ప్రజా సేవపై ఎందుకింత కక్ష్య

 ` సేవలకుకు అడుగడుగునా అడ్డంకులు
` రాజకీయ, వ్యాపార ముసుగులో వైద్య సేవకు విఘాతం
` బీదలకు ఆరోగ్యమే లక్ష్యంగా వచ్చిన వారిపై అధికార జులుం
` ప్రంపంచంలో ప్రైవేటు డాక్టర్లు రూ. 1 కే సేవ చేస్తున్న ధాఖాలాలున్నాయా..?
` చేసే వారిని ప్రోత్సహించి ప్రభుత్వ అధికారిగా భాద్యత నిలుపుకోరా..?
` మీ అభ్యంతరం నిర్వాహకులపైనా లేక బీదలకు వైద్యం అందడం ఇష్టం లేదా..?

` అన్ని అనుమతులున్నా అవాంతరాలేందుకు
` సేవ ఇష్టం లేని వారితో చేతులు కలిపి ప్రజలకు అన్యాయం చేయోద్దు
` సీజీ ఆసుపత్రి పట్ల అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు
` ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు , నిర్వాహకులు

 

బ్యూరో ( హైదరాబాద్‌ ) , నేటిధాత్రి : ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆరోగ్య తెలంగాణ గా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకెళుతున్న క్రమంలో ప్రజలకు అందుతున్న అత్యంత చౌకైన ఆరోగ్య సేవలను ప్రజలకు అందకుండా చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలో కరోన సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడికి అధికారులు ప్రత్యక్షంగా , పరోక్షంగా సహకరించి ప్రజలు ఉసురు పోసుకున్నారని వస్తున్న విమర్శలను నిజం చేసేలా వ్యవహరిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.

తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ డీఎంహెచ్‌వో వెంకటి ఓ చారిటీ ఆసుపత్రికి విషయంలో వ్యవహరిస్తున్న తీరు స్థానిక ప్రజల్లో తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో బీద , మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానాల రూపంలో కొందరు వైద్యులు ప్రజలకు ఎంతటి ఆరోగ్య ఆపద వచ్చినా అత్యాధునిక సాంకేతికత , సౌకర్యాలతో వైద్య సేవలను అందించడానికి కొందరు సామాజిక స్పృహ, సమాజ సేవాభావం ఉన్న వైద్యులు కలిసి ఓ ఆసుపత్రిని సోంత ఖర్చులతో ఏర్పాటు చేసి ప్రజలకు సేవలందిస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న క్రమంలో కొందరు వ్యక్తులు బీదలకు అందుతున్న వైద్య సేవలను చూసి ఓర్వలేక చేస్తున్న కుట్రల్లో ఆరోగ్య శాఖ అధికారులు పాత్ర వహిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరు వ్యాపారం ఉద్యోగం గురించి , ధనార్జనే ధ్యేయంగా జీవితాలు గడుపుతున్న నేటి రోజుల్లో తాము చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేస్తూనే తమకు ఉన్న సమయంలో బీద ప్రజలకు , నాణ్యమైన వైద్యాన్ని ఆర్ధిక కారణాల చేత పొందలేక పోతున్న అభాగ్యులకు
అండగా ఉండాలనే గొప్ప హృదయంతో ముందుకోచ్చిన వారిపైన ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన అన్ని అనుమతులున్నప్పటికి కావాలనే ఈ ప్రజా వైద్య సేవను ఎటిఆ్ట పరిస్థితుల్లో అడ్డుకోవాలని చూస్తున్న కొందరు దూర్మార్గుల ఆలోచనలకు అధికారులు వంత పాడేలా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
రాజకీయ, వ్యాపార ముసుగులో వైద్య సేవకు విఘాతం

ప్రజలకు సేవ చేయడంలో పరోక్షంగా , ప్రత్యక్షంగా ఉన్న రాజకీయ , వ్యాపార రంగాలకు చెందిన వ్యక్తులే ఇప్పుడు ఈ చారీటీ ఆసుపత్రిని అడుగడుగునా అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం.

