నష్టపోయిన రైతులకు కు పరిహారం అందించాలి .పొలం రాజేందర్

మహాముత్తారం నేటిదాత్రి.

తామర పురుగు,తెగులు మరియు అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం.రాజేందర్ డిమాండ్ చేశారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా పొలం.రాజేందర్ మాట్లాడుతూ తామర పురుగు,తెగులు,అకాల వర్షాల వల్ల మిర్చితో పాటు పత్తి, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి అన్నారు,ఆరుగాలం కష్టబడి చేసిన పంటలు దెబ్బతినడంతో పెట్టిన పెట్టుబడి రాదని రైతులు కన్నీరు మున్నీరు అవుతుంటే పాలకులుగాని అధికారులుగాని వారి పంటలను సందర్శించకపోవడం ఒక భరోసా ఇవ్వకపోవడం బాధాకరంఅని వారు అన్నారు.ఇప్పటికైన ప్రభుత్వం ఆర్టికల్చేర్ వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్ర స్థాయిలో సర్వేచేయించి ఎకరానికి లక్ష రూపాయల నష్ట పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు.లేనిపక్షంలో నష్టపోయిన రైతులందరిని సమీకరించి ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు తోట.దేవరాజు,ఏరినేని.నగార్జున్,రైతులు రాంనేని,రఘుపతి,రాంనేని,పెద్ద మల్లయ్య,తోట.లక్ష్మి మల్లు,మొళ్ళు.రాజేందర్,గుంటి.శంకర్ తదితరులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *