Dattatreya Jayanti Celebrations in Bardipur
బర్దిపూర్ దత్తాత్రేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,
◆:- జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్…
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్లో దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ ప్రవేశద్వారం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ దత్తగిరి ఆశ్రమ మహారాజు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షుడు హనుమంత్ రావు పాటిల్, వేణుగోపాల్ రెడ్డి గారు, సంగ్రామ్ పాటిల్, మారుతి, ఏఎంసి డైరెక్టర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
