అందరూ బిఆర్‌ఎస్‌ బాటలోనే! అన్ని పార్టీలు బడుగుల జపమే!!

`బలమైన నాయకుడు కేసిఆర్‌ అడుగుజాడలే…

`అన్ని పార్టీలలో ఆమోదమే..

`ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్‌ లో అత్యంత ప్రాధాన్యత.

`సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట.

`అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క.

`బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు అండ సంకేతాలు.

`అదే బాటలో బిజేపి పయనం.

`ఈటెల ఎంపికలో అదే పరమార్ధం.

`కాంగ్రెస్‌ లో కూడా మొదలైన బడుగుల జపం.

`పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ తో ఒక్కసారిగా కలకలం.

`కాంగ్రెస్‌ ను ఇంత కాలం కాపాడిరది బడుగు నేతలే.

`కాంగ్రెస్‌ కు ఎల్లకాలం ఓటు బ్యాంకు బడుగులే.

`అందరూ ఇప్పుడు బడుగుల నినాదమే.

`పటించేది బడుగుల మంత్రమా!

 పార్టీల కొంగ జపమా!?

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

తెలంగాణ రాజకీయాల్లో ఏ విషయం గమనించినా అందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముద్రనే స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, ప్రతిపక్షాల ఆలోచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలను కేసిఆర్‌ వేలు పట్టుకొని నడిపిస్తున్నాడా? లేక ప్రతిపక్షాలే కేసిఆర్‌ వేలు పుట్టుకొని నడుస్తున్నాయో? అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు విమర్శించే ప్రతిపక్ష కాంగ్రెస్‌,బిజేపిలు అవే పధకాలకు మరింత ఆర్ధికమద్ది ప్రచారాస్త్రాలు చేసుకుంటున్నాయి. దానికి తోడు ప్రతి క్షణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తూ, వాటినే అనుసరించడం కూడా ప్రతిపక్షాలు అలవాటు చేసుకుంటున్నాయి. తాజాగా బిఆర్‌ఎస్‌ ఈసారి వచ్చే ఎన్నికల్లో బడుగులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలనీ బడుగుల ఆర్ధిక స్వేచ్ఛ ,స్వాలంబన మిలితమై వుంటున్నాయి. అందులో భాగంగానే వేసే ప్రతి అడుగు పేదలైన బడుగులు సంక్షేమం కోసం చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఆది నుంచి అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు కూడా పేదలైన బడుగుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు, వారి జీవితాలకు భరోసా కల్పించేందుకు ఎంతో ఉపయోపడుతున్నాయి. అయితే ఆసరా అన్నది కేవలం పేదరికమే ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబాకర్‌ లాంటవి కూడ అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అయినా బగుడుల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయా వర్గాలు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా సమానత్వాన్ని సాధించాలి. ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. అందుకే తెలంగాణలో దళిత బంధు అనే పధకం ప్రారంభించారు. నిజానికి ఇది గొప్ప పధకం. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి పథకం అమలు జరగలేదు. ప్రపంచానికి సమానత్వ పాఠాన్ని చెప్పిన ప్రాన్స్‌లో కూడా ఇలాంటి గొప్ప పధకాలు ఏనాడు లేదు. ఎందుకంటే ప్రపంచ గతినే మర్చిన ప్రాన్స్‌ విప్లవం ఒక గొప్ప మలుపు. ఒక్క రొట్టె ముక్క కోసం వచ్చిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. ఆకలి కోపం ఎలా వుంటుందో పాలకులకు రుచి చూపించిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. అలాంటి దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ్రుం వున్నప్పటికీ పేదల సంక్షేమం, ఆర్ధిక స్వావలంబన కోసం ఏనాడు కృషి చేసింది లేదు. ఆకలి, ఆర్ధిక, సామాజిక అసమానత్వాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. అందుకు ప్రాన్స్‌ విప్లవం ఒక ఉదాహరణ. బాస్టిలీ జైలు ఉదంతం ఒక నిర్ధారణ. అయినా ప్రాన్స్‌లో సహజంగా వచ్చిన మార్పులోనే అన్ని వర్గాలు అక్కడ ఎదిగాయి. కాని మొదటిసారి ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమం అన్న పదానికి కొత్త అర్ధం చెప్పారు. దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది దళితుల కుటుంబ జీవితాల్లో వెలుగులొచ్చాయి. తెలంగాణలోని మొత్తం దళిత సమాజాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వారి జీవితాలను దీర్చిదిద్దుతున్నారు. దశల వారిగా దళిత బంధు విడుదల చేస్తూ వారికి ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజన బంధు ప్రకటించారు. అంతకు ముందే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాజాగా వాటిని కూడ గిరిజనులకు అందజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పోడు భూముల సమస్యల ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పరిష్కారం కాలేదు. అలా గిరిజనుల జీవితాలను కూడా పండగ చేస్తున్నారు. ఈ మధ్య బిసిలకు లక్ష సాయం పథకం ప్రకటించారు. త్వరలో అది కూడా అమలు కానున్నది. ఇలా బిడుగుల కోసం ఒక్కొక్కటీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. సమాజంలో అసమానతలు రూపు మాపే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రజలకు వచ్చేఎన్నికల్లో ఏం చెప్పాలో తోయడం లేదు. దళిత బంధును పెంచి ప్రకటిస్తామా? అంటే అది బిఆర్‌ఎస్‌ పార్టీని కాపీ కొట్టినట్లే అవుతుంది. ఏ పధకం ప్రకటించాలన్నా వాటికి పేటెంట్‌ రైట్లు బిఆర్‌ఎస్‌ వే అన్న భావన కల్గుతోంది. తాజాగా ఆయా పార్టీలు రాజకీయాల్లో బడుగులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన చేయకముందే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈసారి ఎన్నికల్లో బడుగు నేతలుకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తేఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నాడని తెలిసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా బిడుగుల జపం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 

బిజేపి తీసుకున్న తాజాగా నిర్ణయాల్లో కూడా బడుగుల వైపు బిజేపి కూడా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. 

అందుకే పైకి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసినా, ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలున్నాయన్న అంచనాకు బిజేపి పెద్దలొచ్చారు. అందుకే కర్నాటక ఎన్నికల తర్వాత బిజేపి సినారియా మారింది. గత కొంత కాలంగా అటూ, ఇటూ డైలమా కొనసాగించినా, తెలంగాణలో బిజేపి బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా బడుగుల కార్డు వినియోగించుకుంటే తప్ప మనుగడ సాగించలేమన్నది గుర్తించింది. నిజానికి తెలంగాణలో కూడా బడుగుల నేత సంజయ్‌ నేతృత్వంలోనే పార్టీకి ఊపు వచ్చింది. కాని ఆయన దూకుడే పార్టీని కొంప ముంచేలా వుందన్న తేలిపోయింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ ఖాళీ అయ్యే పరిస్ధితికి వచ్చింది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే బండి సంజయ్‌ బలం సరిపోదు. ఆయన వుంటే పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్ధితి కనిపించడం లేదన్నది తెలిపోయింది. బిజేపిలోఒక్కసారిగా పెరిగిన అరువు నేతలే, పార్టీని ముంచడమా? తేల్చడమా? అన్నదాకా రావడంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం బిజేపికి కల్గింది. దాంతో బిజేపి కూడా బిసి జపం చేయాల్సి వస్తోంది. ఎందుకుంటే బిఆర్‌ఎస్‌ మీద ప్రతిపక్షాలు ఓ ముద్ర వేశాయి. కాంగ్రెస్‌ మీద మరో ముద్ర వుండనేవుంది. దాంతో బిఆర్‌ఎస్‌ అన్నది ఇటీవల బడుగుల పార్టీ ప్రజలు అక్కున చేర్చుకునేందుకు అనేక పధకాలు అమలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయమే…దాన్ని కూడా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్సే…మేమేం తక్కువ..మాకేం తక్కువ. మాకు వున్న ఓటు బ్యాంకు బలమే బడుగులు అన్నది తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ కూడా కొత్తఎత్తులకు సిద్దపడుతోంది. 

 కాంగ్రెస్‌లో మాత్రం ఒక తరహా తిరుగుబాటు కూడా మొదలైనట్లే కనిపిస్తోంది. 

మాజీ పిసిసి. అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తాజగా విడుదల చేసిన బిసి నేతల జాబితాతో కాంగ్రెస్‌లో ఒక కల్లోలం మొదలైనట్లే లెక్క. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓట్లు బడుగులవి..సీట్లు రెడ్లవి అన్న నానుడి వుండేది. వారి పెత్తనమే ఎప్పుడూ సాగేది. అటు ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చినా అదే దోరణ కనిపిస్తోంది. మొదటి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించినా, ఆ తర్వాత ఇద్దరూ రెడ్డి నేతలను పిసిసిలుగా నియమించారు. నేను పిసిసి అధ్యక్షుడినౌతా అంటూ విహెచ్‌. హనుమంతరావు , దామోదర రాజనర్సింహా లాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా చేసేవారు లేరు. వారి గోడు వినేవారు లేరు. కాని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి లాంటి వారి వార్తలు మాత్రం చక్కర్లు కొడతాయి. ఇదీ కాంగ్రెస్‌ తీరు. మరి ఈసారైనా జెండా ఎగరేయాలంటే అదే మూస కాంగ్రెస్‌ వెళ్తుందో..లేక బడుగుల జపం చేస్తుందో చూడాలి.

నటి రంజిత ఇప్పుడు కైలాస ప్రధాని!

తమిళనాడుకు చెందిన బాబా నిత్యానంద బెంగళూరులో ఆశ్రమం నడుపుతున్న సమయంలో అతనిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదైంది. 

ఆ తర్వాత అతడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కొన్నేళ్ల క్రితం భారత్‌ నుంచి పారిపోయిన నిత్యానంద తన శిష్యులతో కలిసి కైలాస అనే ఏకాంత ద్వీపంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు.

ఈ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్టు, రూపాయి నాణేలు, ప్రత్యేక జెండా ప్రకటించి అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేలా పలు దేశాల అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు. 

అదేవిధంగా, నిత్యానంద నినార్క్ నగర పాలక సంస్థ నిత్యానంద కైలాసాన్ని సార్వభౌమ రాజ్యంగా గుర్తించింది. నిత్యానంద భౌతికంగా గాయపడ్డారని ఇటీవల వార్తలు వచ్చిన తర్వాత, ఆమె లింక్డ్‌ఇన్ పేజీలో రంజిత ఫోటోను నిత్యాంత మాయి స్వామి అని చూపించారు. 

Ranjitha

దాని క్రింద కైలాస ప్రధాని అని పేర్కొన్నారు. ఈ సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని బట్టి కైలాస ద్వీపానికి రంజితను ప్రధానిని చేసినట్లు తెలుస్తోంది.

నాగుర్ల వెంకన్న కు పరకాల టికెట్ ఇవ్వాలి

నాగుర్ల వెంకన్నను పరకాల నియోజక వర్గం బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించాలి.

పరకాల నియోజక వర్గం నుండి వెనుక బడిన సామాజిక వర్గం ఆరె కులానికి అవకాశం ఇవ్వాలి.

తేది: 7-7-2023 రోజున ఉదయం 11.00 గం. పరకాల పట్టణం లోని మయూరి గార్డెన్స్ లో ఆరె కుల సంక్షేమ సంఘం సదస్సు పరకాల మండల ప్రధాన కార్యదర్శి అడగాని జనార్ధన్ అద్యక్షతన జరిగినది. ఈ సదస్సుకు ముఖ్య అతిదులుగా జిల్లా అధ్యక్షులు హింగె శివాజీ, ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు జిల్లా కమిటి సభ్యులు హాజరైనారు.

అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో ఆరె సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షుడు హింగె శివాజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లోని ఆరె కులస్తులు ఆర్ధిక,సామాజిక రాజకీయ సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది.ఈ సమస్యలు అన్ని పరిష్కారం కావాలంటే ఆరె కులస్థుల నుండి కొందరు చట్టసభలలో ఉండాలి,అప్పుడు మాత్రమే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆరె కుల ముద్దు బిడ్డ నాగుర్ల వెంకన్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుండి నేటి భారత రాష్ట్ర సమితి రూపాంతరం చెందే వరకు పార్టీకి అధిష్టానానికి విధేయుడుగా ఉంటూ పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. పరకాల నియోజక వర్గం లో పుట్టి పెరిగి అన్ని వర్గాల ఆశీర్వాదం పొందుతున్న నాయకుడు సౌమ్యుడు వివాద రహితుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు, బడుగు బలహీన వర్గాల గొంతుక నాగుర్ల వెంకన్న. కాబట్టి మా ఆరె కులం నుండి పరకాల నియోజక వర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్దిగా నాగుర్ల వెంకన్న గారికి అవకాశం ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.

జిల్లా ముఖ్య సలహా దారులు పేర్వాల లింగమూర్తి మాట్లాడుతూ పరకాల నియోజక వర్గం లో ఆరె కుల సామాజిక వర్గం ఓట్లు సుమారు గా 20,000 వరకు ఉంటాయి. ఆరె కులస్థులు తెలంగాణా రాష్ట్రం లోని 20 నియోజక వర్గాలలో గెలుపు, ఓటములను నిర్ణయించే బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు. కాబట్టి పరకాలలో నాగుర్ల వెంకన్న గారికి టికెట్ ఇవ్వడం వల్ల 20 నియోజక వర్గాలలో ఉన్న మా అరె కులస్థులు పూర్తిగా బి.ఆర్.ఎస్ వెంట నడుస్తారు. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో తెలంగాణ సాధిస్తామని ఆశ లేని రోజులలో తెలంగాణ సాధన కోసం కేసీఆర్ గారు వేసిన అడుగులో అడుగై కేసీఆర్ గారి పిలుపునందుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అతి ముఖ్య నాయకులలో నాగుర్ల వెంకన్న ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ఊరూరా జండా గద్దెలు నిర్మించి తెలంగాణ నినాదాన్ని పల్లె పల్లెకు మోసుకెళ్లిన ఉద్యమకారుడు నాగుర్ల వెంకన్న. పార్టీ ఒడుదుడుకుల సమయంలో కూడా కేసీఆర్ గారి వెన్నంటి ఉన్న నాయకుడు,పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించిన క్రమశిక్షణ కలిగిన నాయకుడు, పార్టీ ఏ అవకాశం ఇచ్చిన ఆ పదవికి వన్నెతెచ్చిన శ్రమజీవి, పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ఎన్నో రకాలుగా త్యాగం చేసినటువంటి ఉద్యమకారుడు, మచ్చ లేని నాయకుడు నాగుర్ల వెంకన్న.

నాగుర్ల వెంకన్న గారి సేవలను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈసారి బి.ఆర్.ఎస్ పార్టీ పరకాల నియోజకవర్గం అభ్యర్థిగా నాగుర్ల వెంకన్నను ప్రకటించాలని ఆరె కులం నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. 

ఈ కార్య క్రమం లో జిల్లా కమిటి సభ్యులు కొల్లూరి కండేరావు, కుడ్లే మనోహర్ రావు,నాగుర్ల రాజేశ్వర్ రావు, హింగే భాస్కర్, వరికెల కిషన్ రావు, కుడ్లే సుధాకర్ రావు, సిరిసె చందర్ రావు, వాడికారి లక్ష్మన్ రావు, తుమ్మనపల్లి శ్రీనివాస్,అవేలి శ్రీనివాస్,

అంబీరు శ్రీనివాస్,

పరకాల మండల కమిటి సభ్యులు వాడికారి శివాజీ,నాగుర్ల శ్రీనివాస్,ఇజ్జిగిరి రాజేందర్,బాదరగాని రాకేష్

నడికూడ మండల అద్యక్షులు లోకటి నగేష్, వాంకే రాజు, గుబిరే సుధాకర్,పేర్వాల రత్నాకర్ వరికెల రాజు, నాగుర్ల రాజీరు, సూరావు కిషన్ రావు, సురావు బాబురావు, సురావు శివరావు,మోకిడే రాజు, లోనె సతీష్ , నాగుర్ల బాబు రావు,సురావు నర్సింగరావు, భూపాల పల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వాడికారి కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన.. షెడ్యూల్‌

హైదరాబాద్‌

నేటిధాత్రి  జులై 07

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. శనివారం 8న ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్‌ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు..

లేని పెత్తనం’పొంగు’తోంది!?

`‘కమ్మ’ను దాటి ఖమ్మంలో ‘రెడ్డి’ గెలిచేనా?

`‘రెడ్డి’ ముందు ‘రావు’లు సాగిలపడేనా?

`మొత్తంగా కాంగ్రెస్‌ కొంప మునిగేనా?

`పొంగులేటి లేని పోరు కాంగ్రెస్‌ వల్ల కాదా?

 `పొంగులేటి ముందు పార్టీ మోకరిల్లడమా?

`డబ్బు చుట్టూ ఖమ్మం కాంగ్రెస్‌ రాజకీయమా?

`ఖమ్మంలో ప్రజా బలం వున్న నాయకులకు కొదువా?

-పార్టీని నిలబెడుతున్న భట్టి బలం చాలదా?

– రేణుకా చౌదరి అభయం, అనుభవం సరిపోదా?

-పార్టీని బతికిస్తున్న నాయకుల బలానికి కొదువా?

-అసలుపొంగులేటి పవరెంత?

`డాబు,డాంబికమంత!?

`డబ్బు తోనే రాజకీయాలు సాగవు?

`పైన పటారం లోన లొటారం!

`పొంగులేటి అంత బలవంతుడైతే గత ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు సీట్లెందుకు రాలేదు?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. 135 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీకి దిక్కూ దివానం లేనట్లు, కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితేనే బతికి బట్టకడుతుందన్నట్లు సాగుతున్న వ్యవహారం విచిత్రంగా వుంది. పైగా కర్నాకట గెలుపుతోనే కాంగ్రెస్‌కు ఆశలు చిగురించినట్లు, అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి జీవమే లేనట్లు ఆత్మహత్యా సాదృష్యమైన ప్రచారం, ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందే తప్ప లాభం కాదు. ఇదిలా వుంటే నేటిధాత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. పొంగులేటి రాజకీయం వెనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర వున్నట్లు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడో అది నెరవేరకపోయే పరస్ధితులు ఎదురయ్యేలా సూచనలు కనిపిస్తున్న విషయం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేత ఏకంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసే యోచన జగన్‌ చేశారని సమాచారం. అప్పటికే షర్మిల కూడా పార్టీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పొంగులేటి పెట్టిన పార్టీలో షర్మిల జాయిన్‌ అయినా తెలంగాణ వ్యతిరేకి అన్న సంకేతాలు వెళ్తాయి. ఒక వేళ షర్మిల పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరితే తాను ఏం చేయదల్చుకున్నాడో..చెప్పదల్చుకున్నాడో చెప్పకుండానే తెలిసిపోతుంది. అందుకే ఉభయకుశలోపరిగా కాంగ్రెస్‌లో పొంగులేటి జాయిన్‌ అయితే, ఆ తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పెత్తనం మొదలౌతుంది. ఇదీ అసలు స్కెచ్‌. అదే దారిలో పక్కా ప్రణాళిక సాగుతోంది. అందుకే షర్మిల కర్నాటకకు చెందిన డి.కే. శివకుమార్‌ను అభినిందించినట్లు ప్రచారం చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఫీలర్లు వదిలారు. ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినట్లు కనిపించలేదు. షర్మిల ఒక్కతే తెలంగాణ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ఆమెను నమ్మెందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పరిస్ధితి ఎలా వుంటుందో ఇక్కడ షర్మిల రాజకీయం అంతే వుంటుందని అంచనా వేశారు. దాంతో ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకం కావాలి. చక్రం తిప్పగలగాలి. తెలంగాణ రాజకీయాలను శాసించే దాకా పెరగాలి. అందుకు జగన్మోహన్‌రెడ్డి ఆర్ధిక సహాకారం, కేవిపి. చాణక్యం తోడవ్వాలి. ఇదీ అసలు సంగతి. అందుకే రాహుల్‌ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరంలో కేవిపి కలిశారు. మరునాడు ఉదయమే షర్మిల గురించి కేవిపి. రామంచంద్రరావు ప్రకటన చేశారు. ఇదంతా పైకి కనిపిస్తున్నట్లు కొత్త విషయం కాదు. చాలా కాలంగా జరిగుతున్న కసరత్తు అన్నది నేటిధాత్రి ముందు నుంచి చెబుతోంది…తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టేందుకు , గుప్పిట్లోకి తీసుకునేందుకు షర్మిలను తెలంగాణ నాయకురాలను చేసేందుకు జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్లాన్‌ ఇప్పటిదికాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో గమనించారు. అందుకే ఆయనను ఎప్పుడో పక్కనపెట్టారు. తెలంగాణ రాజకీయాలను , కేసిఆర్‌ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటిని పంపించారన్నది దీనితో స్పష్టమైంది. అంతే కాదు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్‌ను కలవడం జరిగింది. అప్పుడే నేటిధాత్రి ఆ మైత్రిలో ఆంతర్యాన్ని అంచనా వేసింది. తర్వాత పరిణామాలను తెలియజేస్తూవస్తోంది. ఖమ్మం సభ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని నేటిధాత్రి రాయడం జరిగింది. కాంగ్రెస్‌లో వైఎస్‌. అనుచరగణమంతా ఏకమౌతోంది? పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏకాకిచేసే ఎత్తుగడ వేస్తున్నారన్నది తెలియజేయడం జరిగింది. 

ఒక్కసారి పొంగులేటి ఎపిసోడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ప్రశ్నించలేదు.

 కేవలం ఒక్క రేణుకా చౌదరి మాత్రమే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమె అదే స్టాండ్‌ మీద వున్నట్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం అంటే అదేదో అద్భుతం జరిగిపోతుందన్నంతగా ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు అంతటి ప్రచారం గతంలో ఏ కాంగ్రెస్‌ నేతకు జరగలేదు. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇందులో కనీసం పదో వంతు ప్రచారం కూడా జరలేదు. అటు, ఇటూ అంటూ గోడ మీద పిల్లిలా పొంగులేటి ఎటు చూస్తే అటు, ఆ పార్టీకి ఇక తిరుగులేదన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లోకి పొంగులేటి వెళ్లడాన్ని ఈ దశాబ్ధికే ఒక అధ్భుతమైన ఘట్టం ఆవిషృతమైనంత గొప్పగా వందిమాగదలు ప్రచారం చేశారు. కాని అసలు లోగుట్టు తెలుసుకోలేకపోయారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులే లేనట్లు, ఆ పార్టీలో చీకటిలో వున్నట్లు, పొంగులేటి ఒక వెలుగు సూర్యుడైనట్లు ఏం ప్రచామది? కాంగ్రెస్‌లోకి పొంగులేటి రావడమే ఒక వరమన్నట్లు ఇంకా ప్రచారం సాగుతూనేవుంది. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చి అంపశయ్య మీద వున్న కాంగ్రెస్‌కు తులిసి తీర్ధమందించినట్లు కూడా గొప్పలకు పోతున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు ఇన్‌స్టంట్‌ శక్తికోసం పొంగులేటి గ్లూకోస్‌ అవసరం అన్నంతగా ఆయన రాకకోసం కొందరు కాంగ్రెస్‌ నాయకులు పాకులాడారు. ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. ఇక భవిష్యత్తు కాంగ్రెస్‌కు జవసత్వాలు రావాలంటే పొంగులేటి అనే హర్లీక్స్‌ లేకపోతే కాంగ్రెస్‌కు కష్టమే అన్నంతగా నాయకులు ఆయన రాకకోసం ఆరాటపడినంతగా సాగిలపడడం విచిత్రం. కొత్తగా ఇప్పుడే కాంగ్రెస్‌ నేతలు కాజు, బాదంలు తింటున్నట్లు, బలవంతులౌతున్నట్లు మరీ విచిత్రం చేస్తున్నారు. ఖమ్మం లాంటి సభలు గతంలో నిర్వహించనట్లు, నా సభ చూశారా…నా ప్రతానం చూశారా…అన్నట్లు పొంగులేటి గొప్పలు చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్‌ను శాసించేది నేనే అన్నంతగా పొంగులేటి ధీమా చూపిస్తున్నాడు. పొంగులేటి రాకతో సీనియర్‌ నాయకులుంతా పక్కకుపోయినంత పనైంది. కాని ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన భరోసా ప్లకార్డును పక్కన పెడేసినట్లు, ఎప్పుడైనా కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయమన్నది ఆరోజే తెలిపోయింది. అంతే కాదు నేను లేనిదే కాంగ్రెస్‌ లేదన్నట్లు, బతికి బట్టకట్టేలా లేదన్నట్లు పొంగులేటి మీడియా సమావేశాలు చూస్తే అర్ధమౌతోంది. కాంగ్రెస్‌లో రూపాయి పెట్టే శక్తి వున్న నాయకుడు ఎవరూ లేరన్నట్లు , తన డబ్బులతోనే కాంగ్రెస్‌ బతకాలన్నట్లు శాసించే స్ధాయిలో వున్నట్లు కూడా ఆయన హవభావాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ కూడా ఘోర పరాభవాన్ని చూసే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయా? అన్న అనుమానం సగటు కాంగ్రెస్‌ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి బలంగానే వుంది. తెలంగాణ వచ్చాక కూడా ఖమ్మంలో 2014లో 9 సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకున్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించింది. మరి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌లోవున్న పొంగులేటి ఆ పార్టీని ఎందుకు గెలిపించలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చేసిన బీరాలు పలికారు. నిజంగా పొంగులేటికి అంత బలమేవుంటే సొంతంగా పార్టీ పెట్టి, తన బలం నిరూపించాలి. కాని ఆయన హిడెన్‌ ఎజెండా ఏమిటో తెలిపోయింది. బిఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీని చెడగొట్టాలని చూశాడు. కాని కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేసి, షర్మిల చేతిలో పెట్టేందుకు జగన్‌ పద్మ వ్యూహంలో పొంగులేటి తనకు తానుగానే చిక్కుకుంటున్నాడు. అంతే…!

ఆ గెట్టు లక్ష..ఈ గెట్టు కోటి!

`అటు ఆంద్రా…ఇటు మహారాష్ట్ర.

` మధ్యలో తెలంగాణ… సిరుల మాగాణ.

