వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

జీ తెలుగు న్యూస్ ఛానల్ వాళ్ళు నిర్వహించిన హెల్త్ కాంన్ క్లేవ్ అండ్ అవార్డ్స్ 2022 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న వైద్యులను,వైద్య సిబ్బందిని మంత్రి సన్మానించి సత్కరించారు.

కరోనా సమయంలో వైద్యులు అందించిన సేవను గుర్తుచేసి మంత్రి అభినందించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, వైద్యరంగ నిపుణులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ:

 

ఇటీవలి కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రజారోగ్యం మీద బాగా అవగాహన పెరిగింది. ప్రజలు, ప్రభుత్వాలు ప్రజారోగ్య ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాయి. ప్రభుత్వ రంగంలో గాని, ప్రయివేటు రంగంలో గాని పెద్ద ఎత్తున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టి అవసరమైన అన్ని వసతులు సమకూర్చుకుంటున్నాయి. 

 

మరి ముఖ్యంగా కరోనా సమయంలో సేవలందించిన వైద్యుల పైన వైద్యరంగం పైన ప్రజలకు అపారమైన నమ్మకం గౌరవం పెరిగాయి.

 

ఇక మైనది ఎందుకంటే ఇందులో వైద్యులు ఇది వృత్తిలా కాకుండా బాధ్యతగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి.

 

చాలా సందర్భాల్లో పర్సనల్ లైఫ్ ని ఫ్యామిలీ లైఫ్ ని కూడా పక్కనపెట్టి ధర్మాన్ని బాధ్యతగా నిర్వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అవార్డు పొందే డాక్టర్లే కాదు యావత్ వైద్యులకు వైద్య సిబ్బందికి సిబ్బందికి నా యొక్క అభినందనలు.

 

తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్ల కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు తగ్గాయి. 

 

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆరోగ్య సూచికలలో కూడా గణనీయమైన పురోభివృద్ధి సాధించాం. ఇటీవల రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వైద్యరంగంలో తెలంగాణ చేస్తున్న కృషిని ప్రశంసించింది. వైద్య సేవల మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. 

 

నగరాల్లో పట్టణాల్లో స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉంటాయి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీల సుస్తీ పొగొట్టాలని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. 390 బస్తీ దవాఖానాల ద్వారా పేదలకు వైద్యం అందే ప్రయత్నంలో ఉన్నాం. జీహెచ్ఎంసీ పరిధిలోఇప్పటికే 259 బస్తీ దవాఖానాల ద్వారా వైద్యం అందుతోంది.

 

తెలంగాణలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాము, ఎక్కడైనా వైద్యరంగంలో మంచి విధానాలు ఉంటే వాటిని సమీక్షించి అధ్యయనం చేసుకొని తెలంగాణ ప్రజలకు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *