బిజేపిని విశ్వసించే వాళ్లే లేరు : ఎమ్మెల్సీ పళ్ళ రాజేశ్వర్‌ రెడ్డి

కట్టాతో మునుగోడు నుంచి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

రాజగోపాల్‌ రెడ్డికి ఓట్లసలే పడవు.

మునుగోడును ముంచి కాంట్రాక్టు తెచ్చుకొన్నాడు.

మూడేళ్ల నుంచి జనాన్ని గాలికొదిలేశాడు.

అదే టిఆర్‌ఎస్‌ గెలిస్తే మునుగోడు అద్దయ్యేది…ప్రగతి పరుగులు పెట్టేది.

మిషన్‌ భగీరథ నీళ్లు అందరికన్నా ముందు వచ్చినట్టు, అనేక అభివృద్ధి పనులు జరిగేవి.

కాంగ్రెస్‌ పరిస్థితి అందరూ చూస్తున్నదే….

సిఎం కేసిఆర్‌ సభ సూపర్‌ సక్సెస్‌…

పెద్ద ఎత్తున ప్రజలొచ్చారు…సిఎం చెప్పింది విన్నారు.

నిజానికి ప్రజలు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారు.

సిఎం సభతో మరింత ఫిక్స్‌ అయ్యారు…

బిజేపి గెలిస్తే రాజగోపాల్‌ రెడ్డి ఒక్కడే బాగుపడతాడు.

టిఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే నియోజకవర్గం మొత్తం బాగుపడుతుంది.

ఇది ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా ఇదే మాట వింటున్నాము.

1972 లోనే ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి రూ.254 కోట్లు ప్రతిపాదించారు

 నాయకులకు చిత్తశుద్ధి లేక నిధులు వాడలేదు…ఫ్లోరైడ్‌ పోలేదు.

ప్రతి ఎన్నికలలో ఫ్లోరైడ్‌ సమస్య తీరుస్తామని చెప్పడం, ఓట్లేయించుకోవడం కాంగ్రెస్‌ కు అలవాటు.

ఫ్లోరైడ్‌ లేకుండా చేసి టిఆర్‌ఎస్‌ ఓట్లడుగుతోంది. ఇది మా అంకిత భావం.

మునుగోడులో ఓట్లడిగే నైతిక హక్కు బిజేపి, కాంగ్రెస్‌ కు లేదు.

జనాలు ఆ పార్టీలను అసహ్యించుకుంటున్నారు…

టిఆర్‌ఎస్‌ కే మా ఓటని ప్రజలే చెబుతున్నారు.           

  హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మునుగోడు నియోజకవర్గంలో బిజేపియే లేదు. గ్రామీణ స్ధాయిలో ఆ పార్టీకి తెలంగాణలో చోటే లేదు. ఓటు బ్యాంకు అన్నది అసలే లేదు. కాని హైప్‌ క్రియేట్‌ చేసి, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి, ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు పడతాయా? బిజేపికి ఓట్లు వేయాల్సిన వాళ్లే మునుగోడులో లేరు. ఆ పార్టీకి సానుభూతి పరులు కూడా లేరు. గ్రామీణ జీవన వ్యవస్ధను చిద్రం చేస్తున్న బిజేపిని నమ్ముడం అంటూ జరిగే ప్రసక్తి లేదు. వ్యవసాయానికి కరంటు మోటార్ల దగ్గర నుంచి మొదలు పెడితే…ఎరువుల ధరలు పెంచి, పురుగు మందుల ధరలు విపరీతంగా పెంచి, గిట్టుబాటు ధరలు ప్రకటించడం మానేసి, మార్కెటింగ్‌ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిన పార్టీయే బిజేపి కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రైతులు పండిరచిన బియ్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టడమే కాదు, తెలంగాణ రైతులను నూకలు తినమని చెప్పిన అహాంకార పార్టీ బిజేపి. పైగా ప్రజలకు సంక్షేమ పధకాలు ఇవ్వడం వారిని సోమరిపోతులను చేయడం అన్న భావన వచ్చేలా, అభివృద్ధి కుంటుపడుతుందన్న సాకును చెబుతున్న బిజేపికి ఓట్లు పడతాయా? బిజేపి చేస్తున్న మోసాలను ప్రజలు ఇక సాగన్విరు. అది మునుగోడు నుంచే మొదలౌతుంది. బిజేపి పతనానికి మునుగోడే నాంది…వారి అబద్దాలకు ఇక్కడే పుల్‌స్టాప్‌ పడుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అంటున్నారు. ఆయన మాటాల్లోనే మునుగోడులో ప్రచారంపై కట్టాతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. 

బిజేపి ఎన్నెన్ని మోసాలు చేస్తుందో…ఎన్నెన్ని అబద్దాలు చెబతుందో ప్రజలు చూస్తున్నారు. 

నిత్యాసర వస్తువులు పెరిగినా వాటిని కంట్రోల్‌ చేయడంలేదు. అంటే బిజేపి ప్రభుత్వం సామాన్యులపై మోయలేని భారాలను ఐచ్చికంగానే వేస్తోందన్నది తేటతెల్లమౌతోంది. ఇక రూపాయి విలువ తగ్గడం కాదు, డాలర్‌ విలువ పెరుగుతుందని దేశ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పడం అంటేనే పరిపాలన పట్లు వారికి వున్న చిత్తశుద్ది ఏమిటో తేలిపోయింది. పెట్రోల్‌ ధరలు నిత్యంపెరిగేలా వ్యవస్ధను ప్రోత్సహించి, ప్రజల నెత్తిన బారం మోపి, ప్రెట్రోలియం కంపనీలకు లాభాలు తెచ్చిపెడుతున్న ఏకైక ప్రభుత్వం బిజేపినే… ఎవరైనా ప్రజలకవసరమైన వస్తువులు సరసరమైన ధరలకు, అందుబాటులో వుండాలని చూడాలి గాని, ప్రజల కొనుగోలు శక్తిని నిర్వీర్యం చేసేలా వుండకూడదు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో అంతిమంతా వాటి ప్రభావం సామాన్యుడు కొనుగోలు చేసే నిత్యావసర వస్తువుల మీద పడుతున్నాయి. ప్రజల నడ్డివిరిస్తున్నాయి. దీనికి తోడు జిఎస్టీ బండ తెచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. గ్యాస్‌ బండ ధర విపరీతంగా పెంచుకుతున్నారు. అంటే ప్రజలు పెట్రోల్‌ ధరల మూలంగా పని చేసుకోలేక, పెరుగుతున్న ధరల మూలంగా కొనుగోలు శక్తి లేక, పెరిగిన గ్యాస్‌ ధరలకు కొనుక్కొలేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేక, ఆఖరుకు వంట చేసుకొని నాలుగు మెతుకులు తినలేని స్ధితికి ప్రభుత్వమే నేట్టేడయం బాధాకరం. పైగా ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రే చెప్పడం అంటే ప్రజల జీవన స్ధితి మీద వారికి ఎంత అవగాహన వుందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బిజేపి చేస్తున్న మోసాలు రాస్తే రామాయణమంతా, వినిపిస్తే బారతమంతా అవుతాయి. 

  వీటి ప్రభావం మునుగోడు మీద ఖచ్చితంగా పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. 

మునుగోడు ఉప ఎన్నిక అన్నది ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్‌రెడ్డిని, బిజేపి పార్టీని ప్రజల అసహ్యించుకుంటున్నారు. తన స్వార్ధం కోసం, తన కంపనీకి రూ.18 వేల కాంట్రాక్టుకోసం నియోజకవర్గాన్ని ముంచిన నాయకులు చరిత్రలో ఎక్కడా కనిపించరు. ఒక్క రాజగోపాల్‌రెడ్డి తప్ప…అలాంటి వ్యక్తిని నమ్మి గతంలో ఓట్లేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల ప్రయోజనాలు, నియోకవర్గ ప్రగతిని విస్మరించి, గెలిపించిన ప్రజలను మోసం చేసిన వ్యక్తిగా రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలు ఎప్పుడూ అసహ్యించుకుంటూనే వుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి, వ్యాపారాలలో లబ్ధి పొందాలని చూడడం దుర్మార్గం. అందుకే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డికి ఘోర ప్రభావం తప్పదు. మరోసారి మునుగోడు గురించి ప్రస్తావించే అర్హత కూడా కోల్పోయాడు. ఏ కేంద్ర ప్రభుత్వమైతే రైతులను మోసం చేస్తుందో ఆపార్టీలో చేరి రాజగోపాల్‌రెడ్డి ఎలాంటి సంకేతాలిస్తున్నట్లో గమనించలేనంత అమాయకులు కాదు ప్రజలు. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ది చెప్పడానికి ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ప్రజల్లోకి రాలేని పరిస్ధితి రాజగోపాల్‌రెడ్డిది. ఏ ఊరికెళ్లినా తరుముతున్నారు. మరో నాలుగు రోజులైతే మునుగోడులో ఒక్క బిజేపి కార్యకర్త కూడా కనిపించడు. మునుగోడులో ప్రచారానికి అద్దెకొచ్చిన వాళ్లు, మళ్లీ మునుగోడు ముఖం కూడా చూడరు. రాజగోపాల్‌రెడ్డి అసలే చూడడు. ఈ విషయం ప్రజలకు తెలుసు. ప్రజలను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసే నాయకులకు రాజగోపాల్‌రెడ్డి ఓటమి ఓ గుణపాఠంగా మిగిలిపోతుంది. 

 నిజంగా ఉమ్మడి నల్లగొండను ఏలిన కాంగ్రెస్‌ నేతలకు ఏనాడు చిత్తశుద్ది లేదు. ఫ్లోరైడ్‌ సమస్య తీరిపోవద్దన్నట్లే యాభైఏళ్లపాటు వ్యవహరించారు.

 ఆఖరుకు దివంగత పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారం చేయాలని అనుకున్నాడు. కాని నల్లగొండ జిల్లానేతలే ఆయనకు సహకరించలేదు. ఫ్లోరైడ్‌ను రూపు మాపేందుకు ఆయనకు తోడు నిలవలేదు. ఉమ్మడి రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేయాలని అనుకున్న పి.విని దించేశారు. ఫ్లోరైడ్‌నిధులు మురిపోయేలా చేశారు. ఆనాడు రాజకీయాల కోసం పి.వి. దించడానికి సహకరించిన నల్లగొండ కాంగ్రెస్‌ నాయకులు, ఫ్లోరైడ్‌ సమస్యను మాత్రం గాలికి వదిలేశారు. నాడు కేటాయించిన రూ.254 కోట్లు అక్కరకు రాకుండా చేశారు. ఫ్లోరైడ్‌ సమస్యను సజీవం చేశారు. ఎన్నికలొచ్చినప్పుడు ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతామని చెప్పడం, గెలవగానే ఫ్లోరైడ్‌ సమస్య మర్చిపోవడం. దశాబ్ధాలుగా కాంగ్రెస్‌ చేసింది ఇదే..అందులో కోమటి రెడ్డి బ్రదర్స్‌ కూడా భాగాస్వాములే… గత ముపై సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాల్లో వున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లగొండ ఫ్లోరైడ్‌ సమస్యను పట్టించుకోలేదు. నాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తేలేదు. కాని ఆయన వ్యక్తిగత సంపాదన కోసం మాత్రం పులిచింతల ప్రాజెక్టు తెచ్చుకున్నాడు. పోతిరెడ్డి పాడు పొక్క పెంచే కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఫ్లోరైడ్‌ సమస్య తీర్చలేదు. 

  ఫ్లోరైడ్‌ సమస్య తీరాలంటే తెలంగాణ రావాల్సిందే అని ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఊరూరుకిచెప్పాడు.

 ఇప్పుడు ప్రతి ఊరికి సురక్షితమైన మంచినీళ్లు అందిస్తున్నాడు. దటీజ్‌ కేసిఆర్‌… తెలంగాణ రాగానే మునుగోడులో ఫ్లోరైడ్‌ సమస్య తీర్చుతానని చెప్పాడు. అన్నట్లుగానే ఉమ్మడి నల్లగొండ జిల్లాతోపాటు, మునుగోడులో ఫ్లోరైడ్‌ లేకుండా చేశాడు. మిషన్‌ భగీరధ పైలాన్‌ ఇక్కడే ఏర్పాటు చేసి, తొలి స్వచ్ఛమైన మిషన్‌ భగీరధ నీటిని మునుగోడుకే ఇచ్చిండు. ఇదీ నాయకులకు వుండాల్ని కమిట్‌ మెంటు. ప్రజలకు మాటిచ్చామంటే నెరవేర్చాలి. అందులో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఫ్లోరైడ్‌ మహామ్మారి అంతం చూడాలంటే ముందు అలాంటి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ప్రత్యేక చొరవతో ముందుగా మునుగోడును శతాబ్ధాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్‌ సమస్యను తీర్చాడు. అందువల్ల మునుగోడులో ఓట్లడిగే హక్కు ఒక్క టిఆర్‌ఎస్‌కే వుంది. బిజేపికి, కాంగ్రెస్‌లకు ఓట్లడిగే నైతికతే లేదు. మునుగోడు ప్రజల జీవన సంజీవని మంచినీళ్లు..ఆ గొంతును తడిపిన అమృతమటువంటి సురక్షిత మంచినీరిచ్చిన టిఆర్‌ఎస్‌కే మా ఓటని ప్రజలే నినదిస్తున్నారు. కూసుకుంట్లప్రభాకర్‌రెడ్డిని దీవిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *