చీడ వదిలింది!

`ఈ మాటలంటోది ఎవరో కాదు స్వయానా ఉద్యోగులే?

`మనోహర్‌ స్థానంలో రామ్మూర్తికి అదనపు బాధ్యతలు

` కొత్త డైరెక్టర్‌ ఎంపికపై సెర్చ్‌ కమిటీ ఏర్పాటు!

`అల్పుడిని అందలమెక్కిస్తే అంతా మెక్కేసాడు?

` నిమ్స్‌ పరువు తీశాడు?

`ఇన్సిట్యూట్‌ను భ్రష్టు పట్టించాడు?

`నిధులు నీళ్లలా ఖర్చు చేశాడు?

`ప్యాచ్‌ వర్కులు చేసి పైసలను పుట్కాలు బుక్కినట్లు బుక్కాడు?

`మొదటి నుంచి నేటిధాత్రి హెచ్చరిస్తూనే వుంది!

`నిమ్స్‌ను ఆగం చేస్తున్నాడు చూడండని ఎన్నో సార్లు మొత్తుకున్నాం?

`నేటిధాత్రి చెప్పిందే నిజమైంది?

`నేటిధాత్రి నాలుగేళ్ల అక్షర పోరాటం…విజయం!

`నిమ్స్‌ కే మరకతెచ్చిపెట్టాడు…నమ్మకాన్ని నిండా ముంచాడు?

`ఇప్పటికైనా మనోహర్‌ అక్రమాలు తవ్వితేనే మేలు?

`భవిష్యత్తులో నిమ్స్‌ సొమ్ము ఎవరు తినాలన్నా జంకుతారు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చెప్పిందే నిజమైంది. ప్రభుత్వం తనపై వేటు వేసేందుకే మనోహర్‌ ప్రైవేటులో చేరారని చెప్పింది. ఉద్యోగులు కూడా అదే వాస్తవమని కూడా చెబుతున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత నిమ్స్‌పై డైరెక్టర్‌ మనోహర్‌పై వస్తున్న ఆరోపణలు, విమర్శలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన మనోహర్‌ ఇక తప్పుకోవడమే మేలు అన్న నిర్ణయానికి వచ్చి, సానుభూతికోసం ప్రయత్నం చేశాడు. గుండె చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. కాని ఒక ప్రతిష్టాత్మకమైన అటానమస్‌ హెల్త్‌ ఇన్సిట్యూట్‌కు డైరెక్టర్‌ అన్న సంగతి మర్చిపోయినట్లున్నారని తిట్టుకునేలా చూసుకున్నారు. నిమ్స్‌లో కాదని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి, ఆ వ్యవస్ధకు చెడ్డపేరు తెచ్చారని జనం మాట్లాడుకుంటే వెంటనే ఆ పదవి నుంచి తనను తప్పిస్తారని కూడా ఆయనకు తెలుసు. కాగలకార్యం గంధరవ్వులే తీర్చుతారని తెలిసి, తెలిసి గుండె నొప్పి చికిత్స చేయించకున్న మనోహర్‌ను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఆయన స్ధానంలో ఎట్టకేలకు డీన్‌ రామ్మూర్తికి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పూర్తి స్ధాయి డైరెక్టర్‌ను నియమించేందుకు అవసరమైన సెర్చ్‌ కమిటీని కూడా ప్రభుత్వం ప్రకటించింది. త్వరలో కొత్త డైరక్టర్‌ నియామకం జరిగనున్నది. అయితే అప్పటి వరకు రామ్మూర్తి తాత్కాలిక డైరెక్టర్‌గా విధులు నిర్వహించనున్నారు. ఒక వ్యవస్ధను నిర్వహించాల్సిన వ్యక్తికి ఎంత అంకిత భావం వుండాలి. 

ఎంత ఆదర్శవంతమైన నిర్వహణ కావాలి. ఆ వ్యవస్ధ మహోన్నత చరిత్రను కాపాడే పాత్ర పోషించాలి. దాని గొప్పదనం ద్విగుణీకృతమయ్యేందుకు తోడ్పడాలి. అందుకు ఎంతో కృషి చేయాలి. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఆ వ్యవస్ధను మరింత పటిష్టం చేసే దిశగా పనిచేయాలి. దానికి మరింత పేరు తెచ్చేదిగా ఆ వ్యక్తి పని తనం వుండాలి. కార్యశుద్ధి కావాలి. తన హాయం కూడా ఎంతో గొప్పదని భవిష్యత్తు తరం చెప్పుకునేదిగా వుండాలి. తన కాలాన్ని ఆదర్శంగా తీసుకొని ముందు తరాల వాళ్లు మరింత గొప్పగా ఆ వ్యవస్ధను తీర్చిదిద్దేలా వుండాలి. మరి నిమ్స్‌ డైరెక్టర్‌గా ఇంత కాలం పనిచేసిన మనోహర్‌ ఈ విషయాలన్నింటికీ గాలికి వదిలేశాడని అంటున్నారు. అంతే కాదు అందులో పనిచేసే సిబ్బంది అంతా తిట్టుకుంటున్నారు. ఎంతలా అంటే ఇంత కాలం నిమ్స్‌కు పట్టిన చీడ వదిలిపోయిందంటున్నారు. నిమ్స్‌కు పట్టిన పీడ వదిలిపోయిందని కూడా అంటున్నారు. ఇలా నిమ్స్‌ చరిత్రలో ఇన్ని రకాల మాటలు పడుతున్న డైరెక్టర్‌ మరొకరు లేరు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మనోహర్‌ను నిమ్స్‌ డైరెక్టర్‌గా నియమించింది. నిజానికి నిమ్స్‌ డైరెక్టర్‌ అంటే సమయాన్ని బట్టి వైద్యం చేయాలి. పరిపాలన చేయాలి. విద్యార్దులకు పాఠాలు కూడా బోధించాలి. ఇలా అనేక రకాల డైమన్షన్లు ఆ డైరెక్టర్‌లో వుండాలి. తెలంగాణ వచ్చాక నిమ్స్‌ చరిత్రను మరింత ద్విగుణీకృతం చేసేందుకు అంకితమైన భావం వున్న వ్యక్తి వుంటే చాలని అందరూ అనుకున్నారు. అలాగే ప్రభుత్వం కూడా అనుకున్నట్లుంది. మనోహర్‌ను డైరెక్టర్‌గా నియమించింది. 2015 ఆగష్టులో మనోహర్‌ నిమ్స్‌ డైరెక్టర్‌ అయ్యాడు. కొత్తగా వచ్చిన రాష్ట్రం కావడంతో అన్ని రకాల రంగాలు, అన్ని రంగాల ప్రజలు, అన్ని తరగతుల వ్యవస్ధలను తీర్చిదిద్దుకొవాల్సిన సమయంలో ప్రభుత్వం కొన్ని సార్లు కొందరు అధికారుల మీద విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. ఇదే అలాంటి వారికి వరమైపోయింది.అలాగే మనోహర్‌కు కూడా ఉపయోగపడిరది. పైగా వారి పదవీ కాలాలు పొడిగించుకునేందుకు వీలు పడిరది. ఇదే నిమ్స్‌కు శాపమైంది. నేటిధాత్రి గత నాలుగేళ్లుగా నిమ్స్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై అక్షర శంఖం పూరించి, ప్రతి విషయాన్ని గురించి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసింది. 

ఎప్పటికప్పుడు అందిన సమాచారం మేరకు కొన్ని పదలు సంఖ్యలో వార్తలు ప్రచురించింది. అయినా మనోహర్‌ లీలలు ఆగలేదు. దోపిడీ ఆపలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆశాఖ కదల్లేదు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. నేటిధాత్రి చెప్పిన విషయాలను కూడా ప్రతిపక్షాలు చెప్పినట్లు కొట్టిపారేసుకున్నది. ఇప్పుడు అవే నిజమయ్యాయి. మనోహర్‌మీద నిమ్స్‌లో ఎంత వ్యతిరేకత వుందో ఇప్పుడిప్పుడే ప్రభుత్వానికి కూడా తెలిసివచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా హారీష్‌రావు వచ్చిన తర్వాత మనోహర్‌కు చురుకు తగిలినట్టు తెలుస్తోంది. నిమ్స్‌లో జరుగుతున్న అవకతకల మూలంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వుంది. ఇది గమనించిన మంత్రి హరీష్‌రావు గత ఆరేళ్లుగా నిమ్స్‌లో ఏం జరుగుతోందన్న దానిపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఎలాగైనా తన కమ్మ చిరిగేలా వుందన్న సంగతి తెలిసిన మనోహర్‌ కొత్త నాటకానికి తెరతీసినట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో మనోహర్‌ కొన్ని వందల కోట్లు దుర్వినియోగం చేసినట్లు కూడా అనేక ఆరోపణలున్నాయి. అన్ని కోట్లు ఖర్చు పెట్టినా కొత్తగా జరిగిన నిర్మాణాలు లేవు. కొత్త భవనాలు లేవు. పాత భవనాలు కూల్చికొత్తవి కట్టిన ధాఖలాలు లేవు. కాని మరమ్మత్తుల మాత్రం బోలెడున్నాయి. రంగులకు లెక్కెలేదు. పనిచేయలని ఫ్యాన్ల స్ధానంలో కొత్తవి కొనలేదు. పాతవాటికే నాలుగింతల ఖర్చు చేసి మరమ్మత్తులు చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇలా అవకాశం వున్న ప్రతి చోట మరమ్మత్తులు చేయడంలోనే మరిన్ని నిధులు మింగొచ్చన్న కొత్త విధానం మనోహర్‌ కనుక్కున్నారని అంటున్నారు. అందుకు తన సోదరుడినే ఏకంగా నిమ్స్‌ నిర్మాణాల పర్యవేక్షణలో నియమించుకున్నారని ఉద్యోగులు చెప్పుకునే మాట. అల్పుడిని అందలమెక్కిస్తే అంతా దోచేశాడు..లూటీ చేసి, మెక్కేశాడని ఉద్యోగులు కథలు కధలుగా చెప్పుకుంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకమైన నిమ్స్‌పై ప్రజల్లో వున్న నమ్మకాన్ని తుంచేశాడని అంటున్నారు. గతంలో సామాన్యులతోపాటు, విఐపిలకు కూడా నిమ్స్‌లోనే చికిత్సలు జరిగేవి. ఎంత పెద్ద మేజర్‌ ఆపరేషన్లైనా నిమ్స్‌లోనే చేసేవారు. దేశంలోని అనేక రాష్ట్రాలనుంచి కూడా నిమ్స్‌కు వచ్చి వైద్యం చేయించుకుంటారు. అంత నమ్మకమైన ఇన్సిట్యూట్‌ అది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసిఆర్‌ కూడా నిమ్స్‌లోనే దీక్ష చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వైద్య పర్యవేక్షణ నిమ్స్‌లోనే జరిగింది. అంతే కాదు గతంలో మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా సరే వారికి ఏదైనా అత్యవసర చికిత్సలన్నీ నిమ్స్‌లోనే జరిగేవి. కాని డైరెక్టర్‌ మనోహర్‌ అయ్యాక, పరిస్దితి మారిపోయింది. అనేక వివాదాలకు నిమ్స్‌ వేధికైంది. ప్రజలు నిమ్స్‌ వైపు చూడకుండా కార్పోరేట్‌ ప్రైవేటు ఆసుపత్రుల వైపు చూసేలా నిమ్స్‌ ప్రతిష్ట దెబ్బతీశాడు. అదే సమయంలో తాను కూడా ప్రైవేటులో చేరి, నిమ్స్‌కు వున్న ఆ మాత్రం క్రెడిబిలిటీని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. అందువల్ల అలాంటి డైరెక్టర్‌ పదవిలో కొనసాగడం ప్రజలు కూడా హర్షించడం లేదు. గత నాలుగేళ్లుగా నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ మీద అక్షర యుద్దం ప్రకటించిన నేటిధాత్రి ఎట్టకేలకు అక్షర విజయం సాధించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆది నుంచి నిమ్స్‌లో జరిగే అవకతకలన్నీ బైట పెట్టింది నేటిధాత్రి మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే నిమ్స్‌లోని ప్రతి ఉద్యోగి కూడా నిమ్స్‌కు సంబంధించిన వార్తలు ఏవైనా నేటిధాత్రిలో వచ్చాయా? అని పత్రికను చూస్తాయంటే అతిశయోక్తి కాదు. నమ్మినందుకు నిమ్స్‌ ప్రతిష్టను గంగపాలు చేసిన మనోహర్‌ చేసిన అక్రమాలపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో నిమ్స్‌లో అక్రమాలకు పాల్పడకుండా, నిమ్స్‌ సొమ్ము తినాలన్నా జంకేలా ప్రభుత్వ చర్యలు వుండాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *