రైతుబంధు వస్తేనే నాటు వేస్తా సారూ

➡️మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తో గోడువెల్లబోసుకున్న దళిత రైతు నర్సయ్య

➡️కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు పెట్టుబడికి డోకా లేకుండే

➡️చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య ఆవేదన

చొప్పదండి నియోజకవర్గములోని కొడిమ్యాల మండలానికి ఓ శుభకార్యానికి వెళ్తున్న కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు *బోయినపల్లి వినోద్ కుమార్* గంగాధర మండల సమీపంలో ఓ పెట్రోల్ బంక్ దగ్గర తన వాహనాన్ని నిలుపగా మంగపేట గ్రామానికి చెందిన దళిత రైతు నర్సయ్య మాజీ ఎంపీ *బోయినపల్లి వినోద్ కుమార్* ని చూసి వాహనం దగ్గరకు వచ్చి తన వ్యవసాయ పొలం చూడండి సారూ…నా పరిస్థితి ఇలా ఉందని మొరపెట్టుకున్నారు.

దళిత రైతు నర్సయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ఏమైంది నర్సయ్య వ్యవసాయం ఎలా నడుస్తోంది అని రైతు నర్సయ్యను మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడగగా

సారూ వడ్ల పైసలతో పొలం దున్నిన, విత్తనాలు తెచ్చి నారుపోసిన….

కానీ వరినాటుకు వచ్చింది నాటు వేద్దామంటే చేతిలో చిల్లిగవ్వ లేదు నారు ముదురుతోంది…

రైతుబంధు పైసలు వస్తాయని ఆశకొద్ది చూస్తున్న…రెండు దినాలకోసారి బ్యాంకు కు వెళ్లి ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చూసి వస్తున్న….ఇంకా రైతుబంధు పైసలు పడకపోవడంతో నాటు వేసేందుకు వెనుకడుగు వేస్తున్న సారూ..

కేసీఆర్ సారు ఉన్నన్ని రోజులు రెండు పంటలకు పెట్టుబడి కోసం పైసలకు డోకా లేకుండె…నాటు వేసే సమయానికి రైతుబంధు పైసలు పడేటియి.

గీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మా బ్రతుకులు ఆగం అయ్యే పరిస్థితి వచ్చింది.

మాజీ ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పీఏసీఎస్ చైర్మన్ రాజనర్సింహ రావు, నాయకుల సంపత్ ఉన్నారు

ప్రజా పాలనలో తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం చేయాలి

వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు గడ్డం సుధాకర్

గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ప్రజల ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యమ కళాకారులకు సరైన న్యాయం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ కళాకారుల సంఘం గడ్డం సుధాకర్ అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో కళాకారుల పాత్ర పాట యొక్క గొప్పతనం ధూంధాం ఉద్యమాన్ని ఊర్రూతలూగించిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ఉద్యమ కళాకారులకు మొండి చేయి చూపించిందని కేవలం 500 మందికి ఉద్యోగాలు ఇచ్చి నిజమైన కళాకారుల పొట్ట కొట్టింది అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సారధిలో ఉన్న కళాకారుల్లో సుమారు 75% మంది కళాకారులు తెలంగాణ ఉద్యమానికి సంబంధంలేని వారని విమర్శించారు. ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటాలు కోర్టు కు సైతం వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు.టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమ కళాకారులకు అన్యాయం చేసిందని అందుకే 2023 ఎన్నికల్లో ఉద్యమ కళాకారులు వారి వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారని తెలిపారు. నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఉద్యమ కళాకారులకి ఈ ప్రజా ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కళాకారులంతా ఐక్యమై ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో పాలాటి రాజు, తండా సదానందం, రాజేష్ ఖన్నా, రజినీకాంత్, క్రాంతి, సుహాసిని, రజిత రెడ్డి, వెంకటాద్రి, సతీష్ సుమారు 100 మంది కళాకారులు పాల్గొన్నారు

ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణకు సర్వం సిద్ధం

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పర్మర్ పింకేశ్ కుమార్ ఐఏఎస్

జనగామ, నేటిధాత్రి:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా సర్వం సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా బుధవారం నెల్లుట్ల గ్రామపంచాయతీ, బచ్చన్నపేట, జనగామ పట్టణంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు, అనంతరం రఘునాథపల్లి మండల కేంద్రం, లింగాల ఘణపురం మండల కేంద్రాలలో జరుగుతున్న సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ,
ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణ కోసం నియోజకవర్గానికి మండలానికి గ్రామస్థాయికి ప్రత్యేక అధికారుల నియమించి కార్యక్రమాలు పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. గ్రామాలలో పట్టణంలో దరఖాస్తు తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆడవారికి, మగవారికి వేరువేరుగా క్యూలైన్లను సిద్ధం చేశామని, దరఖాస్తులు అందజేయడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, కుర్చీలు, త్రాగునీరు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాలు, పట్టణంలో ప్రజా పాలన కార్యక్రమంపై ప్రజలకు విస్తృత ప్రచారం కలిగించేందుకు సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సుహాసిని, ప్రజా పాలన ప్రత్యేక అధికారులు, వారికి కేటాయించిన నియోజకవర్గ పరిధిలోని సిబ్బందికి ఈరోజు శిక్షణ నిర్వహించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అదనపు కలెక్టర్ పర్మర్ పింకేశ్ కుమార్ తెలిపారు.

ప్రజా పాలన కార్యక్రమంపై అధికారులకు అవగాహన సదస్సు…

గొల్లపల్లి( జగిత్యాల) నేటి ధాత్రి:

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఈనెల 28 నుండి జనవరి 6 వరకు జరుగు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో గ్రామ పంచాయితీ కార్యదర్శులు, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు, అంగన్వాడి టీచర్స్, ఐకెపి వివో ఏ లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లకు ప్రజా పాలన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా పాలనలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలపై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సాయిబాబా, ఎంపీపీ నక్క శంకరయ్య, ఎంపీడీవో నవీన్ కుమార్, ఎంపీ ఓ సురేష్ రెడ్డి, ఎమ్మార్వో సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

పాలకుర్తి సోమన్న ఆలయంలో వైభవంగా ”ఆరుద్రోత్సవం”

108 లీటర్ల ఆవు పాలతో ఏకాదశ రుద్రాభిషేకం

పాలకుర్తి, నేటిధాత్రి:-
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి (పాలకుర్తి సోమన్న) దేవాలయంలో బుధవారం మార్గశిర మాసం
ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల  మధ్య మహా వైభవోపేతంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం 108 లీటర్ల ఆవు పాలతో అభిషేకం, గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమంలో భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు భజన బృందాలచే నిర్వహించిన భజనలు అలరించాయి.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

ఈరోజు ఉదయం 11:00 గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ సమావేశం

ఈరోజు ఉదయం 11:00 గంటలకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆరు (6) గ్యారెం టీలకు సంబందించి అధికారిక సమా వేశం శేరిలింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొనడం జరిగింది.

కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి రాత్రి ఇన్చార్జి

అనంతరం సోనియా గాంధీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ.రేవంత్ రెడ్డికి పాలాబిశేకం
కార్యక్రమం నిర్వహించబడింది.

కావున డివిజన్ అధ్యక్షులు,నాయ కులు,మహిళా సీనియర్ నాయకు లు,యువజన నాయకులు,పార్టీ అభిమానులు,పార్టీ కార్యకర్త లు,కా గ్రెస్పార్టీ అభిమానులు అందరు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒకరికి,మీడియా సోదరులకు ప్రత్యేక ఆహ్వానం పంపిస్తున్నట్లు శేర్లింగంపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ తెలియ చేశారు.
ఫోటో నెంబర్ 2 లో….

ఎనిమిదవ రోజు దినం ముట్టించిన యూత్

గణపురం నేటి ధాత్రి

గణపురం కేంద్రంలో ఎర్రమ్మగడ్డ యూత్ అద్వర్యంలో బైరపాకా వెంకటేష్ మరనించి ఇప్పటికి 8 రోజులు అవుతుంధి కావున తోటి మిత్రులు అందరు కలిసి 8 రోజు చెయ్యడం జరిగింది ఈ కార్యక్రమంలో సామర్ల నాగరాజు మెరుగు ప్రశాంత్ దుప్పటి అంజి జె ప్రశాంత్ ఇంజపెల్లి సోలో మాన్ మెరుగు గణేష్ పెండేలా శ్రీకాంత్ చిలువేరు విద్యాసాగర్ ఇంజపెల్లి రిషి మంద ఢిల్లీ పాల్గొన్నారు

రాష్ట్ర అనుముల నుండి తరలివచ్చిన పెయింటింగ్ ఆర్టిస్టులు

ఆర్టిస్టులకు న్యాయం జరిగేందుకు తెలంగాణ
ఆర్ట్ సొసైటీ:విద్య వెంకట్

కూకట్పల్లి డిసెంబర్ 27 నేటి ధాత్రి ఇంచార్జ్

చిత్రకారుడు అంటేనే చరిత్రకారుడు అని చెప్పవచ్చు.వారి కుంచె నుంచి అద్భుతాలు జాలువారుతాయి.. సజీవంగా మనం చూడలేకపోయిన విషయాలను మన కళ్ళముందుకు తీసుకుని వస్తారు వారు. కడుపు ఆకలితోమలమాలలాడుతున్నా.గుండెల్లో బాధ రగులుతున్నా..
తమ రక్తాన్నే రంగుగా మార్చుకుని అందమైన చిత్రాలను, అక్షరాలను సృష్టిస్తారు.అలాంటి మరుపురాని కళాకారులకు ఏదైనా చేయాలనే తాపత్రయంతో తెలంగాణ ఆర్ సొసైటీ బుధవారం ఆవిర్భ విం చింది.తెలంగాణ చిత్రకారు లందరినీ ఒక వేదికపైకి తీసుకుని వచ్చి వారి సామాజిక, ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరుచుటకు కృత నిశ్చయం
తో ఈ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భాష్యం యదు మోహన్,విద్య వెంక ట్, డీ.వీ.రమణ తదితర ముఖ్య కళాకారులు సోమాజీగూడా ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించారు. కార్యక్ర
మానికి అధ్యక్షతవహించినసీనియర్ ఆర్టిస్టు భాష్యం యదు మోహన్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి
ఎంతో మంది చిత్రకారులు, పెయిం టింగ్ ఆర్టిస్టులు రావడం అభినంద నీయమన్నారు.ఈ సందర్భంగా
తోటి చిత్రకారుడు అంచెలంచెలుగా ఎదిగి, ఎన్నెన్నో ఒడిదొడుకులను తట్టుకుని, తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్ రెడ్డి ని ప్రశంసిస్తూ….వారికి అందరు చిత్ర
కారుల తరఫున అభినందనలు తెలి యజేశారు. సీనియర్ ఆర్టిస్ట్ విద్య వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ఆర్ట్ సొసైటీ ఏ సంఘానికి,ఏ సంస్థ కు పోటీ కాదని ఆర్టిస్టుల సంక్షేమం కాపాడుతూ భవిష్యత్తు తరాలకు ఉత్తమ ఆర్టిస్టులను అందించే లక్ష్యం తో ప్రారంభించడం జరుగుతుంద న్నారు. తెలంగాణ ఆర్టీ సొసైటీ ద్వారా గుర్తింపు పొందిన ఆర్టిస్టు
లకు గుర్తింపు కార్డులు,హెల్త్ ఇన్సూ రెన్స్, నైపుణ్యతపెంపొందించేందుకు శిక్షణ తరగతులు, వృద్ధ ఆర్టిస్టులకు పెన్షన్, గృహ వసతి ఏర్పాటుకు కృషి చేయడం జరుగు తుందన్నా రు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు కాంట్రాక్టర్లైన బ్రోకర్ల ద్వారా కాకుండా కళా రంగానికి సంబంధిం చిన పనులు తెలంగాణ ఆర్ట్ సొసైటీ ద్వారా ఆర్టిస్టులకే అందే విధంగా కృషి చేయడం జరుగుతుంద న్నా రు. ఆర్టిస్టుల పిల్లల చదువులకు సహకారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశానికి
సభా పరిచయం చేసిన సీనియర్ ఆర్టిస్ట్ డివి రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిత్ర కళాకారులందరినీ ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకే తెలంగాణ ఆర్ట్ సొసైటీ ప్రధాన ఉద్దేశం అన్నారు. పెయింటింగ్ ఆర్టిస్టులు అందరూ ఈ తెలంగాణ ఆర్ట్ సొసైటీలో చేరితే వారి భవి ష్యత్తు బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఆర్టిస్ట్ నాగేందర్, కాసుల పద్మావతి పడిగే సత్యం,నంద్యాల (పెయింటర్) శ్రీనివాస్, తానాజీ, యాకయ్య, మాతంగి మల్లేష్, ఇబ్రహీంలు ప్రసంగించారు.కార్య క్రమంలో ఆర్టిస్టులు కే.అశోక్,రా మకృష్ణ,బాసిత్,శివాజీ బండారి నరేష్ బండారి నరేష్,రాము తది తరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో….

మానవత్వాన్ని చాటుకున్న శ్రీనృసింహ సేవా వాహిని…….

భద్రాచలం నేటి ధాత్రి

పేదబిడ్డకు పెద్దన్నగా ముందుకొచ్చి వైద్య సహాయం అందించిన డా. కృష్ణ చైతన్య స్వామి…….

పరమలించిన మానవత్వం మంటల్లో కాలి గాయాల పాలైన మూగ బిడ్డకు అండగా నిలిచిన నృసింహ సేవా వాహిని……

ఉభయతెలుగు రాష్ట్రాలలో ఆపద అంటే వినిపించే స్వరం నృసింహ సేవా వాహిని ఈరోజు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బక్క చింతలపల్లి గ్రామానికి చెందిన పసుల. రజిత (11) సంవత్సరాల ఈ పాప పుట్టుమూగ,మాటలు రావు రాష్ట్రo లో గత కొద్ది రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంటుంది.ఎక్కడ చూసినా చలి మంటలు వేసుకొని ఉంటున్న ఈ తరుణం లో ఆ చలి మంటలే ఓ పసిబిడ్డను గాయాల పాలు చేసింది.రెండు రోజుల క్రితం చిన్నారి రజిత కుటుంబం ఇంటిముందు చలిమంట వేశారు.కొంత సమయం తరువాత పాపను మంట దగ్గరలో కూర్చోబెట్టి తల్లి ఇంట్లో పని చేసుకుంటున్న సందర్భంలో అకస్మాత్తుగా మంటలు ఎగసి పాప డ్రెస్ ను అంటుకున్నాయి. మంటల్లో కాలిపోతున్నానని , కనీసం గట్టిగా అరవడానికి కూడా, మాటలు రాని ఆ పసిబిడ్డ బాధను మౌనంగా భరించింది. మంటలతో ఇంటి గుమ్మం లోకి వెళ్లే లోగా సగానికి పైగా శరీరమంతా కాలిపోయింది.మాటలు రాని ఆ బిడ్డ పడుతున్న నరకయాతన అంతా ఇంతా కాదు,కనీసం ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చూపించే స్థితి ఆ తల్లిదండ్రుల దగ్గర లేదు.చేతిలో చిల్లిగవ్వలేక రెక్కాడితే డొక్కాడని ఆ నిరుపేద తల్లిదండ్రులు రోదన తమ బిడ్డ కొరకై పడుతున్న మనోవేదన మన్యంలో ఎన్నో సేవలు చేస్తున్న మన నృసింహ సేవా వాహిని దృష్టికి తీసుకువచ్చారు ఓ భక్తుడు.నిజంగా ఏ దేవుడు వారి గోసను చూసి చలించాడో ఏమో, విషయం తెలిసిన వెంటనే మానవత్వo పరిమిలించిన మహర్షిలా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య స్వామి స్పందించి తక్షణ సహాయంగా సంస్థ సభ్యుల సహకారం తో చిన్నారికి 21,000/- (ఇరవై ఒక్క వేల రూపాయలు )వైద్య ఖర్చులకు అందించి ఆ ఇంటికి పెద్ద కొడుకుగా భుజం కాశాడు ఈ గురుదేవులు.అలానే ఇంకా అవకాశం ఉన్నంత వరకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారికి భరోసా కల్పించడం జరిగినది.ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపుతూ ఆపద అంటే కన్న తండ్రి లా సహకారం అందిస్తున్న డా. కృష్ణ చైతన్య స్వామి చేస్తున్న సేవలను కొనియాడుతున్నారు మన్యం వాసులు. నిజంగా ఇటువంటి మహాత్ములు, మనముందు నడయాడుతూ సేవలoదించడం మన్యం బిడ్డలకు అందిన గొప్పవరం అవకాశం ఉంటే స్వామి చేస్తున్న సేవల్లో భాగస్వామ్యులమవుదాం మన వంతు సమాజం కొరకు పాటు పడదాం.

సిట్టింగులను పక్కనపెట్టండి!

https://epaper.netidhatri.com/

`కొత్తవారికి అవకాశం ఇవ్వండి.

`కార్యకర్తల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోండి.

`ఆత్మలు ఇతర పార్టీలలో వున్న వారుకూడా వున్నారు.

`వడపోత అవసరం.

`లేకుంటే ప్రజలు మరింత నిరాశకు లోనౌతారు.

`ప్రజలు కేసిఆర్‌ వెంట వున్నారు.

`కార్యకర్తలు కోరుకునే అభ్యర్థులను నిలబెట్టండి.

`అత్యధిక సీట్లు ఖాయం చేసుకోండి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇప్పటికైనా తేరుకోండి..జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. కార్యకర్తలు ఏం చెబుతున్నారో వినిపించుకోండి. వారి అభిప్రాయాలు స్వీకరించండి. వారి సూచనలకు విలువ ఇవ్వండి. కనీసం వారు ఏం చెప్పాలనకుంటుంటున్నారో చెప్పనీయండి. వారి మనుసలో ఏముందో మీరే అడిగి తెలుసుకోండి. లేకుంటే నాయకులు, కార్యకర్తల మనసులో వున్న తాజా అభిప్రాయాలు కూడా సమాధి అయిపోతాయి. పొగడ్తలకు ఇంకా పొంగిపోకండి. అంతా బాగుందని ఎవరైనా అంటే మురిసిపోకండి. పూర్తిగా నమ్మేయకండి. నిజనిర్ధారణ చేసుకోండి. పది మంది అభిప్రాయలను పోల్చి చూడండి. ప్రతి నియోజకవర్గం సందర్శించండి. కింది స్ధాయికార్యకర్త కూడా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. తోటి కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వండి. ఇప్పటికైనా మన పార్టీలో కూడా మాట్లాడే స్వేచ్ఛ వుందని గర్వపడేలా చేయండి. వారు సంతోషపడేలా చూడండి. మా మాటలకు, మా సూచనలకు విలువ వుంటుందన్న నమ్మకాన్ని వారిలో కల్పించండి. ఎందుకంటే నిన్నటిదాకా అధికారంలో వున్నారు. ఏ కార్యకర్తకు అందుబాటులో లేరు. ఎంత సేపు పాలన తప్ప పార్టీకి సమయం ఇవ్వలేదు. ఈ మాట ఎన్టీఆర్‌ కాలం నుంచి, చంద్రబాబు పాలన నుంచి, ఇప్పుడు తెలంగాణలో కేసిఆర్‌ పాలనలో కూడా వింటూనే వున్నాం. ఎందుకంటే ఈ విషయాలు పూర్తిగా కేసిఆర్‌కు కూడా తెలుసు.
ఉమ్మడి రాష్ట్రంలో 1989లో ఎన్టీఆర్‌ ఓడిపోవడానికి కారణం కేవలం ఆయన నేరుగా ప్రజలను కలవకపోవడం.
పై స్ధాయి నేతలకు తప్ప, ఆయన దర్శనబాగ్యం ఎవరికీ అందకపోవడం. ఎంతో నిజాయితీగా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినా 1989లో తెలుగుదేశం ఓడిపోయింది. తర్వాత 1994లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. కానీ అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. పాలనలో విపరీతమైన సంస్కరణలు తెచ్చారు. కొత్త పరిపాలనావిధానాలు అమలు చేశారు. పాలనలో ప్రజలను భాగస్వాములు చేశారు. శ్రమ దానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం..పరిశుభ్రత అనే కార్యక్రమాలు చేపట్టారు. రైతులకు చేయూత అనే కార్యక్రమం అమలు చేశారు. ఆ రోజుల్లో రైతులకు పని ముట్లు ఉచితంగా ప్రభుత్వం ద్వారా అమలు చేశారు. హైటెక్‌ పాలనకు మొదలు పెట్టారు. నేరుగా అధికారులతో చంద్రబాబు మాట్లాడుతుండడం చేశారు. జన్మభూమి కార్యక్రమంతో ప్రజలకు బాగా చేరువయ్యారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలు తీర్చారు. కొత్తకొత్త ఫ్లైఓర్లు నిర్మాణం చేసి, హైదరాబాద్‌కు అప్పుడున్నంత మేర కొత్త హంగులు దిద్దారు. అప్పటి ప్రజా ప్రతినిధులు ఎప్పుడూ ప్రజల్లో వుండాలంటే ఎప్పటికిప్పుడు శిక్షణా తరగతులు ఏర్పాటు చేసేవారు. ఈ కార్యక్రమాల సృష్టివెనుక, అమలు వెనకు వున్న నాయకుడు కేసిఆర్‌. ఈ విషయం ఈతరానికి తెలియకపోవచ్చు. అంతే కాదు, 1999 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడానికి తటస్థులను రాజకీయాల్లోకి ఆహ్వానించి, కొత్త తరం రాజకీయాలకు పురుడుపోసిన చాణక్యంలో కేసిఆర్‌ పాత్ర కూడా ఎంతో కీలకమైంది. మరి అలాంటి కేసిఆర్‌ పాలకుడుగా తెలంగాణలో ఉద్యమ నేత ప్రజలకు మరింత చేరువౌతాడని అందరూ అనుకున్నారు. కాని ఆయన రానురాను జనానికి దూరమౌతూవచ్చారు. కాని జనానికి అవరమైన అన్ని పనులు చేసిపెట్టారు. ఎన్ని చేసినా మా నాయకుడు మా కళ్ల ముందుకు రావడం లేదన్న వెలితి మాత్రం ప్రజల్లో అలాగే మిగిలిపోయింది. అదే బిఆర్‌ఎస్‌ను దెబ్చతీసింది.
ఒకనాడు తెలుగుదేశం పార్టీ ప్రస్ధానం, ప్రాభవం కోసం ఎంతో కృషి చేసిన కేసిఆర్‌, తన సొంత పార్టీ విషయంలో మాత్రం పదేళ్లకే ప్రజలకు దూరమయ్యేలా కావడానికి ఆయన జనంలో లేకపోవడమే అన్నది మాత్రం అందరూ అంగీకరిస్తున్న విషయం.
తెలంగాణలో ఇప్పటికీ ఎవరి నాయకత్వం కావాలని ఏ సగటు వ్యక్తిని అడిగినా టక్కున చెప్పే సమాధానం ఒక్కటే..అది కేసిఆర్‌ …అంతలా ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాడు. కాని ఆయన ద్వారా నేతలైన వారు మాత్రం ప్రజలకు దూరమయ్యారు. కేసిఆర్‌ తో ప్రజల్లోకి వస్తే సమస్యలు తెలుస్తాయి. నాయకుల నిజస్వరూపాలు తెలుస్తాయని అందరూ అనుకున్నారు. కాని ఆయన రాలేదు. నాయకుల పట్ల ప్రజల్లో వున్న వ్యతిరేకతను స్పష్టంగా తెలుసుకోలేకపోయారు. పైగా పదేళ్ల కాలంలో ప్రతి మూడు నెలలకోసారి పార్టీ తరుపున చేయించిన అనేక సర్వేలలో ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రిపోర్టులు వచ్చాయి. వాటిని కూడా అనేక పార్టీ సమావేశాల్లో సాక్ష్యాత్తు కేసిఆరే వెల్లడిస్తూ వచ్చారు. తీరు మార్చుకోవాలని సూచిస్తూ వచ్చారు. ఒక రకంగా హెచ్చరించారు. కాని ఏం జరిగింది. కేసిఆర్‌ చర్యలు తీసుకోలేదు. అప్పటి ఎమ్మెల్యేలు తమ తీరును మార్చుకోలేదు. పద్దతులు అసలే మార్చుకోలేదు. పెద్దగా పనులు నిర్వహించిన దాఖలాలు కనిపించలేదు. తెలంగాణ వ్యాప్తంగా బిఆర్‌ఎస్‌లో ఓ ముప్పై మంది ఎమ్మెల్యేల పనితీరుపై నిరంతరం ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ప్రత్యేక కథనాలు వచ్చాయి. రాసిని జర్నలిస్టులను బెదించిన వార్తలు కూడా వచ్చాయి. కాని ఆరోపణలు వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ తీరు మార్చుకోలేదు. అటు ప్రజల్లోనే కాదు, పార్టీలో కూడా నాయకులకు అందుబాటులో లేకుండా, గ్రూపులు తయారు చేసి, కార్యకర్తల్లోనే చీలిక తెచ్చిన ఎమ్మెల్యేలు కూడా వున్నారు. మనమంతా ఒక కుటుంబం అంటూనే వ్యత్యాసాలు చూపించిన నేతల పట్ల ఎన్నికల తరుణం సమీపిస్తున్నప్పుడు వారి అసంతృప్తిని భహిరంగానే వ్యక్తం చేస్తూనే వచ్చారు. వారి అభిప్రాయాలు పార్టీ పరిగణలోకి తీసుకోలేదన్నది వాస్తవం. అప్పటి ఎమ్మెల్యేల తీరును తప్పుపడుతూనే, మళ్లీ వాళ్లకే టిక్కెట్లు ఇస్తే ప్రజలు ఎలా స్వాగిస్తారనుకున్నారో గాని, మొత్తానికి పార్టీని చేజేతులా ముంచుకున్నది మాత్రం వాస్తవం.
త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి.
ఈ పార్లమెంటు ఎన్నికల్లోనైనా సిట్టింగుల పేరుతో టిక్కెట్లు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ప్రజా వ్యతిరేకత, నాయకుల అసంతృప్తి లేని వారికి టిక్కెట్లు ఇవ్వండి. పార్టీ శ్రేణులు ఎంత కష్టమైనా పడి, ప్రజలను ఒప్పించి, మెప్పించి గెలిపించుకుంటారు. అంతే కాని పార్టీలోనే వ్యతిరేకత వున్న వారికి మాత్రం మళ్లీ టిక్కెట్లు ఇవ్వొద్దు. మళ్లీ జాతీయ పార్టీల ముందు దిగదుడుపు కావొద్దు. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలకు సంతోషం లేదు. మళ్లీ ప్రజలు కేసిఆర్‌ నాయకత్వం వైపే చూస్తున్నారు. తెలంగాణ విముక్తి ప్రధాతగానే, తెలంగాణ ప్రగతి దాతగా కేసిఆర్‌నే ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వండి. ప్రజల్లో వ్యతిరేకత వున్నవారిని పక్కన పెట్టండి. అవసరమైతే కొత్త వారికి అవకాశం ఇవ్వండి. సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకోండి. ఇంత కాలం ఎలాంటి పదవులు అందని వారిలో పార్టీలో మంచి పేరున్న నాయకులను గుర్తించండి. వారికి అవకాశం ఇవ్వండి. ప్రజలే గెలిపించుకుంటారు. శాసన సభ ఎన్నికల్లో అభ్యర్ధులకు సహరించక, వారి ఓటమికి పరోంక్షంగా సహకరించిన పార్లమెంటు సభ్యులు కూడా బిఆర్‌ఎస్‌లో వున్నారు. కొందరేమో తటస్ధంగా వుంటూ, ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొనలేదు. మరికొందరు ఎమ్మెల్యేలుగా వున్న సమయంలో తమ మాట లెక్క చేయలేదని, తమకు ప్రాధాన్యతనివ్వలేదని మనసులో పెట్టుకొని పార్టీని దగ్గరుండి ఓడిరచిన వారు కూడా వున్నారు. అలాంటి వారు ఎవరన్నది పార్టీలో అందరికీ తెలిసిందే..ఇది బహిరంగ రహస్యమే..అందువల్ల వారిని పూర్తిగా పక్కన పెట్టాల్సిన అవసరం వుంది. అలాంటి అవకావవాదులు, ఒక వేళ పార్టీ గెలిపించినా, మరో వైపు చూడకుండా వుండరన్న నమ్మకం లేదు. అలాంటివారు కూడా వున్నారు. అందుకే ప్రజలు కూడా తస్మాస్‌ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. గత శాసన సభ ఎన్నికల సమయంలోనే ప్రజలు హెచ్చరించారు. అయినా అదే నాయకులను ప్రజలమీద బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేశారు. దాంతో ప్రజలు ఆ నాయకులను తిరస్కరించారు. ఇప్పుడు కూడా పొరపాటను అదే పనిచేయొద్దు. ప్రజల్లో, పార్టీలో కూడా మంచి పేరు లేని వారికి టిక్కెట్లు ఇవ్వొదు. ఇదీ జనం మాట…పార్టీ శ్రేణులు మొత్తుకుంటున్న మాట…

క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

డాక్టర్ ఏ ఎస్ రావు నగర్ డివిజన్ జై జవాన్ కాలనీ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 25


ఉప్పల్ నియోజకవర్గ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు. శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తం చిందించిన ధీశాలి యేసుక్రీస్తు ప్రభువు అన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని ఉప్పల్ ప్రజలంతా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం

మండల ముఖ్య కార్యకర్తల సమావేశం..

సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్..
ఈ సందర్భంగా మాట్లాడుతూ,
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు..
కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు..
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో అమలు చేసేటటువంటి పథకాలకు అర్హులైన వారు 28 తారీకు నుంచి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు..
అదేవిధంగా మండలంలోని గ్రామపంచాయతీల పరదిలో ఉన్న పలు సమస్యలను గ్రామ కమిటీ వారు ప్రజల ద్వారా సేకరించి అధిష్టానానికి తెలియజేయాలని సూచించారు..
తెలంగాణలో ఈ పది సంవత్సరాల అరాచక పాలనలో ప్రజలందరూ ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ప్రతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అన్నారు..

ఈ కార్యక్రమంలో
బట్టపల్లి సర్పంచ్, నియోజకవర్గ నాయకులు తొలెం నాగేశ్వరరావు, రేగళ్ల సర్పంచ్ కుంజ వసంతరావు, ఉప సర్పంచ్ బాడిశ లక్ష్మీనారాయణ, చిరుమళ్ళ ఉప సర్పంచ్ కోరం వెంకటేశ్వర్లు, మండల కిసాన్ కాంగ్రెస్ నాగ బండి వెంకటేశ్వర్లు, మండల యువజన అధ్యక్షులు కునుసోత్ సాగర్, మండల మహిళా అధ్యక్షురాలు చందా వెంకటరత్నమ్మ, కార్యదర్శులు షేక్ రఫీ, చంద నాగేశ్వరరావు, మండల నాయకులు ఎర్ర సురేష్, భూక్య అర్జున్, తోలెం నారాయణ, కోరగట్ల విశ్వనాథం, కార్యకర్తలు, మహిళలు యువకులు, తదితరులు పాల్గొన్నారు..

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రేడ్డి

శుభాకాంక్షలు తెలియచేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో సోమవారం ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సిఎస్ఐ చర్చి పాస్టర్ దైవ సందేశాన్ని అందించారు. యేసు క్రీస్తు జననం గురించి ఈ లోకానికి యేసు సర్వ లోకాన్ని వారి యొక్క పాపాలనుండి విడుదల చేసి రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడని ప్రపంచ శాంతి కోసం ప్రజలను రక్షించడానికి క్రీస్తు యేసు కన్యక అయినకు జన్మించినాడని పరిశుద్ధ గ్రంథము నుండి తెలియ పరిచాడని క్రిస్మస్ గురించిన ప్రత్యేక ప్రార్ధనలు చేసి,పాటలు పడుతూ,ఆరాధనలు చేశారు.అనంతరం కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.పరకాల ఎమ్మెల్యే గా మార్పు కోరుతూ ప్రార్దనలు చేయడమేకాక పరకాల ఎమ్మెల్యే గా గెలిపించినందులకు కృతజ్ఞతలు తెలిపారు.క్రైస్తవుల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తానని మీ సమస్యల పరిష్కారం కోసం పాటు పడతానని హామీ ఇచ్చారు.అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అన్నారు.రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రైస్తవులకు ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేద క్రైస్తవులను ఆదుకొనేందుకు ప్రణాళిక రూపొందించడం జరుగుచున్నది క్రైస్తవులకు ఏళ్ల వేళల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో క్రైస్తవ కుటుంబాలు,సంఘ పెద్దలు, వృద్ధులు,యువకులు,పిల్లలు పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సిఎస్ఐ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

పరకాల నేటిధాత్రి
క్రైస్తవ సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే యేసుక్రీస్తు పుట్టినరోజును పురస్కరించుకొని బి ఆర్ ఎస్ పరకాల పట్టణ కమిటి అధ్వర్యంలో పరకాల పట్టణంలోని క్రైస్తవ సోదరీ, సోదరులకు పరకాల మాజీ శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి పార్టీ పట్టణ కమిటి పక్షాన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచరు.అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు సి ఎస్ ఐ మిషన్ చర్చిలో క్రిస్మస్ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పరకాల పట్టణ అద్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను మాట్లాడుతూ ఈ క్రిస్మస్ పండుగ ప్రతిఒక్కరికీ ఆనందం, శాంతి,శ్రేయస్సును అందించాలని, క్రిస్మస్ సామరస్యం,కరుణ స్ఫూర్తికి ప్రతీక,ప్రతి ఒక్కరూ సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఆశాభావం వ్యక్తపరిచారు.అలాగే ప్రతిఒక్కరూ యేసుక్రీస్తు బోధనలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కౌన్సిలర్స్ మడికొండ సంపత్ కుమార్,శనిగరపు రజినీ నవీన్,మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్,చర్చ్ సంఘం బాధ్యులు రెవరెండ్. జాన్ అయ్యగారు,కార్యదర్శి బొచ్చు జాన్సన్,బి ఆర్ ఎస్ నాయకులు బొచ్చు నాగరాజు, బొచ్చు సుగుణాకర్,బొచ్చు అనిల్,బొచ్చు జేపి,బొచ్చు సది, దుప్పటి బాబూరావు, మడికొండ ఎమ్మెస్ రవి, మడికొండ రాజు,బొచ్చు క్రాంతి, మడికొండ ప్రవీణ్, మడికొండ వైఎస్సార్,క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లా స్థాయి షెటిల్ టోర్నమెంట్

ద్వితీయ బహుమతి అందుకున్న గిరి ప్రసాద్ టీం

పరకాల నేటిధాత్రి
ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ ఉమ్మడి జిల్లా స్థాయి షెటిల్ టోర్నమెంట్ ముగిశాయి.గత రెండు రోజులుగా నిర్వహించిన షెటిల్ టోర్నమెంట్ లో విజేతలకు ఫ్రెండ్స్ షెటిల్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్,అధ్యక్షుడు సంజయ్ శ్రీను,ప్రధాన కార్యదర్శి వేణు బహుమతులు అందజేశారు.మొదటి బహుమతి హుజురాబాద్ టీం శరత్,చంటి రెండవ బహుమతి పరకాల టీం
బండారి గిరిప్రసాద్,ఎండి అజ్జు మూడవ బహుమతి పరకాల టీం మారపల్లి రణధీర్,రఘు బహుమతులు అందజేయడం జరిగింది.షెటిల్ టోర్నమెంట్ కు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన క్రీడాకారులకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో క్రీడాకారులు చందు,వినోద్,సతీష్,సాయి, ప్రవీణ్,మోహన్,అనిల్, దామోదర్,అన్వేష్,బాబు, వర్ధన్,చంటి,లక్ష్మణ్,క్రాంతి,జయంత్,గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరణ

వనపర్తి నేటిధాత్రి;
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వనపర్తి జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆదివారం రాత్రి అమ్మవారి దగ్గర ఉంచి పూజలు చేయించారు అనంతరం జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్యాలెండర్ ఆవిష్కరించారు ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కల్వ రాజయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుతోట దేవరాజ్ పెబ్బేరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరి బుచ్చయ్య డివిజన్ ఇంచార్జ్ గుబ్బసింగయ్య శెట్టి జిల్లా యువజన సంఘం అధ్యక్షులు రాముని నీలేష్ ఇటుకూరి రామకృష్ణ ఉదయ్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత నరేందర్ పట్టణ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి వెంకటేష్ ప్రధాన కార్యదర్శి అనంత ఉమావతి కొంపల శ్రీలక్ష్మి ఆర్యవైశ్య సహాయనిది వైస్ చైర్మన్ శ్రీమతి కొండూరు మంజులా పురుషోత్తం ఆత్మకూరు ఆర్యవైశ్యులు ఆలయ పూజారి చంద్ర శేఖర్ శర్మ
పాల్గొన్నారు

పది దాటినా పంతులు లేడు

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని కాకర్జల్ తండాలో ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఉండగా గురువారం రోజు 18 మంది విద్యార్థులు స్కూల్ కు హాజరయ్యారు 10 దాటిన టీచర్ సమయపాలన పాటించకపోవడంతో ఆ పాఠశాల విద్యార్థులు రోడ్లపై ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నారు. నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ వెళ్లి చూడగా ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు రోడు పై ఆడుకుంటున్నారు. ఆ పాఠశాల ఇన్చార్జి అయిన లింగంపల్లి హెచ్ఎం ను ఫోన్ ద్వారా విచారణ కోరగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు సెలవులో ఉన్నారని సమాధానం ఇచ్చారు. ఇట్టి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా ఒకరు సెలవు పై వెళ్తే వేరొక ఉపాధ్యాయులు ఎక్కడ వెళ్లారని నేటి ధాత్రి రిపోర్టర్ లింగంపల్లి హెచ్ఎం ను విచారణ కోరగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. ఇట్టి విషయంపై గ్రామస్తులను విచారణ కోరగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన పాటించారని గ్రామస్తులు తెలిపారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతిపక్షం ముందు పాలక పక్షం వెలవెల.

https://epaper.netidhatri.com/

`హరీష్‌ రావు ముందు తేలిపోయిన మంత్రులు.

`హరీష్‌ రావు చెప్పిన వివరాలకు అసెంబ్లీ అవాక్కు.

`ప్రభుత్వ తప్పుడు లెక్కలను కడిగేసిన హరీష్‌ రావు.

`అడుగడుగునా హరీష్‌ రావును అడ్డకునేందుకు ఐదుగరు మంత్రుల అవస్థలు.

`పొంతన లేని మాటలు చెప్పలేక మంత్రుల తిప్పలు.

`ప్రభుత్వ శ్వేతపత్రం తప్పుల కుప్ప అని హరీష్‌ రావు ఎద్దేవా.

`కాగ్‌ రిపోర్ట్‌లతో కలిపి వివరిస్తూ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న హరీష్‌ రావు.

`సమాధానం చెప్పుకోలేక పాలకపక్షం చూసిన దిక్కులు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ప్రతిపక్షం దూకుడు అసెంబ్లీలో ప్రదర్శించింది. పాలక పక్షం గిలగిలలాడిరది. ఒక రకంగా చెప్పాలంటే విలవిలలాడిరది. ఒక్కడుగా మాజీ మంత్రి హరీష్‌రావు దూకుడు ముందు అధికారపక్షమంతా వెలవెలబోయింది. బుధవారం అసెంబ్లీలో ప్రతిపక్ష స్ధానంలో వుండి కూడా హరీష్‌రావు వన్‌మాన్‌ షో చేశాడు. పాలకపక్షానికి చెమటలు పట్టించారు. కాళేశ్వరం మీద కట్టుకధలు,పిట్ట కథలు చెప్పి, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేసి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి హరీష్‌రావు అసెంబ్లీ సాక్షిగా చుక్కలు చూపించారు. తనదైన శైలిలో అధికార పక్షానికి మాట లేకుండా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని హరీష్‌రావు డిమాండ్‌ చేయడంతో పాలకపక్షం బిత్తరపోయింది. ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టి, ప్రజలు ముందు దోషిగా నిలబెడదామని అనుకున్న పాలకపక్షం తేరుకోవడానికే కొంత సమయం పట్టింది. శ్వేతపత్రాలతో ప్రతిపక్షానికి చుక్కలు చూపిస్తామనుకున్న పాలకపక్షం పట్టపగలు చుక్కలు చూడాల్సి వచ్చింది. అసలు పాలకపక్షంలో ఎవరున్నారో? ప్రతిపక్షంలో ఎవరున్నారో తేరుకోలేక, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సహా, మంత్రులు బిత్తరపోయినంత పనైంది. ఒక దశలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులాంటి వారు కూడా ఆర్ధిక మంత్రి హరీష్‌రావు అంటూ సంబోధించడం విశేషం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం ఆసక్తికరమైన సందర్భం చోటు చేసుకున్నది. గతంలో కూడా ఎప్పుడూ ఇలాంటి సందర్భం ఎప్పుడూ కనిపించలేదు. మొదటిసారి చట్ట సభ అసెంబ్లీలో ప్రతిపక్షం ముందు అధికార పక్షం వెలవెల బోయింది. మాజీ మంత్రి హరీష్‌రావు వాగ్ధాటికి పాలకపక్షం కకావికలమైంది. నిజానికి శ్వేతపత్రాల విడుదల అంటే ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ భపడుతుందని అధికార కాంగ్రెస్‌ ఊహించింది. కాని అందుకు భిన్నంగా అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీష్‌రావు గుక్క తిప్పుకోకుండా, లెక్కల మీద ఎలాంటి షశబిషలు లేకుండా అలవోకగా పాలకపక్షం సభముందుంచిన లెక్కల లోగుట్టు విప్పుతుంటే అధికార పక్షం నోరెళ్లబెట్టి వినాల్సివచ్చింది. అంతే కాకుండా కాళేశ్వం మీద విచార చేపడతామంటూ, పదే పదే కాంగ్రెస్‌ నాయకులు బైట చేస్తున్న ప్రకటనలకు సభా వేధికగా హరీష్‌రావు పాలకపక్షం ఊహించని విధంగా దెబ్బకొట్టే ప్రయత్నంచేశారు. అలా హరీష్‌రావు స్పందించడంతో పాలపపక్షానికి పాలుపోలేదు. వెలవెల పోయి చూడడం తప్పలేదు.
సహజంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ పాలకపక్షంగా, ఓటమిపాలైన పార్టీని చెడుగుడు ఆడుకున్న సంఘనలు వుండేవి.
కాని బిఆర్‌ఎస్‌ ప్రతిపక్షంలో వున్నా, తమదే పై చేయి అని పాలకపక్షం చేయికి వాయిస్‌ లేకుండా చేయడం గమనార్హం. ఎందుకంటే నిజాలను ఎవరూ తారుమారు చేయలేరు. కట్టుకథలల్లి ఎల్లకాలం నిజాలని నమ్మించలేరు. తప్పులను చెప్పి ఒప్పులుగా మార్చలేరు. తొమ్మిదిన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ సుబిక్షంగా వుంది. సుసంపన్నమైన ప్రగతిని సాధించింది. చింతలు లేని జీవితాలు తెలంగాణ ప్రజలు అనుభవించారు. అరవైఏళ్ల గోస పోయింది. పల్లెల్లో మళ్లీ పచ్చదనం, పాడి, పంట వెల్లివిరిసింది. పల్లె ఆకుపచ్చని అందాలు అద్దుకున్నాయి. తెలంగాణ సాగులో విప్లవం సాధించింది. ఊహించని దిగుబడులతో అన్నపూర్ణగా విలసిలిల్లంది. రైతు రాజయ్యాడు. రైతు రాజ్య స్ధాపన జరిగింది. అంత గొప్పగా బంగారు తెలంగాణ తీర్చిదిద్దబడిరది. కాని అధికారమే పరమావిధిగా కాంగ్రెస్‌పార్టీ పదే పదే ఎన్నికల ముందు అబద్దాలు వల్లెవేసింది. చెప్పిందే చెప్పి, తప్పుడు ప్రచారాలు నమ్ముకొని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసి, అధికారంలోకి కాంగ్రెస్‌ అదికారంలోకి వచ్చింది. పది రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం అసలు రంగు బైటపడుతోంది. కాంగ్రెస్‌ పార్టీకి పాలనపై అవగాహన లేక, మేధావులుగా తమకు తాము చిత్రీకరించుకునే వారి మాటలు నమ్మి, అధికార పక్షం బోల్తాపడిరదన్న విషయాన్ని హరీష్‌రావు లెక్కలతో సహాబైటపెట్టారు. ప్రభుత్వం వద్ద సమాధానం లేకుండా చేశారు. సమర్ధుడైన నాయకుడు ప్రశ్నిస్తే ఎలా వుంటుందో పాలకపక్షానికి తెలిసి వచ్చింది. వెంటనే తేరుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు. కాని హరీష్‌రావు వాగ్ధాటికి ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని అడుగుడగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అడుగడుగునా హరీష్‌రావుకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నంచేశారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్‌ గత ప్రభుత్వం జీతాలు సరిగ్గా ఇవ్వలేదంటూ ఏదో చెప్పబోయి ఇరుకున పడ్డాడు. ఇదే సమయంలో ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదు. అందులో డబ్బు దాచుకోవడం వుండదని, ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్ధ ఒక ప్రవాహం లాంటిదంటూ, వచ్చే లెక్క, పోయే లెక్క వుంటుందని హరీష్‌రావు అనడంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌ కలుగజేసుకున్నారు. తాను మొదటిసారి అసెంబ్లీకి ఎన్నిక కావడం నిజమే కాని, గతంలోనే తాను పార్లమెంటు సభ్యుడినని, ప్రభుత్వ ఖజానా అంటే బీరువా కాదని తమకు తెలుసని సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. దాంతో అధికార పక్షం ఎంత డిఫెన్స్‌లో వుందో అర్ధమైంది. ఆ తర్వాత మంత్రి హరీష్‌రావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్న క్రమంలో మరోసారి మంత్రి జూపల్లి కలుగజేసుకున్నారు. సందర్భంలేకుండా తలదూర్చి హరీష్‌రావు ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక విద్యుత్‌ అప్పులు, విద్యుత్‌ తయారీ సంస్ధలు, కేంద్రం ఒత్తిళ్లు, మోటార్లకుమీటర్ల అంశం ప్రస్తావనకువచ్చింది. ఈ విషయంలో హరీష్‌రావు చెబుతున్న విషయాలు అధికార పక్షానికి నచ్చలేదు. కేంద్రం ప్రభుత్వం ఎంత ఒత్తిడిచేసినా, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎట్టిపరిస్ధితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టమని తెగేసి చెప్పిన విషయాన్ని ఘంటాపధంగా హరీష్‌రావు మరోసారి చెప్పారు. అంతే కాకుండా తన కంఠంలో ప్రాణం వుండగా మోటార్లును ఎట్టిపరిస్ధితుల్లో కూడా అనుమతించేది లేదని తేగేసిచెప్పిన సందర్భాన్ని గుర్తుచేశారు. దాంతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని, సమర్ధించుకోబోయారు. మోటర్లకు మీటర్ల అంశపై తాను పార్లమెంటరీ కమీటీ సభ్యుడినంటూ చెప్పుకున్నాడు. హరీష్‌రావును అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పిన విషయాలను హరీష్‌రావు సభ దృష్టికి తెచ్చారు.
అంతే కాకుండా తెలంగాణలోని 70లక్షల మంది రైతుల ప్రయోజనాల కోసం, 35వేల కేంద్రం అప్పు కూడా వదులుకున్నామని చెప్పడంతో ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ సభ్యులు బల్లలు చర్చడంతో అసెంబ్లీలో అధికార పక్షం అవాక్కయింది. సహజంగా పాలకపక్షం ప్రతిపక్షం మీద దాడి చేస్తున్నప్పుడు సభ్యులు బల్లలు చరుస్తుంటారు. కాని చాలా కాలం తర్వాత పాలకపక్షంమీద ప్రతిపక్షం ఎదురుదాడి చేసి, పాలకపక్షానికి మాటలు లేకుండా చేసి బల్లలు చర్చే పరిస్దితి రావడం అంటేనే ప్రతిపక్షం పైచేయి సాధించినట్లు లెక్క. అది ఈ రోజు అనేక సార్లు అసెంబ్లీలో కనిపించింది. ఎలాగైనా మధ్యలో కలుగుజేసుకొని హరీష్‌రావును ఇరుకున పెట్టాలని ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రయత్నం చేశారు. వరంగల్‌ నడిబొడ్డును వున్న జైలు కూల్చేశారంటూ, ఆసుపత్రి ఊరు అవతల నిర్మాణం చేస్తే బాగుండేదన్నారు. వెంటనే అందుకున్న హరీష్‌రావు ప్రజలకు అత్యవసర సేవలు అందాల్సిన ఆసుపత్రి ఊరవతల నిర్మాణం చేయాలని, జైలు నగరం నడిబొడ్డున వుండాలని సురేఖ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. దాంతో మరోసారి ప్రతిపక్ష సభ్యులు బల్లలు చర్చారు. ఎలాగైనా మంత్రి హరీష్‌రావు దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్న ఆలోచనతో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేశారు. కాని ఆయన వేసిన ఎత్తును కూడా హరీష్‌రావు చిత్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో వున్న లుకలుకలు అసెంబ్లీ సాక్షిగా బైట పెట్టి, బిఆర్‌ఎస్‌ బలమైన ప్రతిపక్షమని మరోసారి రుజువు చేశారు. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలోవున్నా ప్రజల కోసం నిత్యం పాటు పడేది బిఆర్‌ఎస్సేనని మరోసారి హరీష్‌రావు నిరూపించారు. పాలకపక్షం సభ్యులనుంచి కూడా తర్వాత ప్రశంసలందుకున్నారు.

ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

ఐక్యంగా పని చేశాం..

అద్భుత విజయం సాధించాం..

కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు.. 

ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె 

ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన విజయం సాధించామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నర్మెట మండల కేంద్రంలోని వినాయక గార్డెన్ లో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సమావేశానికి పార్టీ మండలా ధ్యక్షుడు చింతకింది సురేష్ అధ్యక్షత వహంచగా, పల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని మొదటిసారి మండలానికి విచ్చేయగా, ప్రజాప్రతినిధులు, నాయకులు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధి 17 గ్రామాల్లో 14 గ్రామాల్లో సంపూర్ణ మెజారిటీ ఇచ్చా రన్నారు. నర్మెట మండల ప్రజలంతా బీఆర్ఎస్ వెంట, కేసీఆర్ తోనే ఉండాలనుకుని చాలా కృషి చేశారని, అందుకే మంచి మెజారిటీ వచ్చిందని, అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఈ నెల 9న ప్రమాణ స్వీకారం రోజునే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రమాణం చేశారని, కానీ, నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. రైతులంతా ధాన్యం అమ్మొద్దని, రూ.500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని మర్చా రన్నారు. అలాగే మహాలక్ష్మి పథకంలో ఒక్క బస్ పథకం ఇచ్చి మిగితావి ఇవ్వకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇక సీఎం ఆఫీస్ ముందు ముళ్ల కంచె వేసింది కేసీఆర్ కాదని, ఆ రోజు వేసింది వాళ్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి..ఈరోజు తీసింది వారేనని గుర్తు చేశారు. పదేళ్ల కాలంలో విద్యుత్ విషయంతో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తెచ్చిన అప్పుల గురించి చెబుతున్న సీఎం ఇచ్చిన ఆస్తుల గురించి మాత్రం చెప్పకపోవడం సరి కాదన్నారు. గతంలో19 లక్షల బోర్ల ఉంటే ఇప్పుడు 23 లక్షల బోర్లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. సివిల్ కార్పొరేషన్ కు సంబంధించి రూ.56 వేల కోట్లు అప్పులు చేసామని చెబుతున్నారే తప్ప, రూ.45 వేల కోట్లు రావాలని చెప్పకుండా అబద్దాలు మాట్లాడుతు న్నారన్నారు..ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వొద్దంటున్నారని, అయితే గతంలో సీతక్క, శ్రీధర్ బాబు ద్వారా ఇప్పించా ము కదా అని గుర్తు చేశారు. ఐదేళ్లు నేను జీతం నేను తీసుకోనని, కార్యకర్తకు ఇస్తాననన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రుల దగ్గరికి వెళ్లి మాట్లాడే శక్తి నాకు ఉందని, చట్టపరంగా ఎలా నిధులు తీసుకోవాలో అలానే తీసుకొస్తానన్నారు. ఇక కేసీఆర్ పేరుతో ఉన్న శిలా ఫలకాలను మట్టితో చేర్పుతున్నారని, బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు చెప్పకుండా కేసీఆర్ పై ఆసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అద్భుతమైన అమరువీరుల స్తూపం, ప్రగతి భవన్ మేమే కట్టించామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ లో ఇటీవల ఢిల్లీ గులాంలకు విందు ఏర్పాటు చేశారని, అమరవీరుల కుటుంబాలకు విందు పెట్టారా అని ప్రశ్నించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా నా దగ్గరికి రావొచ్చు..డైరెక్ట్ గా వచ్చిన సమస్య చెప్పుకోవచ్చన్నారు. వచ్చే ఆరు నెలల్లో ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వస్తున్నాయని, మెజారిటీ సీట్లు మనం గెలిచే అవకాశం ఉందన్నారు. అయితే ఐదేళ్లు నికరంగా కొట్లాడే వాళ్లు మనకు కావాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు గొడవలు చేసే ప్రయత్నం చేస్తారని, వారి దాడులను ఎదుర్కొనే నాయకులు, కార్యకర్తలు కావాలన్నారు.

వివాహ మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలో శనివారం రోజున మొలుగూరి మమత-రాజ్ కుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ రేగూరి విజయ పాల్ రెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,నాయకులు సిలువేరు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version