చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ!సీమాంధ్ర మీడియా మరబొమ్మ!!

`తెలంగాణ విగ్రహం తీర్చిదిద్దడం బొమ్మలాటనా?

`కాంగ్రెస్‌ను రెంటికీ చెడగొడుతున్న రేవంత్‌!

`సున్నితమైన అంశాలను కదిలించడమంటే..కాంగ్రెస్‌ ఖతంపట్టించే పనే!

`తెలంగాణ అస్తిత్వం మీద దాడి మొదటికే మోసం!

`తెలంగాణ తల్లి విగ్రహ వివాదం తెరమీదకు…

`టిఎస్‌ మార్పు టిజి చేర్పు కుదరని అంశం.

` టిఎస్‌ మార్పు రాష్ట్ర పరిధిలోని కాదు.

`టిఎస్‌ నామకరణం చేసిందే కాంగ్రెస్‌…

`తెలంగాణ తల్లి విగ్రహం టిఆర్‌ఎస్‌ పార్టీ సృష్టి మాత్రమే కాదు.

`తెలంగాణ సమాజమంతా అంగీకరించిన స్వరూపం.

`తెలంగాణ ఉద్యమకారులందరి ఐక్యతకు నిదర్శనం.

`ఇప్పటిదాకా కాంగ్రెస్‌ పార్టీ నేతల మొక్కులన్నీ మొక్కుబడేనా!

`అస్తిత్వాన్ని సాంస్కృతిక పరంగా చిన్నభిన్నం చేసే పన్నాగమేనా!

`ప్రజల్లో వున్న ఆ మాత్రం నమ్మకం పోగొట్టుకోవడమే…

`విశ్వాసం వీసమంత లేకుండా చేసుకోవడమే!

`సీమాంధ్రుల కనుసన్నల్లో రేవంత్‌!

`తెలంగాణ వ్యతిరేక మీడియా నీడలో రేవంత్‌ రాజకీయం!

`ఎల్లో మీడియా చెప్పింది విని చంద్రబాబు బాగుపడలేదు….

`ఎల్లో మీడియాను నమ్ముకొని రేవంత్‌ గెలిచేది లేదు!

`తెలంగాణ సంస్కృతి మీద దాడిని ఎవరూ హర్షించరు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ను ఎవ్వరూ ఓడిరచాల్సిన అవసరం లేదు అని కొన్ని దశాబ్ధాలుగా చెప్పుకుంటున్న సామెత..కాదు నిజం..! ఎవరో వచ్చి, ఏదో పార్టీ వచ్చి కాంగ్రెస్‌ను ఎండగట్టాల్సిన అవసరం లేదు. ఓడిరచాల్సిన అవసరం అంతకాన్నా లేదు. కాంగ్రెస్‌ నేతల చేతలు, చేష్టలే ఆ పార్టీ చాలు… ఆ పార్టీ శంకరగిరి మాణ్యాలు పట్టడానికి… ఇప్పుడు ఆ పార్టీ నేతల వేషాలే పాతాళం దాకా తీసుకెళ్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్‌ పెద్దలు అంతే…రాష్ట్రంలో నేతలంతే…! తెలంగాణ ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేదు. తెలంగాణ ఇస్తామన్న మాటను దాట వేసి, దాట వేసి, ఇక తప్పదు అని నిర్ణయానికి వచ్చాగ కాని, తెలంగాణ ప్రకటన రాలేదు. అప్పటికే కాంగ్రెస్‌ మీద ప్రజలకు పీకలదాకా కోపం పెరిగిపోయింది. 2004 ఎన్నికల సమయంలోనే తెలంగాణ ఇస్తామని చెప్పింది. అవసరమైతే సెకెండ్‌ ఎస్సార్సీ వేస్తామని చెప్పింది. 2001లోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తెలంగాణ లేఖ రాజకీయం మొదలైంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ బతకి బట్ట కట్టాలంటే, అధికారంలోకి రావాలంటే, టిఆర్‌ఎస్‌తో పొత్తు తప్పని పరిస్ధితైంది. కాని ఎన్నికల్లో గెలచిన ఏడాదికి మాట దాటేసింది. కొంత కాలం సన్నాయి నొక్కులు నొక్కుతూ కాలం గడిపింది. కాని 2005 వచ్చే సరికి కాంగ్రెస్‌ మాట తీరు మారింది. తెలంగాణ ఇవ్వడం అన్నది కుదరదన్నంత దాకా వెళ్లింది. తెలంగాణ ప్రజలు ఆ మోసాన్ని తట్టుకోలేకపోయారు. తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవానికి చెందింది. న్యాయం తెలంగాణ వైపు వుంది. అందుకే 2009 డిసెంబర్‌లో కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాల్సివచ్చింది. 2014లో తెలంగాణ ఇవ్వాల్సివచ్చింది. ఇంతవరకు బాగానే వుంది. కాని 2014లో తెలంగాణ మేమే ఇచ్చామని కాంగ్రెస్‌ ఎంత చెప్పుకున్నా తెలంగాణ ప్రజలు నమ్మలేదు. వారిని విశ్వసించలేదు. ఒక వేళ కాంగ్రెస్‌కు ఓటేసి, గెల్పించినా సీమాంధ్ర నాయత్వ పెత్తనం తెలంగాణలో ఆగదని తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ వచ్చినా, తెలంగాణ ముఖ్యమంత్రి పాలించినా, సీమాంధ్ర నేతల కనుసన్నల్లో పాలన సాగిస్తారని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించలేదు. ఇప్పటికీ తాము ఎందుకు ఓడిపోయామన్న సోయి కాంగ్రెస్‌ నేతలకు లేదు. ఇంత కాలమైనా ఇంకా సీమాంధ్ర నాయకుల కనుసన్నల్లోనే కాలం గడుపుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైపు ప్రజలు కొంత నిలుస్తారన్న అంచనాలు కనిపించాయి. సరే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇస్తే బాగుటుందేమో! అన్న మార్పు ప్రజల్లో కనిపించినట్లే అనిపించింది. కాని కాంగ్రెస్‌ పార్టీకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌ నిండా మునిగింది. సీమాంధ్ర నేతల నీడ లేకుండా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు రాజకీయం చేతకాదని ప్రజలు నిర్ణయానికి వచ్చారు. 2014 ఎన్నికలకు మించి సీట్టిచ్చి గెలిపించారు. 2018లో మరోసారి టిఆర్‌ఎస్‌కు తిరుగులేని పట్టం కట్టారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి ఎదురులేదని నిరూపించారు.

కాంగ్రెస్‌ నేతల్లో మార్పు రాదని, వారిని నమ్మినా ఎప్పటికైనా మళ్లీ తెలంగాణను తాకట్టు పెడతారని అర్ధమైంది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పార్టీగా వేళ్లూనుకుపోయిన తెలుగుదేశం పార్టీనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ కూకటివేళ్లతో పెకిలించినంత పనిచేశాడు. తెలంగాణలో ఆనావాలు లేకుండా చేశారు. ఆఖరుకు తెలుగుదేశం అన్న పదం వినపడకుండా చేశాడు. ఆ పార్టీని నిర్వీర్యం చేశాడు. అలాంటి కేసిఆర్‌ ముందు రాజకీయాలు చేయాలంటే అంత ఆశామాషీ కాదు. అయినా కాంగ్రెస్‌ నేతల కుప్పిగంతులు ఆగడం లేదు. అందులోనూ రేవంత్‌ రెడ్డి వింత చేష్టలకు అంతు లేదు. సీమాంధ్ర నాయకుల పెత్తనానికి దూరంగా రాజకీయం చేయడం కాంగ్రెస్‌ నేతలకు ధైర్యం లేదు. అందులో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాజకీయం చంద్రబాబు తెలియకుండా జరగదు. చంద్రబాబు చెప్పింది చేయకుండా రేవంత్‌ వుండడు…ఇదే ఇప్పుడు మళ్లీ టిఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశం కాకమానదు. ఒక్కసారి ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమ పాలన గురించి పక్కన పెడదాం… ఎందుకంటే ప్రజల గుండెల్లో గూడుకట్టుకొని పోయిన కేసిఆర్‌ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చే రాజకీయం రేవంత్‌ వల్ల సాధ్యం కాదు. రేవంత్‌ ఒంటెద్దు పోకడలు, చంద్రబాబు ఆదేశాలు.. ఎల్లో మీడియా సూచనలు కలిసి మరోసారి కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయంగానే కనిపిస్తోంది. కనీసం గతంలో వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్‌కు రావన్నది తేలిపోతోంది. రేవంత్‌ తీసుకుంటున్న తిక్క తిక్క నిర్ణయాలు కాంగ్రెస్‌ను ప్రజల ముందు దోషిగా నిలబడే ప్రమాదాన్ని కొనితెస్తోందని చెప్పడంలో సందేహ ంలేదు. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం స్ధానంలో కాంగ్రెస్‌ రూపకల్పన చేసిన విగ్రహం అన్నది తెలంగాణ అస్ధిత్వాన్ని దెబ్బతీసేదిగా వుంది. ఏ కొడుకైనా తన తల్లి దేవతలా వుండాలని కోరుకోవాలి. తన తల్లిని గొప్పగా ఊహించుకోవాలి. తన తల్లి దైవస్వూరూపంగానే పూజించుకోవాలి. అంతే కాని తన తల్లిని దిక్కులేనిదాన్ని చేసినట్లు, కట్టూబొట్టులో కూడా వెలితి చూపించడం ఏ కొడుకు చేయాల్సిన పని కాదు. ఇప్పుడు రేవంత్‌ చేసిన పని అదే…! ఏ కొడుకు చేయకూడదని పని రేవంత్‌ చేశాడు. కాంగ్రెస్‌ ప్రోత్సహిచింది. ఇదంతా రేవంత్‌ ఆలోచన కన్నా, చంద్రబాబు కుట్రగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. మనం కొలిచే తల్లితోపాటు, ఏ దైవమైనా సరే చేయేత్తి మొక్కేలా వుండాలి. అమ్మను చూస్తే కడుపు నిండేలా వుండాలి. మనసు ప్రశాంతమైపోవాలి. అమ్మ చెంత కాసేపు సేద దీరేలావుండాలి. అమ్మను కొలుస్తూ నిండుగా అలంకరణ జరపాలి. అంతే గాని అమ్మను అనాధగా రూపకల్పన చేసి, ఎన్ని హంగులు తొడిగినా, ఎన్ని పూల మాలలు వేసిన ఆ దైవత్వం సిద్ధించదు. తెలంగాణ తల్లి స్ధానంలో మరో తల్లి రూపకల్పన అన్నది తెలంగాణ సమాజం హర్షించదు.తెలుగు తల్లి విషయానికే వద్దాం..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు తల్లి విగ్రహ నిర్మాణం ఎప్పుడు జరిగిందనేదానిపై వివాదాలే లేదు. ఎవరికీ పెద్దగా శషబిషలు లేవు. అభ్యతంరాలు అంతకాన్న లేవు. ఇన్నేళ్లు గడిచిన తెలుగుతల్లి విగ్రహంలో ఎలాంటి మార్పులు చేర్చబడలేదు. తెలుగుతల్లి విగ్రహం కాంగ్రెస్‌ హయాంలో రూపకల్పన జరిగింది.