Congress Leaders Strongly Condemn Remarks on Uttam Kumar Reddy

కోదాడ: రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పిల్లుట్ల రఘు చేసిన వ్యాఖ్యలను కోదాడ మండల కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
గుడిబండ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇర్ల సీతారామిరెడ్డి, ముదిరాజు సంఘం రాష్ట్ర నాయకులు భాస్కర్ బోయిన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, వారి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారని, హుజూర్నగర్ మరియు కోదాడ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు.
2160 ఇళ్ల నిర్మాణం, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. అభివృద్ధిని చూడలేని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించిన నాయకులు, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