` భూముల ధరలు ఎక్కడ విన్నా కోటి.

` తెలంగాణ వెలుగుల దివిటీ

` దేశంలోనే తెలంగాణ భూమి మేటి.

` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి.

` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల.

` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం…

` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం.

` నిన్న దుఖమెల్లవోసిన నేల…

`ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా జల.

` నాడు చుక్కకేడ్చింది…నేడు పొలం మురుస్తోంది.

` పదేళ్ల కింద వలసలు…నేడు బంగారు పంటలు.

`నిన్న దేశాలు పట్టుకొని పోయి…నేడు ఊరిలో శ్రీమంతుడై..

` తెలంగాణ రైతు రాజయ్యాడు…

హైదరబాద్‌,నేటిధాత్రి:                                    

మనిషికైనా, మానుకైనా, పక్షికైనా, ప్రకృతికైనా, ఏ జీవికైనా, చెట్టుకైనా, పుట్టకైనా, భూమికైనా, పాడికైనా , పంటకైనా నీరే ఆధారం. ఆ నీరు లేక గోపడిన తెలంగాణ ఇప్పుడు నీటి గంగాళమైంది. నీటి గోస లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. తెలంగాణ గోదారి నీళ్లతో కళకళలాడుతోంది. అన్నింటికీ నీరే జీవాధారం. ఒకనాడు కాకతీయ కాలమైనా, సర్కారు నిజామైనా నీటి జాడలలు తొనికసలాడిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో విలవిలలాడిరది. చుక్క నీటి కోసం ఎదురు చూసింది. కనికరం లేని ఉమ్మడి పాలకుల చేతిలో కన్నీటిని దిగమింగుకున్నది. తెలంగాణ సాగు నీటి వనరైన చెరువులు ద్వంసం చేయబడ్డాయి. ప్రాజెక్టులు సాధ్యం కాదని తేల్చి, చెప్పి రైతును కష్టాల పాలు చేశారు. ఆ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ చైతన్య గీతికను ఆలపించి, ఉద్యమించి, పోరాటాన్ని ఉరకలెత్తించి, ఉక్కు సంకల్పంతో, పిడికిళ్లు బిగించి, మూడున్న కోట్లు గొంతులు సవరించి, జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి, డిల్లీ గల్లీలో కూడా తెలంగాణ రణ నినాదం చేసి తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్‌. తెలంగాణ తలరాత మార్చిన తనయుడు కేసిఆర్‌. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌…

తెలంగాణ వచ్చింది ఏం మారింది?

ఇది తెలంగాణలోని కొంత మంది కనులుండీ చూడలేని వారి ప్రశ్న. కాని తెలంగాణ వచ్చాక తెలంగాణ పూర్తిగా మారిపోయింది. అసలు ఒకప్పటి తెలంగాణేనా అని అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లే ఎక్కడున్నామన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది తెలంగాణకు వస్తున్నవారు చెబుతున్న మాట. సీమాంధ్రకు చెందిన ఒకప్పటి పాలక నేతలు కూడా చెబుతున్న మాట. తెలంగాణ వస్తే ఇక చీకట్లే అన్న వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తాము తెలంగాణ అభివృద్ది కాంక్షించలేకపోయామని, సహకరించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి తమ చేతగాని తనాన్ని నిరూపించుకుమని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రాంతమే తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రావని అన్న వాళ్లు , తెలంగాణ ఇలా నీళ్లుతో తడుస్తుందని కలలో కూడ అనుకోలేదంటున్నారు. తెలంగాణ చీకటౌతుందనుకున్నాం? కాని అన్నింటినీ అధగిమించింది. సీమాంధ్రను మంచిపోయింది. తెలంగాణ కూడా అన్న పూర్ణగా మారింది. ధాన్యరాసులు పండుతున్నాయి. భూములకు విపరీతమైన ధర వస్తోంది. దేశంలోనే ఇంత డిమాండ్‌ వున్న స్ధలాలు లేవు. దిక్షిణభారత దేశంలోని రాష్ట్రాల గురించి చెప్పుకున్నా ఒకప్పుడు చెన్నై అంటే ఎంగో గొప్పగా చెప్పుకునేవారు. కాని అక్కడ మంచినీటి కటకట. కర్నాకట రాష్ట్రంలోని బెంగుళూరును సిలికాన్‌ వ్యాలీ అంటారు. కాని అక్కడ కూడా పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోయింది. నగరం పెరిగేందుకు స్ధలం లేకుండాపోయింది. హైదరాబాద్‌ సుందరీకరణ అంటే ఒక అద్భుతం. ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ప్రగతి మాయాజాలం. అభివృద్ధి మంత్రం. తెచ్చిన తెలంగాణను బంగారు తునక చేయాలన్న లక్ష్యం. అందుకే తెలంగాణ ఒక అపురూపంగా మారింది. తెలంగాణ అద్భుత కట్టడాలతో అలరాలుతోంది. ప్రతి జిల్లా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడుతోంది. అభివృద్ధి అన్ని జిల్లాలకు సమానంగా పంచబడుతోంది. అన్ని జిల్లాలు సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తున్నాయి. హైదరాబాద్‌ సౌకర్యాలు తెలంగాణలోని దాదాపు అన్ని నరగాల్లోనూ అందుతున్నాయి. అందుకే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూముల విలువ అమాంతం పెరిగింది. 

 తెలంగాణలో భూముల ధరలు దేశంలో ఎక్కడా లేనంతగా పెరిగాయి.

 ప్రజల స్ధిర చరాస్ధులు గణనీయంగా పెరిగిపోయాయి. అందుకు కారణం తెలంగాణ పరిపాలనలో అదొక అద్భుత ఆవిష్కారం. ఒకప్పుడు సీమాంధ్రలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో నాలుగు ఎకరాల స్ధలం కొనుక్కొవచ్చు అన్న మాటలే వినపడేది. కాని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే, సీమాంద్రలో కనీసం వంద ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చు. అని సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అంటే తెలంగాణ ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో భూముల రేట్లు చూసిన అంతే గొప్పగా వున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం అంటూ వుండేవారు. కాని నేడు అదే ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఎకరం భూమి కోటి రూపాయలు దాటి పలుకుతోందంటే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నట్లు కాదు. అదే ఆ పక్కన వున్న మహారాష్ట్రలో ఎకరం కనీసం లక్ష రూపాయలు కూడా పలకడం లేదు. ఇటు వెళ్తే కర్నాకట బోర్డర్‌లో కూడా పెద్దగా భూములకు విలువ లేదు. కొద్దో గొప్పొ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూములకు విలువున్నా, తెలంగాణ భూములతో పోల్చితే ఎక్కడో అట్టుడుగునే వున్నాయి. తెలంగాణ రాక ముందు సరిగ్గా పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తప్ప, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపే వుండేది. కాని నేడు ఏ మారు మూల ప్రాంతమైనా సరే కనీసం రూ.50లక్షలకు తక్కువ లేదు. ఏ జిల్లా కేంద్ర చుట్టు పక్కల ప్రాంతాలైనా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు. ఇదీ తెలంగాణ భూముల విలువ. 

అటు ఆంధ్రా, ఇటు మహారాష్ట్ర, ఆ పక్కనున్న కర్నాకట రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి అబ్బుపడుతున్నారు.

మురిసిపోతున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేవారు. తెలంగాణ పల్లెలను వదిలి ప్రజలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ వసలు వెళ్లేవారు. పాలమూరు గోస గురించి, వలస గురించి ప్రత్యేకంగాచెప్పాల్సి వస్తే రాస్తే రామాయణమంత , వింటే భారతమంతా! వుంటుంది. అదీ పదేళ్ల క్రితం తెలంగాణ బతుకు. కాని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని, ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అయినా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. నిజానికి తెలంగాణ ఇంతలా అభివృద్ది జరుగుతుందిన కాంగ్రెస్‌, బిజేపి పార్టీలు కలగనలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏం చేస్తారో…చూద్దాం అన్నట్లు సీమాంధ్ర నాయకులు ఎదురుచూశారు. తెలంగాణ అభివృద్ది అంటే నీళ్లు తేవడం అంత సులభం కాదని కాంగ్రెస్‌ అనుకుంటూ వచ్చింది. కాని తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో కరంటు వెలుగులు కనిపించే సరికి కాంగ్రెస్‌, బిజేపిల కళ్లు బైర్లు కమ్మాయి. నిరంతర విద్యుత్‌ తెలంగాణలో సరఫరా అవుతుంటే ఇదెలా సాధ్యమౌతుందంటూ ఆశ్చర్యపోయాయి. మనసుంటే మార్గం వుంటుంది. అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో వుంటే ఏదైనా సాధ్యమౌతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఊరు వదిలి వలస వెళ్లిన రైతు తిరిగి పల్లెకు వచ్చాడు. కన్న తల్లి లాంటి ఊరును వదలి, ఆస్ధిగా భావించే సాగు భూమిని వదిలి పొట పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఇప్పుడు ఆ రైతే పల్లెకు మళ్లీ చేరుకున్నాడు. కళ్ల నిండా నీళ్లు చూస్తూ, కడుపారా పొలానికి నీరందిస్తున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. తెలంగాణ రైతు రాజయ్యాడు. ఇదందా సాధ్యం కావడానికి కారణం ఒక్క పేరు..అదే కేసిఆర్‌. ఆయనే తెలంగాణ తల రాత మార్చిన యుగకర్త. తన ప్రాంతం మీద మమకారంతో ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే…ఆయన పేరు తెలంగాణ చరిత్రలో తరతరాలు చెరిగిపోని నిఘంటువే!

*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*


Rahul Gandhi gave importance to Bhatti :

తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్

విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

వాళ్లంతా ఒక్కటే! రేవంత్‌ ఒంటరే!!

`రేవంత్‌ నమ్మిన పొంగులేటి కట్టప్ప రూపమే!

`రేవంత్‌ కు షర్మిల రిటన్‌ గిఫ్ట్‌ కోసమే!

`కాంగ్రెస్‌ కోసం రేవంత్‌ ఎంత కష్టపడ్డా వృధానే!

`తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌లో వున్న బానిసలంతా వైఎస్‌ వీర విధేయులే?

`ఇప్పటికీ వాళ్లు చేసేది వైఎస్‌ జపమే!

`తెలంగాణలో షర్మిల రాకకు కారకులే!

`కొట్లాడిరది రేవంత్‌ ఒక్కడే?

` రేపు రేపు రేవంత్‌ కు చుక్కలే?

`షర్మిలను ముందు పెట్టి రేవంత్‌ ను పక్కకు నెట్టుడే!

`పొంగులేటి రూపంలో పొగబెట్టుడే?

`కోమటి రెడ్డి రూపంలో ఇక మొదలైనట్లే?

`ఘర్‌ వాపసీ రేవంత్‌ మెడకే!

`షర్మిల అడుగుతో మళ్ళీ మొదటికే!

`పొంగులేటి కాంగ్రెస్‌ లో చేరడం వెనక వున్నది జగనే!

`ఇదంతా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గమే!

`తెలంగాణలో వైఎస్‌ కుటుంబం పెత్తనం లక్ష్యమే?

`జగన్‌ ను కాదన్న కాంగ్రెస్‌ ను కాళ్లకాడికి తెచ్చుకోవడం కోసమే!

`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెత్తనం ఆంద్రా వాళ్లదే?

`షర్మిలను తెచ్చుకొని నెత్తిమీద కుంపటి పెట్టుకోవడమే!

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలది బానిస మనస్తత్వమే!

`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్‌ ను అదను చూసి సాగనంపుడే?

`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్‌ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్‌ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్‌ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది. 

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్‌ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్‌ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్‌ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో వైఎస్‌ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం. 

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు. 

కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్‌ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్‌ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్‌ వినలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్‌ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్‌ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్‌ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్‌ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్‌ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్‌ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్‌ పుల్‌ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్‌ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్‌ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!

*బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ రాజీనామా

నూతన అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి

ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్

నేటిధాత్రి హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి బండి సంజయ్ మంగళవారం రాజీనామా చేశారు. రెండు రోజులుగా ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితర జాతీయ నాయకులతో భేటీ ముగిసిన అనంతరం సంజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును తొలగించి ఆయన స్థానంలో మాజీ మంత్రి పురంధేశ్వరిని నియమించింది.

కాంగ్రెస్ “గ్యారంటీ” తో కొత్త మలుపు… బీఆర్ఎస్ లో కుదుపు

Congress Party :

తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు “గ్యారంటీ” చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో మొదలై..ఖమ్మంలో  తుఫాను గా మారిన కాంగ్రెస్ ప్రభంజనం ఇప్పుడు “గ్యారెంటీ ” తో అధికారం దిశగా దూసుకెళ్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన చేయూత పథకం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు కారణమవుతోంది. పక్కా ప్రణాళికతో ప్రతీ కుటుంబానికి దగ్గరయ్యేలా ప్రకటించిన చేయూత బీఆర్ఎస్ కోటను కదిలించి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ నే టార్గెట్ చేసారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేయూత పథకం ద్వారా రూ. 4000 పెన్షన్ ఇస్తామని ప్రకటన చేసారు.ఆదివాసీలకు పోడు భూములు ఇచ్చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు. అక్కడ ఫార్ములానే ఇక్కడ అమలు చేయటానికి రాహుల్ నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి తాము అందిస్తున్న పెన్షన్ ..సంక్షేమం పైన భారీగా ప్రచారం చేసుకుంటోంది. అయినా..అమలులో మాత్రం భారీగా వైఫల్యం కనిపిస్తోంది.