తమకు రావాల్సిన లాభాలను , ప్రజల రక్తం తాగడానికి మరిగిన కలియుగ రాక్షసుల అనందాన్ని ఈ ఆసుపత్రి కళ్ళముందే అడ్డుకుంటుండడంతో దిక్కు తోచని ఈ దుర్మార్గులు అధికారులకు తప్పుడు సమాచారాలను ఇచ్చి చర్యలకు ఒత్తిళ్లు తీసుకు వస్తుండడంతో అధికారులు అన్ని పరిశీలించకుండానే చర్యలు తీసుకోవడానికి ముందుకోచ్చి ప్రజలకు ఆసరాగా ఉన్న ఆసుపత్రి సేవలను దూరం చేశారు. ఈ విషయమై ఆ నోట ఈ నోట ప్రజలు చర్చించుకుంటున్న క్రమంలో అధికారుల ఎంట్రీకి , ఆసుపత్రి సేవల నిలుపుదలకు కొందరు రాజకీయ, ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే రాక్షసుల హస్తం ఉన్నట్లు ఆసుపత్రి సేవలు పొందిన ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజలకు మంచి చేయడానికి ముందుకు రాని వారు కేవలం వారి స్వార్ధ ప్రజయోజనాలకు చారీటీ సేవలను అడ్డుకొవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్త చేస్తూనే ఇలాంటి దుర్మార్గుల వివరాలను ,సీజీ ఆసుపత్రికి ఉన్న అన్ని అనుమతులను ఏకకాలంలో బహిరంగ పర్చి తప్పుదారి పట్టించే వారికి తగిన బుద్ధి చెప్పడంతో పాటు ప్రజాక్షేత్రంలో వారికి తగిన బుద్ది చెప్పాలని సమాజ సేవకులు కోరుకుంటున్నారు.

` ప్రభుత్వ పెద్దలు , ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్న ప్రజలు , నిర్వాహకులు
కేవలం నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా చేసుకుని తమ స్వంత డబ్బులను పెట్టి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని సమాజసేవకు ముందుకోచ్చి వారి ఆలోచనలను ప్రతి ఒక్కరు సమాజంలో గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మానవ సేవను చేయడానికి సమయం లేక కొందరు , సమయం ఉండి కూడా చేయలేక కొందరు ముందుకు సాగుతున్న ఈ సమాజంలో ప్రాణాలను కాపడడమే లక్ష్యంగా సాగుతున్న ఓ మహత్తర కార్యక్రమాన్ని అడ్డుకొవడం మూర్ఖత్వం. లక్షలాది రూపాయల జీతాలను కాదని జీవితంలో కొంతైనా ప్రజలకు సేవ చేయాలని స్పకల్పించుకున్న వ్యక్తుల ఆలోచనను, వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అడగడుగునా ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసే వ్యవస్థలు అడ్డుపడ్డప్పటికి మానవీయ కోణంలో అధికారులు ఆలోచించి ప్రజలకు సేవలను అందేలా చూడాల్సిన భాద్యత ఎంతైనా ఉంది. రాష్ట్ర రాజధానిలో ఉన్న వేలాది ఆసుపత్రులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని ఖచ్చితంగా అధికారులు చెప్పగలరా..? కేవలం అడ్డుకోవాలనే ఆలోచన ఉన్న ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఆటంకాలను కల్పిస్తున్న వ్యక్తులకు సహకరించకుండా ఉంటూ అవసరమైనా ఏవైనా అనుమతులు సేవ కోణంలో పని చేస్తున్న వ్యవస్దలు పొంది ఉండకపోతే వారి సలహాలు సూచనలిచ్చి పొందేదుకు సమయమిచ్చి వారి సేవలను నిర్విరామంగా కొనసాగేలా చూడాల్సిన బాద్యత అధికారులపై ఉందని గుర్తెరిగితే మంచిది. సమాజంలో అర్హత లేని వైద్యులు , అనుమతి లేని ఆసుపత్రులు రాష్ట్రంలో ఎక్కడో ఏ మూలనో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయాన్ని తెలిసినప్పటికి స్థానిక పరిస్థితులకు తలొగ్గి ఉంటున్న వ్యవస్థలు సమాజ సేవలకు అన్ని ఆటంకాలు కలిగించకుండా అవసరమైన సహాయ సహకారాల్సి అందిస్తారని ఆశిద్ధాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *