రామయంపేట (మెదక్) నేటి ధాత్రి.
రామాయంపేట కు చెందిన రామప్పగారి రాజు వయసు 31 సంవత్సరాలు అనే యువకుడు మెదక్ మండలం అప్పాజీపల్లి గ్రామ చెరువు పడి మృతి చెందాడు. మృతునికి ఒక్క కూతురు, కుమారుడు ఉన్నారు. విషయాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డా “మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించి తక్షణ సహాయం 5000 రూపాయిలు మరియు ఇద్దరి పిల్లల పేర్ల మీద 25000 రూపాయాల పిక్స్ డిపాజిట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో MSSO మండల బాధ్యులు వెంకుగారి శ్రీదర్ రెడ్డి గారు,MSSO రామాయంపేట మండల అధ్యక్షులు శ్రీకాంత్ సాగర్ గారు, శంకరంపేట ex MPP బోయిని ప్రభకర్,సుంకోజు దామోదర చారి, మార్కు దత్తు, మార్కు బుమయ్య, దుర్గమెస్ సత్యం, దోమకొండ సిద్దరములు తదితరులు ఉన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.