ఈ సమయంలో రాహుల్ చేసిన ప్రకటన పైన పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఓట్ల వర్షం కురిపిస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పెన్షన్ల పంపిణీలో కొర్రీలు..ఆలస్యం..సక్రమంగా లేని అమలు వంటి వాటితో లబ్దిదారులు విసుగు చెందారు. కర్ణాటకలో అమలు చేస్తున్న తరహా విధానం ఇప్పుడు ప్రజలను ఆకట్టుకుంటోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా రూ 75 ఉన్న పెన్షన్ ను రూ 200 కి పెంచి అమలు చేసి నమ్మకం నిలబెట్టుకుంది. తిరిగి ఇప్పుడు మరోసారి కాంగ్రెస్..అందునా రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటన చేయటంతో ప్రజల్లో నమ్మకం కనిపిస్తోంది. తెలంగాణలో మెజార్టీ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలకు  మేలు చేయనుంది. ఫలితంగా పార్టీకి ప్రయోజనంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, వారి ధనిక మిత్రులు ఓవైపు ఉంటే.. మరోవైపు రైతులు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీలు, చిరు వ్యాపారులు ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో ఆలోచన మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వరంగల్‌లో రైతు డిక్లరేషన్ మరియు హైదరాబాద్‌లో యువజన డిక్లరేషన్‌ను ప్రకటించింది, నిన్న రాహుల్ గాంధీ సీనియర్ సిటిజన్‌లు మరియు వితంతువులకు నెలకు రూ.4,000 గ్యారెంటీ పెన్షన్ ప్రకటించారు. .

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోడు భూమిని ఆదివాసీలకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారం కు దగ్గర చేసే నిర్ణయాలుగా కనిపిస్తున్నాయి. కర్టాటకలో ఇవే తరహా హామీలతో ఓట్ల వర్షం కురిసింది. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా ప్లాన్ రాహుల్ అమలు చేస్తుండటంతో అధికార బీఆర్ఎస్ కు షాక్ గా మారింది. కేసీఆర్ ఓట్ బ్యాంక్ చెల్లా చెదురు అవ్వటం ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి.

భట్టికి రాహుల్ ప్రాధాన్యత…ఒకే కారులో గన్నవరంకు..మంతనాలు

Khammam Janagarjana Sabha  Update :

ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది మంది ప్రజల సమక్షంలో పార్టీ తరపున భట్టిని సత్కరించారు. పార్టీని కదిలించారు..కీపిట్ అప్ అంటూ ప్రశంసించారు. సభలో భట్టి ప్రసంగం..కార్యకర్తల నుంచి స్పందనను రాహుల్ నిశితంగా పరిశీలించారు. భట్టి తన యాత్రలో పేదలకు ఇచ్చిన అంశాలను పరిశీలించి మేనిఫెస్టోలో అవకాశం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. సభ ముగిసిన తరువాత గన్నవరం వరకు రాహుల్ తో పాటుగా భట్టి ఒకే కారులో గన్నవరం వరకు వెళ్లారు. పార్టీ గురించి రాహుల్ కీలక సూచనలు చేసారు.

ఖమ్మం సభలో నేతలంతా ఒకే చోట…కార్యకర్తలంతా ఒకే సభ అన్నట్లుగా నిర్వహించటం పైన రాహుల్ హ్యాపీ ఫీలయ్యారు. గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఖమ్మం చేరుకున్న తరువాత రాహుల్ సభా ప్రాంగణంకు చేరుకొనే సమయానికి ఆ ప్రాంతమంతా పార్టీ కార్యకర్తలు..జెండాలతో నిండిపోయింది. సభలో రాహుల్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. బీఆర్ఎస్ తో పొత్తు పైన జరుగుతున్న ప్రచారానికి రాహుల్ ముగింపు పలికారు. బీజేపీకి బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీజేపీ లేదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు మంచి స్పందన కనిపించింది. కాంగ్రెస్..బీఆర్ఎస్ మధ్యనే పోటీ అని రాహుల్ ప్రకటించారు.

రాహుల్ ఇదే సభలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు భట్టి విక్రమార్కకు అభినందనలు అంటూ చెబుతున్న సమయంలో సభలో హర్ష ధ్వానాలు మారు మ్రోగాయి. సభ ప్రాంగణంకు చేరుకున్న సమయం నుంచి తిరిగి వెళ్లే వరకు ప్రతీ సందర్భంలోనూ భట్టి విక్రమార్కకు రాహుల్ ప్రాధాన్యత ఇవ్వటం కనిపించింది. సభలో రాహుల్ కంటే ముందు ప్రసంగించే అవకాశం భట్టి..పొంగులేటికి కల్పించారు. భట్టి తన పాదయాత్ర అనుభవలాను వివరించారు. పేదల పక్షాల కాంగ్రెస్ నిలబడుతుందని రాహుల్ సమక్షంలో ప్రకటించారు. బీఆర్ఎస్ పైన ఖమ్మం వేదికగా గర్జించారు. కాంగ్రెస్ అధికారం ఖాయమని రాహుల్ ముందే ధీమా వ్యక్తం చేసారు.

ఎదుర్కోవటం పైన క్షేత్ర స్థాయిలో ఉన్న అంశాలు.. పార్టీలోని పరిస్థితుల పైన భట్టి వివరించినట్లు తెలుస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర..ఖమ్మం సభ నిర్వహణ పైన భట్టిని రాహుల్ ప్రత్యేకంగా అభినందించారు. సభకు తరలి వచ్చిన జనసందోహంతో ట్రాఫిక్ లో రాహుల్ చిక్కుకున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దిశగా తొలి అడుగు సక్సెస్ అయిందని పార్టీ నేతలు ఖుషీ అవుతున్నారు

తవ్వుకుంటే…కబ్జాలు బైటపడినట్లు!?

`బాజాప్త కబ్జా …అయితే ఏంది!? : ముత్తిరెడ్డి సమర్థింపు.

` నువ్వు కబ్జాలు చేయలేదా?

` నేనొక్కడినే చేశానా?

`నీ కబ్జాల చిట్టా మొత్తం నా దగ్గర వుంది?

` నేను ప్రజల కోసం కబ్జా చేసిన?

`ముత్తిరెడ్డి వింత వాదన?

`ప్రజా సేవ కోసం కబ్జానా జనం చీకొట్టరా? 

`ఇలా చెప్పే వాళ్లను సమర్థిస్తారా?

`వినేవాళ్లు వెర్రివెంగలప్పలా?https://netidhatri.com/what-is-left-for-the-congress-is-a-dream/

 

 

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కబ్జా చేయడం తనకు జాగీరైనట్లు, అది తప్పే కానట్లు, చేసింది గొప్ప పని అన్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పిన సుద్దులు ఆశ్చర్యకరంగా వుంది. దానికి తోడు నవ్వేమైనా తక్కువా…నువ్వు కబ్జాలు చేయలేదా? అంటూ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి గురించి ముత్తిరెడ్డి వ్యాఖ్యానించ ఇద్దరం…దొందేలే అని చెప్పినట్లుంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుంది జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యాఖ్యలు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకైనా అర్థమౌతుందా? అనే దాక వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యాడో…అప్పటి నుంచి వివాదాలే! వివాదాలు!! అయినా కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం, పాలన కోసం ప్రజలు ముత్తిరెడ్డి ని భరిస్తున్నారు. ఇదే వాస్తవమని బిఆర్‌ఎస్‌ నాయకులే అంటున్నారు. ముత్తిరెడ్డి విషయంలో వివాదం లేని సమయం లేదు…సందర్భం లేదు. గతంలో కొంత గంభీరంగా మాట్లాడే వారు. కోపంతో ఊగిపోయేవారు. ఇప్పుడు అదును చూసి అప్పుడప్పుడు ఏడుస్తూవున్నాడు. సమావేశాల్లో కొన్ని సార్లు ఆయనే నిరసన తెలుపుతున్నారు. సభల్లో నేల మీద పడుకొని నిరసనలు తెలియజేస్తాడు. అప్పడే రైతులను బెదిరిస్తాడు. ఏక కాలంలో అనేక డైమన్షన్లు చూపిస్తుంటాడు. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా వింతగా వున్నాయి. అంతే కాదు…నేనింతే! అన్నట్లు వున్నాయి. కబ్జాల విషయంలో తాను బాజాప్త చేశానని ఆయనే ఒప్పుకున్నాడు. పైగా కబ్జా చేసిన స్థలాన్ని జనానికి దానం చేసినంత దాన కర్ణుడిలాగా మాట్లాడుతుంటాడు. ప్రజల భూమిని కబ్జా చేయడమే నేరం. దాన్ని సమర్థించుకోవడం అంతకన్నా నేరం. తన కూతురు అమాయకురాలు కాబట్టి భూమి వదిలేసుకున్నది అని తనే అంటాడు. అలా తన కూతురు చేర్యాల చెరువు భూమి ప్రజలకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని అంటాడు. అంటే తన కూతురు అలా భూమి ఇవ్వడం ఇష్టం లేదని పరోక్షంగా చెప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే కొమ్మూరి ప్రతాపరెడ్డి ఎమ్మెల్యే గా వున్న సమయంలో అనేక అక్రమాలు చేసినట్లు ముత్తిరెడ్డి ప్రకటించారు. వెంచర్‌ చేసి, ప్రజలకు, ప్రభుత్వానికి అందించాల్సిన స్థలం కూడా కొమ్మూరి ఇవ్వలేదని ముత్తిరెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లుగా ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా వుండి ఏం చేస్తున్నట్లు? చోద్యం చూస్తున్నాడా? ఎవరికి చెబుతారు? ఈ కల్లబొల్లి మాటలు అని జనం ఈసడిరచుకున్నారు. కూతురు ను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలలో గెలవాలని సరికొత్త నాటకానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెరతీసినట్లు జనం చెప్పుకుంటున్నారు. చివరగా అసలు విషయం చెప్పుకోవాలి. ఇటీవల ముత్తిరెడ్డి కూతురు తన తండ్రికి వెయ్యి కోట్ల ఆస్థి వుంది. నెలకు కోటిన్నర రెంట్లే వస్తాయి అని చెప్పింది. మళ్ళీ ఎమ్మెల్యే కూతురు తుల్జా భవానీ రెడ్డి మా నాన్న ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్లు సంపాదించుకున్నాడు అని చెప్పింది. ప్రజలు ఒక వేళ ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాతే సంపాదించాడన్న సంకేతాలు వెళ్లే ప్రమాదముందని గ్రహించి సరిదిద్దే ప్రయత్నం చేసింది. అంటే తండ్రి, కూతురు చాలా చక్కని స్క్రీన్‌ ప్లే రచించారు. ఇదిలా ఉంటే జనగామ రాజకీయాలు గుత్తకు తీసుకున్నట్లు, కబ్జాలు వాళ్ల హక్కు అన్నట్లు ఇద్దరు నేతలు ముత్తిరెడ్డి, కొమ్మూరి ల మధ్య సంవాదం చాలా విచిత్రంగా ఉంది. నా బాగోతం నాకు తెలుసు, నీ బాగోతం నాకు తెలుసు అని చెప్పుకుంటూ భలే నాటకాలు ఆడుతున్నారు. ప్రజల ముందుకు వచ్చేది, ఎన్నికలలో నిలబడేది, రాజకీయాలు చేసేది ఇందుకేనా? ప్రజలకు సేవ చేయడం అన్నది అటు ముత్తిరెడ్డి, ఇటు కొమ్మూరి మర్చిపోయారా? ఇక ముత్తిరెడ్డి చెప్పే విషయాలు కొన్ని అటు పార్టీని, ఇటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ను ఇరుకున పట్టేలా? వున్నాయి. నేనేంటో, నేను చేసేవేమిటో అన్నీ సిఎం. కేసిఆర్‌ కు తెలుసు అని చెప్పడంలో ముత్తిరెడ్డి ఆంతర్యమేమిటన్న దానిపై చర్చ మొదలైంది. అసలు ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఇలాంటి వాటిని సమర్థిస్తారా? ఇంకా ఇలాంటి నాయకులను ఉపేక్షిస్తూ పోతే రాజకీయాలంటేనే ప్రజలు విసుగెత్తిపోయే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ముత్తిరెడ్డి, కొమ్మూరి లాంటి నాయకులను రాజకీయాలు చేయడాన్ని ప్రజలు మాత్రం హర్షించరు.

కాంగ్రెస్‌ కు మిగిలేవి కలలే?

` బిజేపికి ఆశలు లేవులే !?

` కాంగ్రెస్‌ ను నమ్మితే నట్టెట మునుగుడే?

` బిజేపిపై జాలి చూపితే బతుకు బజార్ల పడుడే?

`ఖమ్మం సభతో కాంగ్రెస్‌ కథ కంచికే అంటున్న ‘‘మునుగోడు’’ సీనియర్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ నాయకుడు ‘‘నారబోయిన రవి ముదిరాజ్‌’’ ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో మాట్లాడుతూ నమ్మితే గతం దరిద్రమంతా ముందుకు తెస్తారని నాటి అనుభవాలు ఆయన మాటల్లోనే..

` ఒక్కసారి కనికరిస్తే మళ్ళీ పాత కథలే?

` కరంటు కోతలే!

`అర్థరాత్రి కరంటు కష్టాలే?

`మోటార్లు కాలుడే?

`ట్రాన్స్‌ ఫార్మర్లు కరాబే!

` ఎరువులకు రోడ్డెక్కుడే?

`పంటలు ఎండుడే?

` నీటి గోసలే!

` రైతుకు కన్నీళ్లే!

` చెరువులు ఎండుడే?

`కాలువలు పూడుడే!

` కేవిపి పెత్తనం వచ్చుడే!

` తెలంగాణను ఆగం చేసుడే!

`తెలంగాణ కు మళ్లీ అన్యాయం జరుగుడే?

హైదరబాద్‌,నేటిధాత్రి:   

https://netidhatri.com/తవ్వుకుంటే-కబ్జాలు-బె                                 

 

చెల్లని కాసుకు గీతలెక్కువే..కాంగ్రెస్‌కు చెప్పుకునే గొప్పలు ఉట్టివే..!అయినా ఒక్క సభకే ఎగిరెగిరి పడితే…ఉద్యమ కాలం నుంచి మొదలు బిఆర్‌ఎస్‌ సభలేమిటో తెలిసి, కూడా ప్లూటు సింహం లాంటి బిఆర్‌ఎసూ ముందు కాంగ్రెస్‌ జింక ప్లూటు ఊదినట్లుంది. ఒక్కరోజులో వచ్చేది బలుపు కాదు..వాపు..అది రోగంతో సమానం. నిన్నటిదాకా రెండో స్ధానమే దక్కుతుందో లేదో అంటూ మధనపడిరది. మనుగడ కోసం ఆరాటపడిరది. కర్నాటక ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే ఇక్కడ జబ్బలు చర్చుకుంటోంది. ముందే మురవడం మొదలు పెట్టింది. కనీసం అలాగైనా కాంగ్రెస్‌ సంబరపడడం చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అన్నది ఏనాడో మరుగున పడిపోయింది. తెలంగాణకు అరవైఏండ్లు చేసిన నష్టం, పెట్టిన గోస చాలు అని ప్రజలు కాంగ్రెస్‌ను ఎప్పుడో బంగాళా ఖాతంలో కలిపేశారు. ఇంక దానికి మనుగడ అన్నది తెలంగాణలో లేదు. ఒక్క నాయకుడు చేరినందుకే కాంగ్రెస్‌లో జోష్‌ నిండితే ఇప్పుడు వున్న నాయకులంతా దద్దమ్మలమని ఒప్పుకున్నట్లేనా? బిఆర్‌ఎస్‌లో పనికి రాని నాయకుడు కాంగ్రెస్‌లో కళ్లకద్దుకోవడం అంటే ఆ పార్టీ ఎంత దీనావస్ధలో వుందో అర్దం చేసుకోవచ్చు. ఏది ఏమైనా బిఆర్‌ఎస్‌లో పని చేయలేని నేతలు, బిఆర్‌ఎస్‌ నుంచి పంపించిన నేతలతో నింపుకున్న పార్టీలు మాతో పోటీ పడడడం అరువు నేతలే దిక్కుగా బతకడమే! అంతటి దురవస్ధను ఎదుర్కొంటూ కాంగ్రెస్‌ మేమే వస్తాం..అని చెప్పుకోవడం విడ్డూరం. అయినా ప్రజలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయ్యాలో ఒక్క మాట చెప్పగలిగే స్దితి, స్దాయి వారికి లేదు. అందుకే రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్‌కు మిగిలేవి కలలే…అంటున్న మునుగోడు బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్‌ కాంగ్రెస్‌ను తూర్పారపడుతూ చెప్పిన ఆసక్తికరమైన అంశాలు.. పాఠకుల కోసం! ఆయన మాటల్లోనే…

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన గోసలు అన్నీ ఇన్నీ కావు.

 తెలంగాణను నీటి చుక్క ఇవ్వమంటే నలభైఐదేండ్లు గోస పెట్టింది. ఒక్క చుక్క నీరు ఇవ్వలేదు. సాగు ముందుట పడనీయలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా మంచి పని చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వికాసాన్ని చూసి కాంగ్రెస్‌ నాయకులు సిగ్గు పడాలి. కేవలం రాజకీయ స్వార్ధం కోసం తప్ప, తెలంగాణకోసం ఏనాడు ఆలోచించనందుకు కాంగ్రెస్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఉమ్మడిరాష్ట్రంలో చెరువులు బాగు చేస్తే తెలంగాణ ఉద్యమం వుండేదా? ప్రాజెక్టులు కట్టాలన్న సోయి వుండేదా? తెలంగాణపై కక్ష్యపెంచుకున్నట్లు ఉమ్మడి పాలకులు ప్రవర్తిస్తుంటే ఎవరైనా ప్రశ్నించారా? మా తెలంగాణ నిధులు మాకు ఖర్చు చేయాలే అని నిలదీశారా? తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు కట్టరని ఎదురుతిరిగారా? ఆంధ్రలో ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కడుతుంటే కళ్లప్పగించి చూశారు. తెలంగాణకు నీళ్లియమని మొహం మీద చెబితే పదవుల కోసం ఆశపడ్డరు. ఆఖరకు పోతిరెడ్డి పాడుకు నుంచి కూడా నీళ్లు తీసుకుపోతుంటే అడగలేదు. సీలేరు నుంచి కరంటు ఎందుకియ్యరు? అనలేదు. తెలంగాణ చీకట్లు చూసింది. విలవిలలాడిపోయింది. అలాంటి కాంగ్రెస్‌ నేతలా రేపు తెలంగాణకు ఉపయోపడేది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్‌ పదేళ్లలో చేసి చూపించాడు. తెలంగాణను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. అన్ని రంగాలు సర్వతోముఖాభివృద్ది చేశారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని ప్రయోజనాలు తెలంగాణ ప్రజలు అందుకుంటున్నారు. తెలంగాణ సాగులో విప్లవం తెచ్చాడు. నీటి చుక్క కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన నేలతల్లి దాహం తీర్చిన కొడుకు కేసిఆర్‌. సాగుకు తెలంగాణలోని ప్రతి మూలను సిద్దం చేసిన నాయకుడు కేసిఆర్‌. ప్రతి ఎకరాకు నీళ్లుందిస్తున్న పాలకుడు కేసిఆర్‌. ప్రతి చోట పచ్చదనం వెల్లివిరిసేలా చేసిన పాలనాదక్షుడు కేసిఆర్‌. దేశంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు లేడు. పాలకుడు లేడు. అలాంటి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి కలలు కనడం అంటే పగటి కలలే…అర్ధరాత్రి కలత నిద్రలే..

 ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ చెప్పిన మాట ఇప్పటికీ తెలంగాణ సమాజానికి గుర్తే వుంది. 

కాని కాంగ్రెస్‌ నేతలకే ఆనాడు వినిపించలేదు. ఇప్పుడు గుర్తుకు లేదు. నవ్వేవారి ముందు జారిపడ్డట్టు తెలంగాణ సమాజం ఇక ఎప్పుడూ వెనకడుగు వేయొద్దని చెప్పేవారు. అది ఉద్యమమైనా, ఉద్యమ స్పూర్తితోసాగే పాలనైనా అని తెలంగాణ ప్రజలు ఆనాడు, నేడు ఆచరిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన మాత్రమే కావాలనికోరుకుంటున్నారు. మెరిసే బంగారమంత గొప్పగా తీర్చిదిద్దబడిన తెలంగాణను ఆదమర్చి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ఆశలు నెరవేర్చాలనే జాలి పడితే మళ్లీ తెలంగాణ వందేళ్లు వెనక్కిపోతుంది. ఖమ్మం సభలో కాంగ్రెస్‌నాయకుల తీరు అందరూ చూశారు. ఫోటోలకు ఫోజులిచ్చేందుకు ఒకరినొకరు ఎలా తోసుకున్నారో…చూశాం. రేపు పాలన కూడా అంతే…పదవులు కోసం కాంగ్రెస్‌ నాయకులు పడే తపనతో పాలన గాలికొదిలేస్తారు…తెలంగాణను ఆగం చేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ముందుకు ఐదేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చుతూ, ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు. పైగా ఏ పాలకుడు వచ్చినా సీమాంధ్ర ప్రగతిని కోరుకుంటే తెలంగాణ నాయకులు నోరు మెదపలేదు. తెలంగాణ వచ్చినా ఇంకా సీమాంధ్ర నేతలు కబంద హస్తాల చేతుల్లోనే వుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా ఉమ్మడి రాజధాని పేరుతో కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాల సమయంలో వస్తూ వెళ్తూ వుంటారు. ఒక్కసారి ప్రజలు కాంగ్రెస్‌ మీద జాలి పడితే, పీల్చుకుతింటారు. తెలంగాణను పిప్పి చేస్తారు..కేవిపి లాంటి వారి చేతిలో తెలంగాణ భవిష్యతును పెడతారు? ఇది సామాన్యులకు తెలియని విషయం. 

 అందుకే ఆనాటి గోసలు ఇక ఎప్పుడూ వద్దు. తెలంగాణలో కాంగ్రెస్‌ వద్దే వద్దు. 

 తెలంగాణ రైతు కన్నీళ్లు తుడిచేందుకు సాగుకు నీళ్లివ్వాలంటే ఎన్నో సాకులు చెప్పి, తప్పించుకున్న ఆనాటి పాలకులైన కాంగ్రెస్‌ నేతలుకు కాళేశ్వరం నీళ్లు కనిపించడం లేదా? కాళేశ్వరాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్‌నేతలు ఆనాడే ఎందుకు ప్రాజెక్టులు ఎందుకు కట్టలేదు? తెలంగాణ కోసం ఎందుకు ఆలోచించలేదు. ఆనాడే ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే తెలంగాణ ఎందుకు దు:ఖపడేది. అసలు కాంగ్రెస్‌కు మాట్లాడే నైతిక అర్హత లేదు. తెలంగాణ సమాజం ముందు నిలబడే హక్కు అసలే లేదు. 2001లో తెలంగాణ డిక్లరేషన్‌ అంటూ ప్రకటించి, 2004 ఎన్నికల్లో ఆనాడు బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని పదేళ్లు కాలయాపనచేసి, తెలంగాణను హరిగోస పెట్టింది కాంగ్రెస్‌పార్టీ. ఆఖరకు తెలంగాణ ప్రకటన చేసి, వెనక్కి తీసుకొని తెలంగాణను అగ్ని గుండం చేసింది కాంగ్రెస్‌. ఇక తెలంగాణ ఇవ్వని పరిస్ధితి తెచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమాన్ని చూసి, తప్పని పరిస్ధితుల్లో తెలంగాణ ఇచ్చారు. తెలంగాణ సాధనలో తెలంగాణ కాంగ్రెస్‌నేతలు కృషి ఇసుమంతైనా లేదు. ఇక బిజేపి నాయకులు వంతు అసలే లేదు. కేసిఆర్‌ పండిరచిన పంట కుప్ప మీద పెత్తనం మాకు అన్నట్లు తెచ్చిన తెలంగాణలో పాలన కోసం రెండు పార్టీలు పగటి కలులు కంటున్నాయి. రెండు మూడు స్ధానాల కోసమే కొట్లాడుకుంటున్నాయి. ఆ స్దానాలు దాటి రాలేవు. బిఆర్‌ఎస్‌ ముందు ఆ రెండు పార్టీల కుప్పిగంతులు చెల్లవు.

రాహుల్ గాంధీ లీడ‌ర్ కాదు రీడ‌ర్

రాహుల్ పై మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్

హైద‌రాబాద్ లో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…

రాహుల్ రెండు సార్లూ ఏ ఐ సి సి అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారు

రాసిచ్చింది చడవడమే ఆయన చేస్తున్న పని నిన్నా, మొన్నా గల్లీ లీడర్లు మాట్లాడిన మాటలే ఆయన ఉటంకించారు.

భాజపాకు బి ఆర్ ఎస్ రిశ్తేదార్ కాదు.రాహులే మోడీకి గుత్తేదారు. నాలుగువేల ఫించన్ ఏ హోదాలో ప్రకటించారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇస్తున్న ఫించన్ ఎంత.

ఫించన్ ప్ల కార్డులు రాహులు తెలిసి పట్టుకున్నారా తెలియక పట్టుకున్నారా

నాలుగు వేల ఫించన్ ఇచ్చేది నిజమే అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వడం లేదు

కాంగ్రెస్ పార్టీని కోనఊపిరితో బతికిస్తున్న చత్తీస్ ఘడ్ లో వృద్దులకు ఇచ్చేది 350 రూపాయలే

అదే రాష్ట్రంలో వికలాంగులకు 500,వితతంతువులకు ఇచ్చేది 350.

అదే పార్టీ ఎలుబడిలో ఉన్న రాజస్థాన్ లోనూ వృద్దులకు ఇచ్చేది 750,వికలాంగులకు 750,వితంతువులకు 550 మాత్రమే

సచ్చిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసిన కర్ణాటక లోనూ ఇచ్చేది అంతకంటే ఎక్కువ లేదు

కర్ణాటకలో వృద్దులకు 800,విజలాంగులకు 800,వితంతువులకు 800 రూపాయలే

కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించిన కర్ణాటకలో, కోన ఊపిరితో ఉన్న చత్తీస్ ఘడ్ లో, పార్టీని నిలబెట్టిన రాజస్థాన్ లో 4,000 ఫించన్ ఎందుకు ఇవ్వడం లేదు

అందుకే ఆయనను లీడర్ గా కాకుండా రీడర్ గానే చూడాల్సి వస్తుంది.

గల్లీ నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివి వినిపించారు.

అది కుడా ఆయన ఏ హోదాలో ప్రకటించారు అన్నదే హాస్యాస్పదంగా మారింది

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇవ్వని ఫించన్లు తెలంగాణాలో ఇస్తామని ప్రకటించడానికి సిగ్గుఉండాలి

4,000 ఫించన్ ప్రకటనను ఇక్కడి ప్రజలకు నమ్మ శక్యంగా లేదు

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్వాంగులకు 4,000, వితంతువులకు 2016, వృద్దులకు 2,016 ఇస్తున్నారు.

కాళేశ్వరం కట్టిందే లక్ష కోట్లతో కట్టిన మొత్తంలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేయడం రాహుల్ అజ్ఞానాన్ని బయట పడేసింది.

కాళేశ్వరం కట్టింది నిజమో కాదో తెలియడానికి రాహుల్ మెడిగడ్డ మీద నుండి దూకితే తెలుస్తుంది.అని రాహుల్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు

ఖమ్మం సభలో రాహుల్ వ్యాఖ్యలు అర్థరహితం. .

స్కాముల పార్టీ కాంగ్రెస్ పార్టీ…

బిజెపికి ఏ టీమ్ బీ టీమ్ కాంగ్రెస్ పార్టీనే…

తెలంగాణలో మోకాళ్ల యాత్ర చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రాదు…. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి …

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణంలో జన గర్జన పేరుతో నిర్వహించిన సభలో బీఆర్ఎస్ పార్టీ పై అవాకులు చవాకులు పేలుతున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అర్థరహితమని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కే.వాసుదేవరెడ్డి ఆయన పై నిప్పులు చెరిగారు.ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ డా.కె.వాసుదేవ రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ముందుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యంగా మీ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన బోఫోర్స్ కుంభకోణంతో మొదలుకొని 2G స్పెక్ట్రమ్ లాంటి అనేక స్కాములకు కాంగ్రెస్ పార్టీ నిలయమని అది ముందు మీరు గుర్తుంచుకోవాలని సూచించారు. 2018 ఎలక్షన్లలో రైతులకు 2లక్షల రుణ మాపి అన్నారు, పెన్షన్లు పెంచి ఇస్తామని హామీలు ఇచ్చిన అవి ప్రజలు నమ్మలేదని, తెలంగాణలో ప్రజల చెంతకు పాలనను తీసుకొస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు నమ్మి రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగముందే దర్కాస్తు ఖాని , ధర్నా కానీ చెయ్యక ముందే దివ్యంగులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని ప్రకటించి అమలు చేసే ప్రభుత్వము బిఆర్ఎస్. అసలు మీరు అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంత పెన్షన్లు ఇస్తున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని మోసపూరిత హామీలు ఇస్తున్న మీ మాటలు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మ కు బంగారు గాజులు చేయిస్తా అన్న తీరుగా మారిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అడగకున్నా 200 నుండి 4000 వరకు ఇస్తున్న కేసీఆర్ ఎక్కడ ఆచరణకు నోచుకోేని మీ హామీలు ఎక్కడ అని ప్రశ్నించారు. ఏ సభలో మీరు మాట్లాడిన బిజెపికి బి టీమ్ బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారని అసలు మీ చేతగానితనం వల్లనే బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని,మొన్న నేషనల్ హేరాల్డ్ కేసులో ఐ.టి, ఈడి,సీబీఐ విచారణ ఎందుకు ఆగింది? జైల్లో ఉండాల్సిన మీకు మీ తల్లిగారికి బిజెపి ప్రభుత్వం ఏ విధంగా లబ్ధి చేకూర్చిందో, నరేంద్రమోదీ దయా దక్షిణ్యాల మీద మీరు దేశంలో పర్యటిస్తున్న విషయం ప్రజలకు తెలవదా, అసలు బిజెపికి ఏ టీం, బీ టీం రెండు కాంగ్రెస్సేనని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం అభ్యర్థిని ప్రకటించలేని దుస్థితిలో మీరు ఉన్నారని, రాష్ట్రంలో మీరు మోకాళ్ల యాత్ర చేపట్టిన అమలు కానీ హామీలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలిచి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారని అన్నారు.

*కాంగ్రెస్ మేనియా..హోరెత్తుతున్న పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌*

janagarjana Sabha

Janagarjana Sabha In Khamma :

తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి. అగ్ర‌నేత రాహుల్ గాంధీనే భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భకు హాజ‌రవుతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే ల‌క్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.

భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భ‌ట్టి విక్ర‌మార్క భరత వాక్యం పలికాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించ‌డానికి వేదికగా నిలిచింది.

ఇప్పటి వరకూ ఎవరూ క‌న్నెత్తి చూడ‌డానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వ‌తంత్ర తెలంగాణ రాజ‌కీయాల‌కు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొద‌లుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా భట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రేస్ మేనియా మొద‌లైంది. తాజాగా ఖ‌మ్మం న‌గ‌రంలో త‌ల‌పెట్టిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌తో భట్టి విక్ర‌మార్క నామ‌స్మ‌రణం హోరెత్తుతున్నది.

ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా  ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో అలంకరించారు.

ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు. ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.

యాంకర్‌ తెలివి తెల్లారినట్లే వుంది?

 

`ఆ యాంకర్‌ అతి తెలివి ఛానల్‌ కు చేటు!?

` తన పరువు తాను తీసుకున్న యాంకర్‌!

`అరకొర జ్ఞానం అసలుకే మోసం!

`అల్పులకు అందలం…చరిత్రకు మంగళం!

` నోరుంది కదా! అని అడిగే ముందు అన్ని విషయాలు తెలుసుకోవాలి.

` నాయకులను తప్పుదోవ పట్టించి, అబద్దాలు నిజాలు చేయలేరు!

`కోట్ల విజయభాస్కరరెడ్డి ఏ పదవులు చేపట్టారో తెలుసా?

` ఎంతో తెలిసినట్లు బిల్డప్పు యాంకర్లు?

` ప్రశ్నించే ముందు చరిత్ర తెలుసుకోవాలి.

`ఒక మంత్రిని ఇంటర్వూ చేసినప్పుడు చరిత్రను వక్రీకరించొద్దు!

`చరిత్రకు మరకలంటించొద్దు!

`చరిత్రపై అవగాహన లేని జర్నలిస్టుల వల్ల సమాజానికి చాలా నష్టం!

` ఇటీవల మంత్రి కేటిఆర్‌ ఇంటర్వూలో యాంకర్‌ తప్పుడు ప్రశ్నలు?

` కోట్ల విజయభాస్కరరెడ్డి రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రి?

`అడిగే ముందు కనీస అవగాహన ఎంతో ముఖ్యం?

` తొలుత1982 నుంచి 83 వరకు, తర్వాత 1992 నుంచి 1994 వరకు సిఎం గా పని చేశారు.

`అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఏ మంత్రి రాజీనామా చేయలేదు?

`నేదుమల్లి జనార్ధన రెడ్డి ఇంజనీరింగ్‌ , మెడికల్‌ సీట్ల విషయం ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి!

` ఎక్సైజ్‌ కాంట్రాక్టులు మంత్రులకు కేటాయింపులు సిఎం కు ముడుపులు అందినట్లు పెద్ద ఎత్తున ఆరోణలు చేశారు.

`దాంతో నేదురుమల్లి జనార్ధనరెడ్డి రాజీనామా చేయడం జరిగింది?

`చరిత్ర తెలియక తెలంగాణ సమాజాన్ని తప్పు తోవ పట్టించే ప్రయత్నం?

`ఇంకా తెలంగాణపై విషం చిమ్మడం వారి అతి తెలివికి నిదర్శనం?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                 

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా…అని అన్నట్లు…న్యూస్‌ ఛానళ్ల యాంకర్లకు నోరుంటే చాలు..ఆంధ్రా అయితే చాలు..ఈ రెండు క్వాలిఫికేషన్లు వుంటే చాలు. రాజకీయాలు అవసరంలేదు. చరిత్ర మీద అవగహన వుండాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ అదే జరుగుతోంది. అదే సాగుతోంది. తెలంగాణ మీద ఇప్పటికీ ఎలా విషం చిమ్మాలో ప్రయత్నం కొనసాగుతూనే వుంటుంది. తాము చెప్పిందే నిజమనట్టు నమ్మించడం అలవాటు చేసుకున్నారు. ఇదే ఆనాడైనా, ఇప్పుడైనా తెలంగాణ సమాజానికి శాపంగా పరిణమించింది. నాలుకను రెండు సార్లు అదుపులో పెట్టుకోవాలని పెద్దలు సూచించారు. ఒకటి తినేటప్పుడు, రెండోది మాట్లాడేటప్పుడు. రెండోది ఆంద్రా యాంకర్లకు అవసరం లేదన్నట్లుగా మారిపోయింది. నోటికి ఏది వస్తే అదే మాట్లాడడం మళ్లీ మొదలుపెట్టారు. గతంలో 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఇలాగే తమ నోటి నుంచి వచ్చిందే మాట…మేం చూపిందే బాట…అన్నట్లు బరితెగించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ప్రజా ప్రనిధులను అవమానపర్చి, తెలంగాణలో బాయ్‌కాట్‌కు గురైన ఛానల్‌ అది. అయినా దానిలో మార్పు రావడం లేదు. ఎందుకంటే అలాంటి ఛానళ్లలో ఎంత మేదావులైనా తెలంగాణ వారికి అందలం వుండదు. గుర్తింపు కనిపించదు. కాని ఆంధ్రా అయితే చాలు..అక్షరం సరిగ్గా రాకున్నా ఫరవాలేదు. అక్షరం సక్కగ తెలియకుడా ఫరావాలేదు. చరిత్ర అంతకన్నా అవసరం లేదు. మాకున్న తెలివి తెలంగాణ వారికి వుండదన్న అహంబావం ఇంకా వారిలో వున్నట్లుంది. అందుకే ఇంకా అతి తెలివితేటలను ప్రదిర్శిస్తూనే వున్నారు. అక్షర పరిజ్ఞానం లేకపోయినా, నాలుక సామార్ధ్యం మీద ఆధారపడి కాలం వెల్లబుచ్చడం, అదే గొప్ప అనంతగా భావించడం ఆది నుంచీ వారికి అలవాటే…తెలంగాణ సమాజం ఎంత చైతన్యవంతమైందో తెలిసి కూడా వారి అతి తెలివి ప్రదర్శన ఆపడం లేదు.

తాజాగా రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటిఆర్‌ను ఇంటర్వూ చేసిన సందర్భంలో ఓ ఛానల్‌ యాంకర్‌ గతంలో మంత్రులు రాజీనామా చేశారంటూ చెప్పుకొచ్చారు.

ఎవరు రాజీనామా చేశారు? అంటూ మంత్రి కేటిఆర్‌ సదరు యాంకర్‌ను ప్రశ్నిస్తే కోట్ల విజయభాస్కరరెడ్డి అన్నారు. నిజానికి మంత్రి ఆ సమయంలో కొద్దిగా ఆలోచిస్తే ఆ యంకర్‌ పరువు అక్కడే పోయేది. కాని ఆ సమయంలో మంత్రి కేటిఆర్‌కు గుర్తుకు రాకపోవచ్చు. అంతే కాని మంత్రికి తెలియని విషయాన్ని తాను చెప్పినట్లు సదరు యాంకర్‌ ఏదో సాధించినంతగా నేను నిరూపించాన్నంత గర్వం చూపించారు. చరిత్ర మీద, తెలుగు రాజకీయాల మీద కనీసం అవగాహన లేని ఆ యాంకర్‌ అడిగిన ప్రశ్నే తప్పు. అందుకు మళ్లీ తానే చెప్పిన సమాధానం శుద్ద తప్పు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నోసార్లు ప్రశ్న పత్రాలు లీక్‌ అయ్యాయి. కాని ఏనాడు వాటిపై చర్యలు లేవు. ఎందుకంటే బోర్డులో వుండేవారు చేసే తప్పుడు పనులవి. ఎక్కడా, ఎప్పుడూ జరగలేదన్నట్లు మంత్రి కేటిఆర్‌కే పాఠాలు చెప్పినట్లు ముఖ కవలికలు మార్చాడు. తనకు తెలియనిది అబద్దమైన విషయం చెప్పడం ఆ యాంకర్‌ అతి తెలివికి నిదర్శనం. ఉమ్మడిరాష్ట్రంలో ఓ సందర్భంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ ఏకంగా ఓ జపాన్‌ను చెందిన ఓ బోగస్‌ కంపనీకి రూ.3కోట్లు చెల్లించడం జరిగింది. ఆ సమయంలో స్వయంగా మంత్రి బొత్స పోనాయ్‌..ఏటి సేత్తాం..అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినా ఏ ఒక్క ఛానల్‌ మాట్లాడలేదు. కాని ఇప్పుడు ఓ ఆంద్రా చరిత్రను పుక్కిట పట్టుకున్నట్టు నోటికి ఏది వస్తే అది చెప్పి ఆ యాంకర్‌ జర్నలిజం పరువు తీశాడు. 

 కోట్ల విజయభాస్కర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

 కేర్రదంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తొలిసారి అధికారంలోకి రావడానికి ముందు 1983లో ఆయన ముఖ్యమంత్రిగా వున్నారు. అదేంటో గాని మళ్లీ 1994 లో కూడా ఆయనే సిఎంగా వున్నారు. రెండుసార్లు ఆయన చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీకి అధికారం అందించారు. అలాంటప్పుడు పేపర్ల లీకేజీ ఎక్కడిది. ఆయన రాజీనామా చేసిందెక్కడ? అసలు ఆ యాంకర్‌కు తెలిసినచరిత్రేమిటి? సరే..ఇదిలా వుంటే 1990 నుంచి 1992 వరకు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నేదురు మల్లి జనార్ధనరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. కనీసం అది తెలుసా? ఆ రోజుల్లో ఇంజనీరింగ్‌ ,మెడికల్‌ ప్రైవేటు కాలేజీల్లో క్యాపిటేషన్‌ ఫీజు వసూలు చేసుకునేందుకు కాలేజీలకు అవకాశం కల్పించాడు. అది చట్ట విరుద్దం. నేరం కూడా..? అలాంటి కాలేజీలు వసూలు చేసిన ఫీజుల్లో వాటాలుతీసుకున్నాడని నేదురుమల్లి మీద పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయా కాలేజీలకు అనుమతులు ఇచ్చారు. పేద విద్యార్ధులకు ఇంజనీరింగ్‌, వైద్య విద్యను దూరం చేశారు. అంతే కాదు ఆ రోజుల్లో రూ.5లక్షలు ఒక్క సీటు కోసం క్యాపిటేషన్‌ ఫీజు అంటే పెద్ద అమౌంట్‌. అంతలా అవినీతికి పాల్పడడాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతోపాటు, నాటి కాంగ్రెస్‌ నేతలు కూడా నేదురుమల్లి మీద విమర్శలు ఎక్కుపెట్టారు. అంతేకాకుండా అప్పటి మంత్రులకు ఎక్జైజ్‌ కు చెందిన టెండర్లు అలాట్‌మెంటులో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారన్నది అప్పడు అభియోగం. దానితోపాటు ఆ కాలేజీలన్నీ ఇలా ఎక్జైజ్‌ వ్యాపారులైన మంత్రులకే కేటాయించారు. ఇలా విద్యావ్యవస్ధను భ్రష్టుపట్టించిన చరిత్ర ఆంధ్ర పాలకులది. ముఖ్యమంత్రి స్ధానంలో వుండి నేదురుమల్లి తన బంధువుల అమ్మాయికి మెడికల్‌ సీటు ఇప్పించారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ తెలుసుకున్న అప్పటి కాంగ్రెస్‌ అధిష్టానం నేదురమల్లిని అధికారంలో నుంచి దింపేసి, కోట్ల విజయభాస్కరరెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ అసలు చరిత్ర. ఇది కాకుండా 1985లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఓ పదో తరగతి పరీక్షల్లో కొన్ని అవకతవకలు జరిగాయి. ప్రత్యక్షంగా అప్పటిమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రమేయం వుందన్న వార్తలు పెద్దఎత్తున వచ్చాయి. అంతే కాకుండా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రా ప్రాంతంనుంచి వచ్చిన వారికి తెలంగాణలో ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాలో పెద్దఎత్తున ఎలాంటి పరీక్షలు లేకుండానే లెక్చరర్లుగా ఉద్యోగ నియామాకాలు చేశారు. అది అప్పట్లో వివాదమైంది. దాంతో మంత్రిగా వున్న గాలిముద్దుకృష్ణమ నాయుడు రాజీనామా చేశాడు. కాని ఎన్టీఆర్‌ ఒప్పుకోకుండా కొంత కాలానికి విద్యాశాఖను మార్చి అటవీ శాఖను అప్పగించారు. ఇదీ అప్పట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం. ఇలాంటి అన్యాయాల వల్ల తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావడం లేదని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఉద్యమం మొదలుపెట్టింది. ఆనాడు నోరు మెదపని సీమాంద్ర మీడియా తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక, సమర్ధవంతమైన ప్రభుత్వాన్ని , వికాసవంతమైన తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తోంది. ఇప్పటికైనా మెరుగైన సమాజం కోసం అంటూ చెప్పే ఆంధ్రా ఛానళ్ల మాటలు నిజాలు ఎప్పుడూ కావు. విలువలు లేని వ్యక్తులు జర్నలిజంలో చేరి సమాజాన్నే తప్పుదోవ పట్టించడం ఎప్పటినుంచో సాగుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత వున్న పార్టీలు కూడా ప్రభుత్వం మీద సీమాంధ్ర మీడియాచేసే అసత్యాలను బాధ్యత కల్గిన తెలంగాణ పార్టీలు కూడా వ్యతిరేకించాలి.

*ఖమ్మం వైపు ఢిల్లీ చూపు … ప్రగతి భవన్ లో తర్జన భర్జన*

Janagarjana Sabha in Khammam on July 2 :

ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.

ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి ఫోకస్. తెలంగాణలో అధికారంకు దగ్గరయ్యామనే నమ్మకం కాంగ్రెస్ లో వచ్చింది. ఇటు బీజేపీ ఢిల్లీ నేతలు కూడా ఖమ్మం సభ వైపే చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీని కాంగ్రెస్ హైజాక్ చేసింది. పూర్వ వైభవం దిశగా సాగిపోతోంది. బీజేపీలో నేతల మధ్య దూరం పెరిగింది. కాంగ్రెస్ లో ఐక్యత పెరుగుతోంది. ఖమ్మం సభతో తెలంగాణలో అధికారం వైపు అడుగులు వేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. తిరుగులేదనుకున్న బీఆర్ఎస్ లో ఖమ్మం సభ వలన ప్రకంపనలు మొదలయ్యాయి.

అగ్ర నేతే సత్కరించటం అనేది అరుదైన సందర్భం. ఇప్పుడు భట్టికి ఈ అపూర్వ అవకాశం దక్కింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా భట్టి పీపుల్స్ మార్చ్ యాత్ర మొదలైంది. నేతలను ఏకం చేసింది. పార్టీకి వచ్చిన ఆదరణ, కార్యకర్తల్లో కొత్త జోష్, కేడర్ లో వచ్చిన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. భట్టి యాత్ర పైన ఎప్పటికప్పుడు సమాచారం సేకరించిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా భట్టికి తగిన గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.

దీంతో, భట్టి పాదయాత్ర ముగింపు సభగా, పొంగులేటితో సహా ఇతర ముఖ్య నేతల చేరిక సభగా ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన నిర్వహణకు సిద్ధమైంది. ఖమ్మంలో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సందడి చేస్తున్నారు. ఖమ్మం సభ వేళ తెలంగాణ కాంగ్రెస్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఖమ్మం చేరుకున్న రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. పార్టీ నేతలతో కలిసి వైరా రోడ్డులోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో వంద ఎకరాల స్థలంలో చేస్తున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జనగర్జన సభకు ముందు రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకునే సమయంలో యువజన కాంగ్రెస్ నేతలు భారీ బైకు ర్యాలీకి ప్లాన్ చేసారు. ఆ ర్యాలీలో రాహుల్ గాంధీ పొల్గొంటారు. అంచనాలకు మించి జనం హాజరయ్యే అవకాశం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు.

అటు బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. పార్టీలో నుంచి నేతలు వీడుతారనే భయం వెంటాడుతోంది. పార్టీ నాయకత్వం మార్పు పైన డైలమాలో నేతలు ఉన్నారు. రాహుల్ వస్తుండటంతో బీజేపీ అగ్ర నాయకత్వం చూపు ఇప్పుడు ఖమ్మం వైపు ఉంది. అనూహ్యంగా కాంగ్రెస్ తెలంగాణలో పంజుకోవటం, బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదు. ఈ సమయంలోనే ఖమ్మం సభకు అధికార బీఆర్ఎస్ అవాంతరాలు కలిగించే ప్రయత్నం చేస్తోంది. సభకు ముందు బస్సులు ఇవ్వటానికి అంగీకరించిన ఆర్టీసీ..

ఆ తరువాత నో చెబుతోంది. మంత్రుల ఒత్తిడితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లేని చెక్ పోస్టులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ సభ – భట్టి విక్రమార్క యాత్ర – రాహుల్ రాక – నేతల చేరికలు పైన ప్రగతి భవన్ లో చర్చలు సాగుతున్నాయి. నిఘా నివేదికల పైన తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు ఖమ్మం సభ చుట్టూ తెలంగాణ రాజకీయం కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

‘‘కళ్లలో’’ వున్న ‘‘కుళ్లును’’ కాళేశ్వరం నీళ్లతో ‘‘కడుక్కోండి’’?

 

`కళ్లున్నా నీళ్లను చూడలేని కబోదులు…ప్రతిపక్షాలు!

`కళ్లు తెరిచి చూడండి.. పారుతున్న నీళ్లను మొక్కండి!

` తెలంగాణలో ప్రగతి పరవళ్లు. నేలతల్లి జలకాలు.

`నీళ్లు లేకుంటే ఈ పంటెక్కడిది?

`పాలమూరు ఎలా పచ్చబడ్డది?

` పాలమూరులో సిరుల పంటలు ఎలా పండుతున్నాయి?

` చెరువులెలా నిండుతున్నాయి?

` మిషన్‌ భగీరథ నీళ్లెలా వస్తున్నాయి?

` రిజర్వాయర్లు ఎలా కళకళలాడుతున్నాయి?

` 65 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దిగుబడి ఎలా సాధ్యమౌతోంది?

` కొత్తగా ఎనభై లక్షల ఎకరాల సాగు పెరగలేదా?

` తెలంగాణలో పారుతున్న కాలువలు కనిపచడం లేదా?

` పచ్చని పొలాలు నిజం కాదా?

` చెరువుల్లో మత్స్య సంపద చూడడం లేదా?

` తెలంగాణ నుంచి చేపలు ఎగుమతి కావడం లేదా?

` ఇరవై నాలుగు గంటల కరంటు అందడం లేదా?

` భూగర్భ జలాలు పెరిగి ఫ్లోరైడ్‌ పారిపోలేదా?

 హైదరబాద్‌,నేటిధాత్రి:                                     

