కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ శ్రీనివాసులు గారు నిన్న ఉదయం హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుండెపోటుతో పరమపదించారు.
ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అమెరికా నుంచి హుటాహుటిన బయలుదేరి వారి ఇంటికి వెళ్లి పార్థివ దేహనికి పూలమాలతో నివాళులు అర్పించి తదనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
శ్రీనివాసులు గారు ప్రజాజీవితంలో నిష్పక్షపాతంగ ప్రజా సేవ చేశారని వారు లేని లోటు తీర్చలేనిదని, మండలం లో ఒక బీసీ నాయకుడి గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని గతంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ బలోపేతానికి ఏనలేని కృషి చేశారు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని ఎమ్మెల్యే గారు అన్నారు.
అనంతరం శ్రీనివాసులు గారి అంతిమయాత్రలో పాల్గొని వారి పాడె మోసి, ఈ సందర్భంగా వారితో సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు మండల ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, ప్రజలు తదితరులు ఉన్నారు.