*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా

ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి

 

 కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.

 

టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్‌ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఆడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కమలాపూర్ మండలం మాదన్న పేటకు చెందిన ఓ యువకునితో మాట్లాడిన సంభాషణలో యూత్‌ను తనకు అనుకూలంగా మొబులైజ్ చేసి, అవసరమైతే ఓక్కోక్కరికి రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకు ఇవ్వాలని కూడా కౌశిక్ రెడ్డి రాజేందర్ అనే వ్యక్తికి సూచించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నానని కౌశిక్ రేడ్డి చెబుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్‌లో ఉండాలని కూడా కౌశిక్ రెడ్డి సూచించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో గురించే టీఆర్ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *