Armed Reserve Constables Save Life with CPR
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్,గంగారాజు.
తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిన వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన అక్కడే విధులు నిర్వహిస్తున్న గంగారాజు,శ్రీనివాస్.
కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు ని అభినందించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.
సిరిసిల్ల/వేములవాడ(నేటి ధాత్రి):
ఈరోజు ఉదయం నాంపెళ్లి గ్రామానికి చెందిన రమేష్ , వయస్సు 49 అనే వ్యక్తి తిప్పపూర్ బస్టాండ్ వద్ద హార్ట్ ఎటాక్ తో కుప్పకూలగా అక్కడే విధులలో ఉన్న కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు వెంటనే స్పందించి సీపీఆర్ చేసి వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కానిస్టేబుల్స్ చాకచక్యంగా వ్యవహరించడంతో రమేష్ ప్రాణాలతో బయటపడ్డారు.సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్స్ శ్రీనివాస్,గంగారాజు లను నెటిజన్లు అభినందిస్తున్నారు.
హార్ట్ ఎటాక్ వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.