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ తల్లి విగ్రహంలో మార్పులు జరగలేదు. కొత్త తెలుగుతల్లి విగ్రహం తయారు కాలేదు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులంతా కలిసి, రూపకల్పన చేసి, కొలిచి మొక్కిన తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేయడం అనే ఆలోచనే దుర్మార్గమైంది. ఎంతో మంది మేధావుల ఆలోచన స్వరూపమే తెలంగాణ తల్లి విగ్రహం. ఇలాంటి సున్నితమైన అంశాలలో రేవంత్‌ రాజకీయం ప్రజలు సహించరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అస్ధిత్వం మీదే దాడిగా ప్రజలు బావించాల్సివస్తుంది. నిజానికి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అన్నది టిఆర్‌ఎస్‌ సృష్టికాదు. టిఆర్‌ఎస్‌ కూడా రూపకల్పన హక్కులు మావే అని చెప్పలేదు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ వాదుల మదిలో పురుడు పోసుకొని, ఎన్నో చర్చోప చర్చలు సాగాఆయి. తెలంగాణ ఉద్యమ కారుడు, రచయిత, బిఎస్‌ రాములు కొన్ని నమూనాలు రూపొందించారు .దానిని కంపూటర్‌పై బివిఆర్‌ చారి రూపమిచ్చారు. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా వుండాలన్నదానిపై కొంత కాలం పాటు సుధీర్ఘమైన చర్చలు సాగాయి. అందులో తెలంగాణ అమర వీరుల స్ధూప నిర్మాణ కర్త ఎక్కా యాదగిరి, ప్రముఖ రచయిత దుర్గం రవీందర్‌, ప్రముఖ చిత్ర కారుడు కాపు రాజయ్య, కార్టునిస్ట్‌ ఏలె లక్ష్మణ్‌, ఇలా అనేక మంది ఉద్యమ కారుల ఆలోచన రూపమే తెలంగాణ తల్లి విగ్రహ రూపం. ఆఖరుకు అందరి సూచనలు సలహాలతో కూడిన పరిపూర్ణమైన రూపం తెచ్చింది ప్రొఫెసర్‌ గంగాధర్‌. ఇంత మంది కలిసి సృష్టించిన అధ్భుతమైన కళ. తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి రూపకల్పనలో ముందు పేద రూపంలో వున్న తల్లి విగ్రహం ఎలా వుంటుందన్న ఆలోచన కూడా చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని రేవంత్‌రెడ్డికి ఈ విషయం తెలియదు. ఆయన అందులో పాల్గొన్నది లేదు. అందుకే కొత్తగా ఏదో తాను కనిపెట్టినట్లు, తెలంగాణ తల్లి రూపం మార్చి మరో కొత్త ప్రపంచం సృష్టించినట్లు ప్రచారం చేసుకోవడం అన్నది ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని తెలంగాణ వాదులు అంటున్నారు. ఇక టిఎస్‌ అన్న పదం మార్చుతారట.. ఇదెలా వుందంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ముందు జగన్‌మోహన్‌ రెడ్డి ఉద్యోగులకు ఓ హమీ ఇచ్చారు. పాత పెన్షన్‌ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని ప్రకటించారు. ఎన్నికలకు వెళ్లారు. ఇదేదో బాగుందనుకున్న ఉద్యోగులు వైసిపికి పూర్తి మద్దతిచ్చారు. గెలిపించారు. తీరా ఇప్పుడు పాత విధానం అమలు చేయడం సాధ్యం కాదని చావు కబురు చల్లగా జగన్‌ ప్రభుత్వం చెప్పింది. పాత పెన్షన్‌ పద్దతి సాధ్యం కాదని ఉద్యోగులకు కూడా తెలుసు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తెలుసు. అయినా ఉద్యోగులు జగన్‌ చెప్పింది నమ్మారు. ఇప్పుడు సాధ్యం కాదంటే నెత్తి, నోరు కొట్టుకుంటున్నారు. తెలంగాణలో టిఎస్‌ మార్పు అన్నది కూడా అంతే…ఉద్యమ కాలంలో అందరూ టిజి అనే సంబోధించారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులో మాత్రం టిఎస్‌ అంటూ రూపకల్పన చేసింది. అదేదో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన, అమలు అన్నట్లుగా రేవంత్‌ తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కనీసం రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపిఏ ప్రభుత్వం తయారు చేసిన చట్టంలో ఏమని వుందో రేవంత్‌కు తెలుసా? జయరాం రమేశ్‌ నేతృత్వంలో తయారు చేసిన విభజన చట్టంలో టిఎస్‌ను పొందు పర్చారు. ఆ సంగతి కూడా తెలియకుండా టిజి చేర్చుతామని ప్రగల్భాలు పలికి ప్రజల్ని నమ్మిస్తామని చూస్తే వెర్రివెంగలప్పలయ్యేది కాంగ్రెస్‌ నేతలే…పరువు పోగొట్టునేది ఆ పార్టీనే…తలా తోక లేని ఆలోచనలు , తలతిక్క నిర్ణయాలు తీసుకుంటే నిండా మునిగేది కాంగ్రెస్‌ నాయకులే….ఇక తేల్చుకోండి…! నిజం తెలుసుకోండి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *