పాలిటి విజన్‌`పొలిటికల్‌ డైనమిజమ్‌

అందరినీ కలుపుకుపోయే తత్వం…

ఉద్యమపోరాటం ధైర్యం..

కరోనా కాలంలో చూపిన తెగువకు సంకేతం

అవినీతి ఆరోపణలు లేని రాజకీయం..

కేటిఆర్‌ లో వున్న ప్రత్యేకత

విభిన్న శైలి తన సొంతం

ఉద్యమకాలంలో దూకుడు

మంత్రిగా పాలనలో రాజనీతిజ్ఞుడు

మంత్రిత్వ శాఖలలో అనూహ్య విజయాలు

ఐటి రంగంలో రాష్ట్రం పరుగులు

పారిశ్రామిక రంగంలో విప్లవాలు

మున్సిపల్‌ పాలనలో సమున్నతమైన మార్పులు

పట్టణ ప్రగతిలో పరుగులు

పార్టీ పటిష్టతలో తనదైన ముద్రలు

కార్యకర్తలకు భీమా విభిన్నమైన ఆలోచన.

కొందరు తక్కువ వయసులోనే అధ్భుతాలు సృష్టిస్తుంటారు. ఎంచుకున్న రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ఏ రంగం ఎంచుకున్నా విజయాలు సొంతం చేసుకుంటారు. తమదైన శైలిని ప్రదర్శిస్తుంటారు. ప్రత్యేకతను చాటుకుంటారు. పదిమందిలో ఒకరుగా గుర్తింపబడుతుంటారు. తమదైన ముద్రను వేస్తుంటారు. ఆదర్శవంతులౌతారు. స్పూర్తిదాతలౌతుంటారు. యువతకు ఐకాన్‌లా పిలువబడుతుంటారు. మార్గదర్శకులౌతారు. తనను తాను ప్రతిసారి విజేతగా గుర్తింపుపొందుతుంటారు. అందరిచేత అభినందనలు అందుకుంటుంటారు. అధ్భుతాలకే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటారు. అందరి తలలో నాలుకలౌతారు. చిరునవ్వులు పూయిస్తుంటారు. ఒత్తిడిని జయిస్తుంటారు. ఎంత శ్రమైనా అవలీలగా ఎదుర్కొంటారు. ఎదుటివారి మీద గౌరవ మర్యాదలకు లోటు రానివ్వరు. పది నిమిషాలు వారితో మాట్లాడితే చాలు వారెంత గొప్పవారో ప్రత్కేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండానే అర్ధమౌతుంటారు. అలాంటి వారు నాయకులౌతే…ప్రజలకు సేవకులైతే…మేలు చేసే సి ్దతిలో వుంటే…పాలించే స్ధాయిలో వుంటే అది కల్వకుంట్ల తారకరామారావు అవుతారు…ఇలాంటి అనేక సుగుణాలు వున్న ఏకైక యువ నాయకుడు కేటిఆర్‌. అందుకే ఆయనంటే పార్టీలోని నాయకులంతా ఇష్టపడుతుంటారు. అందర్నీ గౌరవిస్తూ పార్టీ కోసం పనిచేసే వారందరినీ కేటిఆర్‌ గుర్తిస్తుంటాడు. అక్కున చేర్చుకుంటాడు. ఆదరిస్తుంటాడు. వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తుంటాడు. అందుకే టిఆర్‌ఎస్‌లో కేటిఆర్‌ను గొప్పగా చూస్తుంటారు. తాను ముఖ్యమంత్రి కేసిఆర్‌ కుమారుడున్న ఏ కొంచెం గర్వం కూడా కనిపించకుండా,అందరిలో ఒక్కడిగానే సాగుతుంటాడు. అదే ఆయన సింప్లిసిటీ అని అందరూ కొనియాడుతుంటారు. పాలనలో ఆయన చూపించే విజన్‌ సామాన్యమైంది కాదు. విదేశాలలో చదువుకోవడంతోపాటు, ప్రపంచ దేశాలలో పాలనపై పట్టు వుండడంతో తెలంగాణలో మున్సిపల్‌ శాఖ మంత్రిగా నగరాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే పొలిటికల్‌ డైనమిజమ్‌ నేటి తరంలో ఆయనను మించిన వారు లేరు. ఆయన కోసం రోడ్డుపక్కన అభిమానులు ఆగితే వెంటనే కాన్వాయ్‌ను ఆపి, వారితో మాట్లాడుతుంటాడు. వారి సమస్యలు తెలుసుకుంటాడు. ఎప్పుడో చిన్నప్పుడు తనకు ఐస్‌ క్రీమ్‌ అమ్మిన వ్యక్తి తారసడి, తనకు ఇల్లులేదని చెబితే వెంటనే ఇల్లిచ్చి, తన జ్ఞాపకాలు పంచుకున్నారు. తన బాల్య సృతులు చెప్పుకొచ్చారు. అప్పుడూ, ఇప్పుడూ తాను ఎంత సింప్లిసిటీ అన్నది చెప్పకనే చెప్పారు. ఇక హుస్సేన్‌ సాగర్‌లో సామాజిక సేవ చేసే వ్యక్తిని గురించి తెలుసుకొని, డబుల్‌ బెడ్‌ రూం ఇచ్చి, ఇంటికి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి, తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఇక కరోనా సమయంలో ఓ తల్లి తన పిల్లాడికి పాలు లేక ఇబ్బందులు పడుతుందని తెలిసి, డిప్యూటీ మేయర్‌ను పంపించి ఆ పసి వాడి ఆకలి తీర్చిన ప్రజా సేవకుడు కేటిఆర్‌. ఓ వైపు కరోనా అంటే అందరూ భయపడిపోతున్న వేళల్లో, ఇళ్లలో నుంచి ఎవరూ బైటకు కూడా రాకుండా బిక్కు బిక్కుమంటున్న సమయంలో, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లలో కూడా తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించిన ఏకైక నాయకుడు కేటిఆర్‌. సహజంగా ఆ సమయంలో ఏ నాయకుడు కూడా బైటకు వచ్చేందుకు జంకుతారు. కాని ఆయన ఎక్కడా జంకూ బొంకు లేకుండా ప్రజల మధ్యకు వెళ్లాడు. వారికి కొండంత ధైర్యం నింపాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం వెళ్లాడు. ఇక ఇదిలా వుంటే గత ఏడాది హైదరాబాద్‌లో కుండపోత వాన గుర్తులు ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరు. ఓ వైపు కరనో భయం, మరో వైపు వర్ష భీభత్సం. వర్షం వల్ల పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి, మోకాలు లోతు నీళ్లున్నా బురద కూడా లెక్క చేయకుండా వెళ్లి, ప్రజలు బాగోగులు చూసుకున్న నాయకుడు కేటిఆర్‌. వారికి వసతులు కల్పించాడు. నిత్యావసర వస్తువుల పంపిణీ దగ్గరుండి చేయించాడు.

చీకు చింత లేకుండా, బాదరబందీ లేని అమెరికా జీవితం ఎంతో హాయిగా వుంటుంది. చదువు పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లి, ఉద్యోగం చేసుకుంటూ వున్న కేటిఆర్‌ను తెలంగాణ ఉద్యమం కదిలించింది. కోట్లాది మంది ప్రజల ఆశ తెలంగాణ. లక్షలాది మంది ప్రజలు నిత్యం ఉద్యమిస్తుంటే నేను అమెరికాలో వుండి చేసేదేముంది? నా ప్రజల కష్టపడుతుంటే ఇక్కడ సుఖపడుతూ నేనెలా వుండాలి అని అమెరికా నుంచి వచ్చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాడు. ఎక్కడా తను కేసిఆర్‌ కొడుకు అన్న పెద్దరికాన్ని చూపించలేదు. 2009 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైనా ఆయన ఫ్లోర్‌ లీడర్‌ కాలేదు. తనకు పదవి కావాలని కోరుకోలేదు. అసెంబ్లీలో కూడా అప్పటి ప్లోర్‌ లీడర్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌లు అనుమతితోనే మాట్లాడుతూ వచ్చేవారు. కాని ఉద్యమంలో మాత్రం ఎంతో క్రియాశీలకంగా వుంటూ వచ్చేవారు. నిజానికి ఆయన మంత్రి అయ్యే వరకు కూడా కేటిఆర్‌లో ఓ వక్త దాగి వున్నాడని ఎవరూ ఊహించలేదు. అనర్గళమైన మాటతీరుతో అందర్నీ ఆకట్టుకొనే నాయకుడని ఎవరూ అనుకోలేదు…మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఆయనంటే ఏమిటో నిరూపించుకున్నారు. పాలనాపరమైన పట్టు ఆయనకు పరిపాలన మీద ఎంత వుందో నిరూపించి, అందర్నీ ఆశ్చర్యపర్చారు. తెలుగు,హిందీ, ఇంగ్లీషు బాషల్లో వున్న ప్రావీణ్యం ఆయనకు ఎంతో తోడైందనే చెప్పాలి. ప్రజలకు మరింత చేరువ చేసిందనే చెప్పుకోవాలి. ప్రజల వద్దకు వెళ్తే, అచ్చమైన తెలంగాణ యాసతో, విద్యార్దులు, యువత, ఐటి సదస్సులకు,ఇతర పారిశ్రామక సంస్దలు, వేధికల్లో ఇంగ్లీషు, మైనార్టీ సోదరుల సదుస్సులో ఉర్ధూలో మాట్లాడుతూ మెప్పించగలడు. ఒప్పించగలడు. అంతగా మూడు భాషల్లో అధ్భుతమైన ప్రావీణ్యం వున్న ఏకైక నాయకుడు కేటిఆర్‌. ఇప్పుడు టిఆర్‌ఎస్‌లో ఎంతో మంది ఉన్నత విద్యావంతులైన నాయకులున్నప్పటికీ కేటిఆర్‌లా అనర్గళమైన బాషోచ్చరణ వున్న నాయకుడు మరొకరు లేరు. 

రాజకీయంగా కేటిఆర్‌ ఎన్ని ఆరోపణలు ఎదుర్కొనా, అవినీతి ఆరోపణలు ఇప్పటి వరకు ఆయన దరి చేరలేదు. రాజకీయం కోసం ఎవరు ఎన్ని మాట్లాడినా, ఇదీ సందర్భమనిగాని, ఇక్కడ తప్పు జరిగిందన్న విషయాన్ని ఎవరూ రుజువు చేయలేకపోయారు. అలా తనను ఎవరూ వెలెత్తి చూపించలేని స్ధితిని కూడా ఆయన సృష్టించుకున్నారు. నిజాయితీ పరుడైన నాయకుడుగా గుర్తింపుపొందాడు. విద్యార్ధుల వద్దకు వెళ్తే తాను ఓ చిన్న పిల్లోడౌతాడు. అవ్వల దగ్గరకు పోతే ఆ అవ్వలకు మనవడుగా వారిని చిరునవ్వులౌతాడు. అంతటి గొప్పదనం కేటిఆర్‌ సొంతం. ఇక పాలనా పరమైన విషయాల కొస్తే, మన దేశంలో ఏ మంత్రికి దక్కని అనేక అరుదైన గౌరవాలు , సత్కారాలు అనేక సందర్భాలలో కేటిఆర్‌కు లభించాయి. ప్రపంచంలో ఏ మూలన ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా తప్పకుండా కేటిఆర్‌కు ఆహ్వానం అందడం అన్నది ఆనవాయితీగా మారింది. ఆయన చొరవతో తెలంగాణలో ఐటి రంగంలో విప్లవాలు చోటు చేసుకున్నాయి. ఐటి ఎగుమతుల్లో తెలంగాణ మేటి అన్నది సాధించడంలో కేటిఆర్‌ పాత్ర అమోఘమైంది. అనన్యమైంది. ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటే కేటిఆర్‌ చొరవతో ఆవిషృతమైన ఐఎస్‌.ఐ` పాస్‌ అన్నది అందరికీ ఆదర్శమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా టిఎస్‌.ఐపాస్‌ను అనుసరిస్తున్నారంటే అతిశయోక్తికాదు. ఇక మున్సిపల్‌శాఖ విషయానికి వస్తే,నగరాల్లో మౌలిక సదుపాయల కల్పనలో తీసుకుంటున్న చొరవ, జరుగుతున్న అభివృద్ధి మన కళ్లముందే కనిపిస్తోంది. ఈ విజయమంతా కేటిఆర్‌ ఖాతాలోకే వెళ్తుంది. అలాంటి కేటిఆర్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేసిఆర్‌ ప్రధాని కావాలని, కేటిఆర్‌ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *