డోర్నకల్‌ కవితకే…!

కుటుంబ సభ్యులు కూడా కవితవైపే…!

వారసత్వం ఆడపిల్లకే…!

చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుభవం!

ప్రజల కోసం శ్రమించే తత్వం…

పార్లమెంటు సభ్యురాలిగా అదనపు ప్రాధాన్యం….

నిత్యం ప్రజలతో మమేకం…

ఈసారి మంత్రి అయ్యే అవకాశం…

డోర్నకల్‌ అభివృద్ధికి కవిత గెలుపు ఎంతో బలం..

సమాజంలో ఉన్నత వర్గాల రాజకీయాలు వేరు…సమజానికి దూరంగా, మైదాన ప్రాంతాలకు ఆవల, మరో ప్రపంచంగా కనిపించే గిరిజన ప్రాంతాలలో రాజకీయాలు వేరు…ఇక్కడి ప్రజలు ఎంతో అమాయకులు. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడుస్తున్నా, ఇంకా వారి జీవితాల్లో పూర్తి స్ధాయి వెలుగులు నిండిరది లేదు. సమాజంలో అందరితో సమానంగా బతుకుతున్నది లేదు. ఇప్పటికీ వారి ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం పూర్తి స్ధాయిలో వుండదు. వైద్య సదుపాయాలు అందడం జరగదు. విద్య, వైద్యం పూర్తి స్ధాయిలో కల్పన ఇంకా కలగానే మిగులుతున్న రోజులు…ఈ పరిస్ధితి దేశ వ్యాప్తంగా వున్నదే…అలాంటి ప్రాంతాల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకులు అతి కొద్ది మంది మాత్రమే వున్నారు. గిరిజన జీవితాలకు అండగా నిలిచి వారు తక్కువగానే వున్నారు. ఇప్పటికీ మెజారిటీ గిరిజనులు కొండలు, కోనలు, చెట్టూ, పుట్టను నమ్ముకొని, అడవి తల్లి నీడన జీవితాలు గడుపుతున్నారు. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రి మార్చడం ఎవరి వాల్లా కాదు..అలాగని వదిలేసే విషయం కాదు…అందువల్ల ఆయా ప్రాంతాల అభివృద్ధి అన్నది జరగాలంటే వారి జీవితాల మీద అవగాహన ఒక్కటే వుంటే సరిపోదు…వారి జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు నిరంతరం తపించే, శ్రమించే నాయకత్వం కావాలి. ఆ చిత్త శుద్ది నాయకుడిలో వుండాలి. ఆ లక్షణాలు వుండి, ఇప్పటికీ ఆ ప్రజలతో మమేకమైన వున్నవారు…అలాంటి వారిలో రెడ్యా నాయక్‌ , మాలోతు కవితలాంటి వారు వున్నారు. 

అందరూ ఊహిస్తే అవి రాజకీయాలెలా అవుతాయని రాజుల కాలంలోనే చెప్పుకునేవారు. వేసే అడుగులు, రాజకీయ ఎత్తుగడలు అన్నవి అవతలి వారికి అనువుగా వస్తే ఏముంటుంది మజా! ఊహించని దెబ్బలు కొట్టడంలోనే వుంది అసలు చాణక్యత. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎలాంటి ఎత్తులు వేస్తారన్నది ఎవరికీ అంతుపట్టనిది…అందుకే ప్రతిపక్షాలకు ఎన్నేళ్లు గడిచినా నిద్ర పట్టనిది…లక్ష్యం ఒక వైపు చూపించి, బాణం మరో వైపు సంధించింది ఊహించని దెబ్బ కొట్టడంతో కేసిఆర్‌ దిట్ట….అందుకే ఉద్యమ కాలం నుంచి ఆయన అనుసరించిన వ్యూహాలలో కొత్తదనం కనిపించకపోయినా, ఫలితాలు మాత్రం దిమ్మతిరిగేలా వుంటాయి. అందుకే ఎన్నికలంటే ప్రతిపక్షాలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదిర్శస్తున్నా…కేసిఆర్‌ ఎటు వైపు నుంచి ఎటు రాజకీయం సందిస్తారన్నది ఎవరికీ అర్ధం కానిది…అంతు చిక్కనిది…అలాంటి రాజకీయం కూడా డోర్నకల్‌లో సరికొత్త వ్యూహాన్ని సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారా? అన్న చర్చ పెద్దఎత్తున జరుగుతున్నదే…అందరూ అంచనాలు వేస్తున్నదే…? అయితే ఆసారి డోర్నకల్‌ నుంచి అందరూ టిఆర్‌ఎస్‌ నుంచి రెడ్యానాయక్‌ రాజకీయ వారసుడిగా రవిచంద్రనాయక్‌ పోటీ చేస్తారని అనుకుంటున్నారు. కాని డోర్నకల్‌ నుంచి మహాబూబాబాద్‌ ఎంపి. మాలోతు కవితను రంగంలోకి దింపడానికి కారు పార్టీ సమాయత్తమౌతుంది. ప్రతిపక్షాలను కోలుకోలేని దెబ్బ తీయడానికి గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాన్ని అనుసరించనుంది. 

డోర్నకల్‌ నియోజకవర్గం ఆది నుంచి రెడ్యానాయక్‌ కుటుంబానికి కంచుకోట. అక్కడి నుంచి రెడ్యానాయక్‌ 1989 నుంచి 2009లో తప్ప వరుసగా గెలుస్తూ వస్తున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం కూడ వుంది. సీనియర్‌ ఎమ్మెల్యేగా, డోర్నకల్‌ నియోజకవర్గంలోనే కాదు, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ ఆయనకు మంచి పేరుంది. రాష్ట్ర స్ధాయి నేతగా మంచి గుర్తింపు వుంది. సుధీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో, ప్రజా సేవలో వుండడమే ఎంతో గొప్ప విషయం. అలాంటిది ప్రజా ప్రతినిధిగా మూడుదశాబ్ధాలపాటు ప్రజల మన్ననలు పొందుతూ గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందుకు ఒక నాయకుడికి తన జీవితం కన్నా, తన ప్రజల జీవితం మీద మక్కువ ఎక్కువ వుండాలి. వారి అభివృద్ధి కోసం ఆలోచనలు వుండాలి. నిరంతరం ప్రజల్లో వుండాలి. రాజకీయ ఎత్తుగడలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే దూర దృష్టి కావాలి. ప్రజలు కోరుకున్న రీతిన రాజకీయం చేయాలి. ప్రగతివైపు తన నియోజకవర్గాన్ని పరుగులు తీయించాలి. అప్పుడు తప్ప నాయకుడికి సుధీర్ఘమైన ప్రజా ప్రతినిధిగా ప్రజల దీవెనలు అందడం దుర్లభం. కాని రేడ్యానాయక్‌ ప్రజలను గుండెల్లో పెట్టుకొని వారి కోసం పనిచేయడం ఒక ఎత్తేతే, ఆయనను కూడా ప్రజలు గుండెల్లో పెట్టుకోవడం వల్లనే ఐదుసార్లు గెలవగలిగారు. అలాంటి గుణం పునికి పుచ్చుకున్న వారసురాలు మాలోతు కవిత. చిన్న తనంలోనే ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం మహబూబాబాద్‌ ఎంపిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. గతంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాను ఎమ్మెల్యేగా వున్న సమయంలోనే ఆ ప్రాంతాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇప్పుడు కనిపిస్తున్న అనేక అభివృద్ధి కార్యాక్రమాలు ఆమె చలవతోనే మొదలైనవే…వాటి ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నవి…అలాంటి కవిత…ఈసారి ఎమ్మెల్యేగా అందరూ మహబూబాబాద్‌ నుంచి పోటీ చేస్తారని అనుకుంటున్నారు…మెజార్టీ ప్రజలు కూడా కోరుకుంటున్నారు…కాని ఆమెను పార్టీ డోర్నకల్‌ నుంచి పోటీ చేయించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంతో బలంగా వుంది. అలాగే బలమైన నాయకత్వాలు కూడా వున్నాయి. అలాంటి నాయకత్వాలలో ఆధిపత్య పోరును ఎగదోసి, ప్రతిపక్షాలు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయి. కాని వారి ఆశలు నెరవేరని రాజకీయాలు నెరపడంతో ముఖ్యమంత్రి కేసిఆర్‌దిట్ట. అందుకే రెడ్యానాయక్‌కు కాకుండా డోర్నకల్‌ నుంచి పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితను పోటీచేయించాలని చూస్తున్నారు. దాంతో అటు మహాబూబాబాద్‌, ఇటు డోర్నకల్‌ రెండూ మళ్లీ గులాబీ పార్టీ ఖాతాలోనే వుంటాయి. అయితే రెడ్యా నాయక్‌ కుటుంబంనుంచి కూడా ఆయన కుమారుడిని డోర్నకల్‌ నుంచి పోటీ చేయాలని చూస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాని వాటికి ప్రత్యేకమైన దృవీకరణ లేదు. టిఆర్‌ఎస్‌ అధిష్టానం మాత్రం కవితనే ఎంపిక చేయాలని, ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తోంది. 