నిజం చెప్పడానికి దమ్ముండాలి. ధైర్యముండాలి. అబద్దం చెప్పడానికి ఇవేవీ అవసరం లేదు. నోరుంటే చాలు. మోసపూరితమైన మనసుంటే చాలు. మభ్యపెట్టే గుణముంటే చాలు. కాని నిజం మాట్లాడాలంటే కూడా మంచి తనం వుండాలి. మంచి గుణం కూడా కావాలి. అవేవీ ప్రతిపక్షాలలో లేవు. ప్రతిపక్షాలు నిజాలు చూడలేవు. నిజాలు వినలేవు. నిజాలు మాట్లాడలేవు. దేశమంతా తెలంగాణ వెలుగులను చూసి ఆశ్యర్యపోతోంది. సంబరపడుతోంది. తొమ్మిదేళ్లలో జరిగిన సర్వతోముఖాభివృద్దిని చూసి అబ్బురపడుతోంది. మా రాష్ట్రాలు కూడా తెలంగాణలాగా అభివృద్ది చెందితే బాగుండు అని వివిధ రాష్ట్రాల ప్రజలు ఆశపడుతున్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడుతున్నారు. సంతోషపడుతున్నారు. ప్రతిపక్షాలకు మాత్రం తెలంగాణ అభివృద్ధి కళ్లముందు కనిపిస్తున్నా చూడలేకపోతున్నారు. తెలంగాణ అభివృద్ధి కావడం వాళ్లకు గిట్టడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు ఎప్పుడూ ఇబ్బందుల్లో వుండాలి. కష్టాలలో వుండాలి. అనే కోరుకుంటున్నాయి. తెలంగాణ బాగు పడుతుంటే కాంగ్రెస్‌, బిజేపి నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. మాకు ఇక భవిష్యత్తులో అధికారం రాదన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిత్యం పనికి రాని వాదనలు ముందేసుకుంటున్నారు. అసలు సమస్యలు పక్కదోవ పట్టిస్తూ, పొద్దుపుచ్చకుంటున్నారు. అదికారం కోసూం గోతి కాడ ఎదరుచూసినట్లు చూస్తున్నారు. ప్రజలు బాగు పడుతుంటే చూడలేకపోతున్నారు. ప్రజలు గతంలో పడిన గోసను గుర్తు చేసుకొని, ఇప్పుడు తెలంగాణ అభివృద్దిని చూసి మురిసిపోతుంటే, ప్రతిపక్షాలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నాయి. ఇంత సత్వర తెలంగాణ అభివృద్ది ప్రతిపక్షాలకు కళ్ల కనిపించడం లేదా? తెలంగాణలో ప్రతి మూలలో పారుతున్న నీళ్లు కనిపించడంలేదా? ఒకనాడు ఎండిన బీడులన్నీ పొలాలుగా మారి సిరుల పంటలు పండిస్తుంటే కనిపించడం లేదా? తెలంగాణలో వెల్లివిరిస్తున్న పచ్చదనం కనిపించడం లేదా? భూగర్భజలాలు పెరిగి, అటు చెరువులు నిండి, బావులు, బోర్లలో ఎండ కాలంలో కూడా పొలాలకు నీళ్లందుతుంటే కనిపించడం లేదా? ప్రతిపక్షాలలో రైతులు లేరా? వాళ్లకు పొలాలు లేవా? ఆయా పార్టీల నాయకులు సాగు చేయడం లేదా? రైతు బంధు పొందడం లేదా? ఒకనాడు పడావు బడ్డ భూములన్నీ కళకళలాడం లేదా? సాగు మా వల్ల కాదని, ఊళ్లలో వుంటే బతకలేమని పదుల ఎకరాలు వున్న రైతులు కూడా పట్టణాలకు వలసలు పోయిన బతికిన రోజులు గుర్తులేదా? ఆనాడు వలసలు పోయిన ప్రజలు మళ్లీ పల్లెలు బంగారు పంటలు పండిస్తూ, రైతే రాజు అన్న నానుడిని నిజం చేయడం లేదా? తెలంగాణ రైతన్న కాలు మీద కాలేసుకొని బతకడం లేదా? ఆఖరుకు అకాల వర్షాలకు ధాన్యం తడిసినా, ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భం ఎప్పుడైనా చూశామా? ఇన్ని మంచి పనులు మన కళ్లముందు కనిపిస్తుంటే కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలను ప్రజలు కూడా ఏవగించుకుంటున్నారు. అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ కళ్లలో వున్న కుళ్లును కాళేశ్వరం నీళ్లతో కడుక్కొని పారుతున్న తెలంగాణ గంగమ్మ తల్లికి దండం పెట్టుకోవాలి. తప్పుడు మాటలు మాట్లాడమని వారి నోళ్లు శుభ్రం చేసుకోవాలి. వారిలో అణువణువూ ఆహించిన అహాన్ని ఆ నీటిని తాగి పోగొట్టుకోవాలి. పారుతున్న జలంలో చేస్తున్న నిందలు వదిలేసి, ఒళ్లంతా కడుక్కోవాలి. తప్పైందని లేంపలేసుకోవాలి. తెలంగాణలో నీటి సిరులకు కారణమైన ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ఎవరైనా జేజేలు పలకాలంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌ రెడ్డి, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న తెలంగాణ అభివృద్ధి విశేషాలు… ఆయన మాటల్లోనే…

అసలు కలగన్నామా? తెలంగాణ వస్తుందని ఊహించామా? అరవైఏళ్ల నిర్లక్ష్యాన్ని అనుభవించాం.

 నీరు లేకున్నా కన్నీళ్ల సాగు చేశాం. కరంటు లేక పంటలు ఎండుతున్నా కన్నీళ్లను దిగమింగుకున్నాం. ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియని కరంటుకు చార్జీలు చెల్లించాం. ఎప్పటికిప్పుడు ఎంత పెంచినా, నోరు మెదపకుండా బిల్లులు కట్టుకున్నాం. ఎండిన పంటలు చూసి కుమిలి ఏడ్చాం. ఆ గోసలన్నీ పోయాయి. ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ ఆవిషృతమైంది. తెలంగాణ కోసం పద్నాలుగేళ్ల పాటు సుధీర్ఘ పోరాటం చేసి, తెలంగాణ సాధించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణను అభివృద్ధి నమూనాగా మార్చిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ గోస చూసి చలించిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చి గోస తీర్చిన నాయకుడు కేసిఆర్‌. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా..ఇదే సత్యం…ఇదే నిత్యం..అసలు పదేళ్ల కిందట తెలంగాణ ఎలా వుంది? ఇప్పుడు ఎలా వుంది? అన్నది ప్రతిపక్షాలకు తెలియందా? సరిగ్గా 2014లో తెలంగాణ వచ్చే నాటికి పండిన పంటలకు, ఇప్పుడు పండుతున్న పంటలు ఎన్ని రెట్లు పెరిగాయో! ప్రతిపక్షాలు చూడడం లేదా? ఆనాడు పండిన పంటలకు 70లక్షల టన్నులు మాత్రమే. మరి నేడు 3కోట్ల టన్నులకు పైగా వరి పండుతోంది. దానికి తోడు ఆరు తడి పంటలు పండుతున్నాయి. మొక్క జొన్న పండుతోంది. పప్పు దినుసలు పండుతున్నాయి. ఫామ్‌ ఆయిల్‌ సాగౌతోంది. ఇవన్నీ నీటి వసతులు కల్పించడం మూలంగా పంటలు సాగౌతున్నాయా? లేదా? అన్నది ప్రతిపక్షాలకు తెలియదా? ప్రతిపక్షాల నాయకులు రైతు బంధు తీసుకోవడం లేదా? నీటి సౌలత్‌ అందుకోవడం లేదా? వాళ్ల ఊర్లలో చెరువులు నిండిరది కనిపించడం లేదా? వాల్ల పొలాలకు నీళ్లు రాకుండానే సాగు చేస్తున్నారా? వాళ్ల ఊరి చెరువులో గతంలో నీటి చుక్క జాడ లేని రోజులే ఎక్కువ. అందులోనూ కాంగ్రెస్‌పార్టీ నేతలదే పాలన. మరి అప్పుడు చెరువుల్లో నీళ్లెందుకు లేవు?నేడు చెరువుల నిండా నీళ్లెందుకున్నాయి. ఆ చెరువుల్లో ఎప్పుడైనా చేపలు చూసిన చరిత్ర వుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ మత్స్య సంపదనను తెలంగాణ ఎందుకు మించిపోయింది? ఒకప్పుడు తెలంగాణకు ఆంధ్రనుంచి చేపలు వచ్చేవి. ఇప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చేపలు సరఫరా చేస్తున్నారు. తెలంగాణలో సంపద సృష్టి ప్రతిపక్షాలకు కనిపించదు. పెరిగిన మత్స్య సంపద చూడలేరు. కాని ఇంటికి కొనుక్కెళ్లి తింటున్నారు. ఇదీ ప్రతిపక్షాల తీరు. 

  ప్రపంచంలోనే అతి పెద్ద బహులార్ధక ఎత్తిపోతల పధకం కాళేశ్వరం. 

ఇది మొత్తంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వంచే నిర్మాణం చేయబడిన ప్రాజెక్టు. కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా, రూపాయి సాయం చేయలేదు. పైగా తెలంగాణ రావడమే ఇష్టంలేని ప్రధాని మోడీ, తెలంగాణకు సాయం చేస్తాడని ఆశించలేదు. తెలంగాణ అంటేనే కళ్లలో నిప్పులు పోసుకునే బిజేపి పెద్దలకు తెలంగాణ అభివృద్దిని కోరుకుంటారా? అసలు తెలంగాణను నిధుల విషయంలో అన్యాయం చేస్తూ వున్నా, తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలబడేలా చేసిన ఘనత ఒక్క కేసిఆర్‌కే దక్కుతుంది. చరిత్రలో కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు కనిపించరు. ఎందుకంటే తన పుట్టిన నేల రుణంతీర్చుకున్న నాయకుడు కేసిఆర్‌. అలాంటి యుగపురుషుడు, త్యాగధనుడు, ఉద్యమ కారుడు ప్రపంచ చరిత్రలోనే లేరు. అంత గొప్ప నాయకుడి పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో పరుగులు పెడుతుంది. తొమ్మిదేళ్లలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. ఏ రంగంలో చూసినా అన్ని విజయాలే. చిగురించిన ఆశలను ఆశయ ఫలాలుగా మార్చి ప్రజలకు అందించిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. అలాంటి కేసిఆర్‌ పాలనను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులుకోరు. అధికారంలో వున్న నాడు తెలంగాణ కోసం పట్టించుకోలని కాంగ్రెస్‌ నాయకులను ప్రజలు ఆదరించరు. తెలంగాణకు సాయం చేసే స్ధానంలో వుండి కూడా తెలంగాణ ఏర్పాటును ఇప్పటికీ నిందిస్తూ, తెలంగాణపై విషయం కక్కుతూ, తెలంగాణలో పాలన కోసం అర్రులు చాచే బిజేపిని ప్రజలు ఎప్పుడూ దరి చేరనివ్వరు. ఆ పార్టీకి చోటే కల్పించరు. తెలంగాణ అంటే కేసిఆర్‌. కేసిఆర్‌ అంటే తెలంగాణ. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ తప్ప మరోపార్టీకి తావులేదు. ఆ పార్టీల జెండాలకు చోటు లేదు.

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్.. ఖమ్మం సభపై భారీ అంచనాలు

Congress wave in Telangana :

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు – తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు హైకమాండ్ ను కదలించిన అంశం. భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ను తరలి వచ్చేలా చేసింది కూడా ఇదే అంశం. 109 రోజుల పాటు మండుటెండల్లో 1300 కిమీ నడిచిన భట్టిని పార్టీ తరపున రాహుల్ సత్కరించనున్నారు. ఖమ్మం వేదికగా పార్టీలో ముఖ్య నేతల చేరికలు జరగనున్నాయి. తాజా పరిణామాల నడుమ సెంట్రల్ టీమ్స్ రంగంలోకి దిగి మేధావులతో భేటీలు నిర్వహిస్తున్నారు. సభ సక్సెస్ అవ్వటం ఖాయమని గ్రహించిన రేవంత్ అలర్ట్ అయ్యారు. ఖమ్మం సభ ఏర్పాట్ల పైన పర్యవేక్షణకు రంగంలోకి దిగారు.

తెలంగాణలో కాంగ్రెస్ కు ఈ స్థాయి ఆదరణ తిరిగి దక్కుతుందని పార్టీ ముఖ్యులే అంచనా వేయలేదు. పార్టీ కోసం భట్టి చొరవ తీసుకొని పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. ప్రభత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో బాధ పడుతున్న వారికి అండగా నిలిచారు. పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో మమేకం అయ్యారు. ఈ బాధల నుంచి విముక్తి కావాలంటే కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం అవసరమని వివరించారు. ఈ ఆదరణ కాంగ్రెస్ నేతలను కదలించింది. శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలంతా ఒక్కటయ్యారు. ఈ ఐక్యత, ఆదరణ కాంగ్రెస్ హైకమాండ్ ను ఆకర్షించింది. భట్టి యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కు కారణమైన భట్టి యాత్ర ముగింపు సభకు రాహుల్ తరలి వస్తున్నారు. లక్షలాది మంది సమక్షంలో భట్టి విక్రమర్కను సన్మానించనున్నారు.ఇప్పుడు ఖమ్మం సభ పైన భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. పార్టీకి పెరిగిన ఆదరణ..భవిష్యత్ కార్యాచరణ పైన వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు.

ఖమ్మంలో జరగనున్న జనగర్జన తెలంగాణ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు ఏర్పాట్లు భారీ ఎత్తున ఉండటం, కాంగ్రెస్ పై ప్రజల ఆదరణ, కార్యకర్తల్లో జోష్, ఇవన్ని పెరగటం చూసిన అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని ఇప్పటికే నిఘా సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చాయి. ఖమ్మంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా తమ పట్టు జారుతోందనే ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కనిపిస్తోంది. ఖమ్మం సభా వేదికగా జరిగే చేరికలు, రాహుల్ తెలంగాణ ప్రజల కోసం ఇవ్వనున్న హామీలు ఇప్పుడు ఎన్నికల వేళ బీఆర్ఎస్ – బీజేపీకి సవాల్ గా మారుతున్నాయి.ఖమ్మం సభ వేళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. ఖమ్మం సభ నిర్వహణపైన ఇప్పటి వరకు రేవంత్ అంటీ ముట్టనట్లు ఉన్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రే నేరుగా భట్టి వద్దకు వెళ్లి సభా నిర్వహణ పైన చర్చించారు.

అ చర్చలకు పొంగులేటిని ఆహ్వానించారు. సభకు జనగర్జన గా అక్కడే పేరు ఖరారు చేసారు. థాక్రే రాష్ట్రంలోనే మకాం వేసారు. సభ జరిగే రోజున రాహుల్ గాంధీ వస్తుండటంతో మొదట టీపీసీసీ అధ్యక్షుడిగా సభ వరకు పరిమితం అయ్యేందుకు రేవంత్ సిద్ధమయ్యారు. కానీ మారుతున్న పరిణామాలు, నేరుగా రాహుల్ టీమ్ సభ పైన ఫోకస్ చేయటం, సభ గ్రాండ్ సక్సెస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు రేవంత్ ఖమ్మం బాట పట్టారు. ముందస్తు ఏర్పాట్ల పై పర్యవేక్షణకు రంగంలోకి దిగారు. ఆలస్యం చేస్తే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు. ఇప్పుడు ఖమ్మం మొత్తం భట్టి పాదయాత్ర ముగింపు, పొంగులేటి చేరిక కేంద్రంగా నిర్వహణకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version