు ప్రచారం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.17 వార్డులో అన్ని వర్గాల ప్రజలను సమ తుల్యం చేస్తూ ప్రచారా న్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అగ్రవర్ణాల ఆధిపత్యంలో అణగారి పోతున్న బీసీలను చైతన్య పరచడం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు.దాసి సురేష్,పాలూరీ రామకృష్ణయ్య సహకారంతో పోటీలో ఉన్నట్లు తెలిపారు. బీసీల ఐక్యత కోసం పోరాడుతున్న వివిధ రాజకీయ పార్టీ నాయకుల సమన్వయంతో 17వ వార్డు ప్రచారం కొనసాగిస్తున్నట్లు వివరించారు. అన్ని వర్గాల ప్రజలు తమను గెలిపించా లనే సంకల్పంతో ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నట్లు తెలిపారు.మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అక్రమాలను వెలికితీయ డంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్న వంగ శిరీషను ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో మహిళలకు విజ్ఞప్తి చేశారు. మీ సమస్య తన సమస్యగా పరిగణలోనికి తీసుకొని సహకరిస్తానని ప్రజలకు మంగ శిరీష రవీలు హామీ ఇచ్చారు. వార్డు సమస్యల తో పాటు ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించడానికి అధికారుల సహకారం తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమ, శ్రీలత, షాహిన్, సాంబశివ, సుల్తానా, జరీనా, షమీం బేగం, నూర్జాన్, అమల, అనిత, రవి, భాష నవీన్, రమేష్ పాల్గొన్నారు.