చిన్న వయసులోనే మాలోతు కవిత రాజకీయాల్లోకి రావడమే కాదు, తన తండ్రి ప్రజలతో ఎలా మమేకమౌతున్నారన్నదానిని చిన్నప్పటినుంచి గమనిస్తూ వస్తోంది. ఉన్నత విద్యావంతురాలైన కవిత ప్రజల ఆలోచనా విధానం తెలుసు. వారి అవసరాలు తెలుసు. సమాజ శ్రేయస్సు కోసం తానేం చేయాలన్నది తెలుసు. తన సామాజిక వర్గ సమస్యలు తెలుసు. ఎన్నేళ్లు గడిచినా వారికి పూర్తి స్ధాయి గుణాత్మక మార్పులు ప్రభుత్వాలు ఎందుకు తీసుకురావడం లేదో తెలుసు. అందుకు ఒక్కొమెట్టు ఎలా వారి ప్రయోజనాల కోసం ప్రగతి దారులు వేయాలో కవితకు తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే తన గిరిజనం కోసం ఎంతో చేయాలన్నదే రాజకీయంగా ఆమె ఆశయం. అన్ని వర్గాల ప్రజల్లాగా వాళ్లు కూడా నాగరిక సమాజం చూడాలి. అనుభవించాలి. అడువుల్లో వున్నా, పట్టణ సౌకర్యాలు వారికి అందాలి. అందుకు చాల కృషి జరగాలి. ప్రభుత్వాలు వారి కోసం ఇప్పుడు కేటాయిస్తున్న నిధులు ఏ మూలకు సరిపోవడం లేదు. ప్రత్యేక సబ్‌ ప్లాన్‌ల ద్వారా నిధులు కేటాయిస్తున్నా, అనుకున్న ప్రయోజనాలు నెరవేరడం లేదు. అయితే ఇంకా ప్రభుత్వంతో కొట్లాడి గిరజన సమాజానికి మేలు చేసేందుకు, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అవసరమైన ప్రణాళికలు ఎన్నొ అవసరమనేది కవిత ఆలోచన. 

ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధి అయిన మాలోతు కవిత ఆ ప్రజల కోసమే నిరంతరం ఆలోచిస్తుంది. వారి ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. మహబూబాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలను ఆమె గుర్తు పడతారు…ఒక్కసారి కవితను కలిసి వ్యక్తి ఎన్ని రోజుల తర్వాత కనిపించినా పేరు పెట్టి పిలిచేంత జ్ఞాపకశక్తి ఆమె సొంతం. అందుకే ఆమె తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎక్కడ ఏ పనులు జరిగాయన్నదానిపై కూడా ఆమెకు పూర్తి స్ధాయి అవగాహన వుంటుంది. ఇక పేదల పాలిట ఆమె పెన్నిధి అని అంటుంటారు. ఇక రాజ్యాంగం, చట్టం, చట్ట సభల వ్యవహారంలో ఆమెకు సంపూర్ణమైన అవగాహన కూడా వుంది. వెనుకబడిన ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా పరిధిలోని ప్రజలు సిఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ముందుగా మాలోతు కవితనే ఆశ్రయిస్తారు. ఏ పని కావాలన్నా ముందు ఆమెనే సంప్రదిస్తారు. కవితది లౌక్యం తెలిసిన ముక్కుసూటి తనం. ఏ విషయంలోనూ దాపరికం వుండదు. మంచిని మంచీ అని, చెడును చెడు అని చెప్పడానికి కూడా వెనుకాడని మనస్తత్వం. ప్రజలు నిత్యం రకరకాల సమస్యలతో ఆమె వద్దకు వస్తుంటారు. అయితే అందులో జరగని పనులు కూడా కొన్ని సార్లు ప్రజలు తెస్తుంటారు. అలాంటప్పుడు వారిని మభ్యపెట్టడమో, పది సార్లు తిప్పుకోవడమే ఎట్టిపరిస్ధితుల్లోనూ చేయరు. తన వద్దకు వచ్చిన ఆ పని అవుతుందనుకుంటే ఆలస్యం చేయరు. కాని పనిని వెంటనే చెప్పేస్తారు. నిజాలు వివరిస్తారు. ఎంతసేపైనా వారికి ఓపికతో సమాధానం చెబుతారు. అందుకే ఈ విషయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు కూడా ఆమె వెళ్లి తమ సమస్యలు చెబుతుంటారు. వచ్చినవారిలో తన నియోజకవర్గ ప్రజలు కాదన్నది కూడా ఆమె చూడరు. ఎవరొచ్చినా వారి సమస్యపరిష్కరించకుండా వుండలేరు. అలా తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌ ముచ్చటగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి. ఈసారి మాలోతు కవిత పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయించాలని పార్టీ కూడా ఆలోచిస్తోంది. ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మాత్రం కచ్చితంగా మాలోతు కవిత మంత్రి కావడం ఖాయం. మహాబూబాబాద్‌ జిల్లాకు మహార్ధశ రావడం తధ్యం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *