దోపిడంతా రాజకీయావతారం కోసమే?

గత ఎన్నికల్లోనే పోటీకి విశ్వ ప్రయత్నాలు?

ఓ పార్టీ కార్యాలయం చుట్టూ రెండు నెలలు ప్రదక్షిణలు?

ఉద్యోగం వుంటే ఎంత పోతే ఎంత?

భవిష్యత్తు పొలిటికల్‌ లైఫ్‌కోసమే ఆ సంపాదనంతా?

తిలా పాపం తలా పంచుతూ… వారి నోళ్లు కట్టేస్తూ…!

ముడుపులతో పై స్ధాయి అధికారుల నోర్లు మూస్తూ?

సేవా ముసుగులో సానుభూతిని రగిలిస్తూ?

కార్యాలయంలో క్షణ కాలం… సేవా పేరుతో వృత్తికి ద్రోహం?

కర్తవ్యం మరిచి, సమాజ సేవ పేరుతో పనికి పంగనామం?

అసత్య ప్రచారాలతో వారిపై నమోదౌతున్న కేసులు?

ఇంత అవినీతి ప్రచారం ఎవరి మీదా లేదు?

పై స్ధాయి అధికారులు ఎందుకు కలడం లేదు?

మంచి చేస్తున్నట్లు కనిపించే వాళ్లంతా మహాత్ములు కాదు. సేవ చేస్తున్నట్లు కనిపించే వాళ్లుంతా గొప్ప వాళ్లు కాదు. వాటి వెనక అర్ధం, పరమార్ధం వేరే వుంటాయి. గురి ఒకవైపు చూపించి, లక్ష్యం మరో వైపు చేరుకుంటారు. నమ్మిన వాళ్లు వెర్రి వెంగళప్పలను చేస్తారు. దోచుకున్నదాని దిష్టి నివారణకు దాచుకోవడానికి ముందు దానం చేసినట్లు కనిపిస్తారు. పిడికెడు పెట్టి కుంచెడు దాచేస్తారు…మానెడు పంచినట్లు ప్రచారం చేసుకొని పుట్టెడు పక్కన పెట్టుకుంటారు…..! మనుషులను పీక్కు తింటూ, పీనుగులను ఏనుగులు చేస్తున్నా అంటే ఎవరైనా నమ్ముతారా? ఇది కూడా అంతే…అర్ధమౌతుందా???తను చేసేదే మంచి అని తనను తాను గొప్పగా ఊహించుకునేవారి వల్లనే సమాజానికి తలవంపులు కూడా వస్తుంటాయి. తనను తాను గొప్పగా ఆవిష్కరించుకోవడం కోసం, అందర్నీ నమ్మించడం కోసం వేసే కొన్ని ఎత్తుగడలు కూడా కళ్లకు గంతలు కడుతుంటారు. అలా నమ్మకం ముసుగులో చైతన్యవంతమైన సమాజాన్ని కూడా బోల్తా కొట్టడంలో కొందరు సిద్ధహస్తులమనుకుంటారు. అభూత కల్పనలో జీవిస్తుంటారు. ఏదో ఒకనాడు ఈ మబ్బు తేలిపోతుంది. నిజమేమిటో తెలిసిపోతుంది. నిప్పును ముట్టుకుంటే కాలక మానదు. అవినీతి ఎన్నటికీ దాగదు. తప్పు వెలుగు చూడక తప్పదు. అసలే వెనుకబడిన ప్రాంతం అక్కడ తాను ఆడిరది ఆట, పాడిరది పాట అనుకుంటున్న ఓ అధికారికి కనువిప్పు కలిగే సమయం తప్పక వస్తుంది. పశ్చాత్తాపపడే కాలం ఖచ్చితంగా వస్తుంది. కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా నిలదీసిన గడ్డ ములుగు. ఏనాడో చైతన్యవంతమైన సమాజాన్ని చీకటిలోకి నెట్టేసే దుర్మార్గామైన వ్యహారం సాగిస్తానంటే ఎల్ల కాలం చెల్లదు.  

                       అలాంటి ములుగులో ఒక్క అధికారి గురించి సమాజమంతా మాట్లాడుకుంటోంది. దశాబ్ధ కాలంగా ఆమె అవినీతికి అడ్డూ అదుపు లేకుండాపోతోందని గొంతెత్తి అరుస్తోంది. ప్రజలకు వారధులైన మీడియా వాస్తవ కథనాలు ప్రచురిస్తోంది. అధికారులు కళ్లు తెరిపించేందుకు తాటి కాయంత అక్షరాలతో అనేక పత్రికల్లో వార్తలు ప్రచురిస్తోంది. అయినా అధికార యంత్రాంగంలో చలనం లేదు. ఉలుకూ పలుకు లేదు. కారణం…? అయితే మీడియా వార్తలు తప్పా…బాధితులు చెబుతున్న నిజాలు తప్పా… ప్రైవేటు సైన్యం అధికారులు కళ్లుండీ చూడలేకపోతున్నారా? ఏది నిజం..ఏది అబద్దం? అధికారులకు మొత్తం తెలుసు. ముగులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలియంది కాదు. కాని పై అధికారులంతా మౌనం వహించడంలో అర్ధమేమిటి? కింది నుంచి పైదాకా వాటాలు పంచుకున్నట్లేనా అన్న అనుమానాలకు తావిస్తున్నట్లు కాదా? అవినీతి ఆరోపణలు అన్ని వస్తున్నా సంబంధిత అధికారిని ఎందుకు విచారించడం లేదు?

                        ఒక మీడియాలో ఒక వార్త వచ్చిందంటే వెంటనే స్పందించాల్సిన అవసరం పై స్ధాయి అధికారులకు వుంది. కాని వాళ్లు ఇంత వరకు కదలడం లేదు. ఒక వేళ మీడియాదే తప్పైతే ప్రకటించండి? లేదా సబ్‌ రిజిస్ట్రార్‌ది తప్పని నిగ్గు తేల్చండి. ఎంత కాలం నాన్చుతుంటారు? రాను రాను బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సంబంధిత అధికారి ఆగడాలు పెరిగిపోతున్నాయి. నేను ఎంత చేసినా నన్ను అడిగేవారు లేరన్న దుర్మార్గం మరింత పెరిగిపోతోంది. ఒక అధికారి ప్రైవేటు సైన్యం నడిపిస్తూ, కార్యాలయంలో అడ్డూ అదుపు లేకుండా అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ చేసిందని మీడియా ఘోషిస్తుంటే కనిపించడం లేదా? వినిపించడం లేదా? నవ్విపోదురు గాక నాకేంటి అన్నట్లు అనుకుంటున్నారా? ఒక అధికారి చేసే అవినీతి, అవకతవకలను మీడియా వెలుగులోకి తెస్తే మీడియాపై కేసులు నమోదు చేస్తారా? ఏ చట్టం చెబుతోంది? ప్రజలకు ఏ కష్టమొచ్చినా మొదట తలుపు తట్టేది పోలీస్‌ స్టేషన్‌. ఆ తర్వాత అన్యాయం చెప్పుకునేది మీడియా… ప్రజాస్వామ్య వ్యవస్ధలో నాలుగో స్ధంభం అన్న గౌరవం మీడియాకు వుంది. 

                          మీడియా లేకుంటే మిగతా మూడు వ్యవస్ధలు కూడా కూలిపోతాయన్నది నిజం. మంచైనా, చెడైనా వెలుగులోకి తెవాలన్నా వారధి మీడియా…ఏదైనా ప్రపంచం దృష్టికి రావాలన్నా కావాల్సింది మీడియానే…దేశ స్వాతంత్య్రమైనా , తెలంగాణ ఉద్యమైనా, ప్రభుత్వ పనితీరైనా, రాజకీయ పార్టీల సమాచారమైనా,అధికార యంత్రాంగం ప్రకటనలైనా అన్నింటికీ సర్వరోగ నివారణి మీడియా…అది ఏ రూపంలోనైనా కావొచ్చు. సమాచార విప్లవం ఇంతగా ఫరిఢమిల్లుతున్న సందర్భంలో కూడా మీడియాపై దాడి చేస్తామంటే చెల్లుతుందా? సమాజం ఎటు పోతోంది. పాలకుల నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మీడియాను ఎవరు బెదిరించినా ఉపేక్షించేది లేదని సాక్ష్యాత్తు మంత్రి కేటిఆర్‌ ప్రకటించారు. మీడియాను నాయకులు బెదిరించారంటే అది వారి వ్యక్తిగతమైన విషయం. రాజకీయంగా తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్నప్పుడు సమాజంలో అలాంటి ఘటనలు జరగుతుంటాయి. అది సమాజం చూసుకుంటుంది. కాని ఒక అధికారి ప్రతి క్షణం అవినీతిలో కూరుకుపోతుంటే మీడియా ప్రశ్నించొద్దా? విచ్చలవిడిగా అక్రమ సంపాదనకు తెగడబడుతుంటే రాయొద్దా? అమాయకులను వంచిస్తుంటే నిలదీయొద్దా? మీడియా కూడా కళ్లు మూసుకొని కూర్చోవాలా? దీనంతటికీ కారణం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమని చెప్పకతప్పదు. తెలంగాణ ఉద్యమానికి ఆయువు, అధికార పార్టీ పత్రికలో వార్త వస్తే కూడా అధికారులు పట్టించుకోలేదంటే ఏం సంకేతాలు పంపిస్తున్నట్లు? ఆ అధికారిని మరింత ప్రోత్సహించినట్లు కాదా? అందిన కాడికి దోచుకో…అన్యాయాలు చేసుకో అని శాఖపెద్దలు లైసెన్సులిచ్చినట్టా? కమీషనర్‌ స్ధాయి అధికారులు కూడా ఎందుకు కళ్లు మూసుకుంటున్నారు. ఇందుకేనా ప్రభుత్వం ఉన్నత స్ధాయిలో నియమించింది. సదరు అధికారి గురించి శాఖ కమీషనర్‌కు వివరాలు అందుతున్నా ఆయన కూడా ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదు. 

                         స్టాంపులు,అండ్‌ రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్యమంత్రి దగ్గర వుండడం అధికారులకు వరంగా మారిందా? మొత్తం వ్యవస్ధ భ్రష్టు పట్టించేందుకు అవకాశంగా మారిందా? నిజానికైతే సిఎం వద్ద ఆ శాఖ వుండడం వల్ల అధికారుల్లో మరింత అప్రమత్తత వుండాలి. ప్రతి క్షణం భయంతో పనిచేయాలి. కాని ఇంత నిర్లిప్తత, నిర్లక్ష్యం వుంది అంటే పై స్ధాయి అధికారులు సిఎం దాకా అక్రమాలు వెళ్లకుండా నొక్కి పెడుతున్నారని అనుకునే వీలులేకపోలేదు. అసలు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్లశాఖ అంటేనే అవినీతికి నిలయమన్న భావన సమాజంలో నాటుకుపోయింది. దాని నుంచి బైటపడి ఆ శాఖ కూడా నిజాయితీకి తలమానికం చేస్తామన్న ఆలోచన పై స్ధాయి అధికారులకు కూడా లేదా? సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూడా అసెంబ్లీలో చెప్పిందే…అయినా మారడం లేదంటే కారణం …అడ్డూ అదుపు లేకుండా సంపాదిస్తున్న అక్రమ సంపాదనే కారణం కాదా? 

                    రాష్ట్రంలో ఇన్ని వివాదాలు ఎదుర్కొంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ మరొకరులేరు. అయినా శాఖ పెద్దలు కదలడం లేదు…చర్యలుతీసుకున్నదిలేదు. ఇలా ఉపేక్షిస్తూపోవడం వల్లనే సదరు అధికారి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్‌ చుట్టూ, రెండు నెలలు ప్రదక్షిణలు చేసిందని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చూద్దామన్న హామీ కూడా అందినట్లు తెలుస్తోంది. అందుకే అడ్డూ అదుపు లేని సంపాదనకు తెగడబడ్డట్టు కూడా చెప్పుకుంటున్నారు. నా ఉద్యోగం ఊడిపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదన్నంత మాట కూడా సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ తన వాళ్లతో అంటుందన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అందుకే ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా ముసుగేసుకొని అందిన కాడికి దోచుకుంటోందన్న మాటలే సర్వత్రా వినిపిస్తున్నాయి. లేని మంచి తనాన్ని, ముసుగు సేవా గుణాన్ని ఎంత ప్రచారం చేసుకున్నా, ఎన్ని సేవా కార్యాక్రమాల పేరు చెప్పుకున్నా బాధితులు చెప్పే ఒక్క మాట చాలు… సదరు అధికారి అవినీతి సామ్రాజ్యం కూలిపోతుంది. ఎంతో మంది ఉసురు పోసుకుంటూ, ఎండా కాలంలో చలి వేంద్రాలు ఏర్పాటు చేస్తే పాపాలు పోతాయా? చేసిన అన్యాయాలు మాసిపోతాయా? అక్రమాలు వెలుగు చూడకుండా వుంటాయా? అవినీతి పట్టు పగలకుండా పోతుందా? ఇప్పటికైనా పై స్ధాయి అధికారులు స్పందించాలి…లేకుంటే ఆమె ఆగడాలు మరింత పెరిగే అవకాశం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *