గుజరాత్‌ మోడల్‌ గుల్ల! అభివృద్ధి నమూనా డొల్ల!!

` పైన పటారం లోన లొటారం?

`ప్రధాని మోడీత సహా ప్రయాసలు 

`గుజరాత్‌ ప్రచారంలో పార్టీ పెద్దల అవస్థలు…

`పార్టీ శ్రేణుల ఆపసోపాలు

`ఆప్‌ తో ఎదురౌతున్న సవాళ్లు.

`ఆప్‌ తరుముతోంది.

`బిజేపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

` కాంగ్రెస్‌ కూడా కాలు దువ్వుతోంది.

`నువ్వా, నేనా అంటోంది.

` రాహుల్‌ జోడో యాత్ర ప్రభావం కూడా కనిపించనుంది.

` ఇరవై ఏడేళ్లైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.

`అభివృద్ధి కనిపిస్తున్నది ఇద్దరు వ్యాపారులలోనే…

`ఎనుకట ఎప్పుడో ఇచ్చిన మంచి నీళ్లే ఇప్పటికీ ప్రచారాస్త్రం.

`అభివృద్ధి నమూనా అంటే తెలంగాణది

`ప్రగతి అంటే తెలంగాణ ది.

` సంక్షేమ పాలన తెలంగాణ లో…

`ఎనమిదేళ్లులో ఎంతో సాధించింది.

`పవర్‌, పాజెక్టు, పరిశ్రమలు, పారే కాలువలు, 

పండుతున్న పంటలు తెలంగాణ దిక్సూచి నిదర్శనాలు.

` రైతు కళ్లలో ఆనందాలు. 

` కేసిఆర్‌ పాలనలో అన్ని వర్గాలలో ఆనందాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

 లేని గొప్పలు చెప్పుకోవడానికే పనికొస్తాయి. చూపించడానికి పనికిరావు. కేంద్రలో ఎనమిదేళ్లుగా బిజేపి అధికారంలో వుంది. అనేక రాష్ట్రాలలోనూ పాలన సాగిస్తోంది. కాని ఈ ఎనమిదేళ్ల కాలంలో ఏరాష్ట్రంలో ఏం సాధించిందనేది చెప్పుకోవడానికి లేదు. కనీసం కేంద్రంలో అధికారంలోకి వచ్చి చేసిందేమీ లేదు. చెప్పుకోవడాని లేక, ఇప్పటికీ, ఎప్పటికీ గుజరాత్‌ తప్ప మరొకటి చెప్పుకోలేరు. అందుకు ఏ స్కోప్‌ లేదు. గొప్పగా ప్రగతి సాధించినట్లు గుజరాత్‌ పాలిస్తున్న ఏ రాష్ట్రంలో అభివృద్ది జాడలులేవు. అసలు లెక్కలు లేవు. కనిపించే ప్రగతి ఆనవాలు కూడా ఎక్కడా లేదు. అందుకే ఈసారి గుజరాత్‌ లో జరుగుతన్న ఎన్నికల్లో బిజేపి ఆపసోపాలు పడుతోంది. గుజరాత్‌లో కూడా కళ్లకు కనికట్టు చేసి చూపించినంత గొప్ప దనమేమీ లేదు. అభివృద్ధి అక్కడ కళ్లముందు ఆవిష్కరించిందేమీ కనిపించదు. కాకపోతే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో గుజరాత్‌ తప్ప మరో జపం చేయలేని పరిస్దితి. ఆ రాష్ట్రం గురించి చెప్పుకోకపోతే నమో అన్న పదానికి అర్ధం లేకుండాపోతుంది. అందుకే మాటకు ముందు, మాటకు వెనకాల గుజరాత్‌ అంటే సరిపోతుందని ఆ పార్టీ నాయకులు అలవాటు చేసుకున్నారు. 

ఈసారి గుజరాత్‌ ఎన్నికలు బిజేపికి పెద్ద టాస్క్‌. ప్రధాని మోడీ సొంత రాష్ట్రంలో బిజేపి ఓడిపోతే అది ఈయనకే తలవంపులు తెస్తుంది.

 అంతే కాదు అక్కడ బిజేపి ఓడిపోతే ఇక దేశంలో ఒక్కొరాష్ట్రం కోల్పోయేందుకు సిద్ధమౌతున్నట్లే లెక్క. గుజరాత్‌ ఎన్నికలు దేశ రాజకీయాల మీద ఎంతో ప్రభావం చూపే అవకాశాలున్నాయి. త్వరలో రానున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలతోపాటు, పార్లమెంటు ఎన్నికలు కూడా బిజేపికి పెద్ద సవాలుగా మారే అవకాశం వుంది. అందుకే దేశంలోని బిజేపి నేతలంతా గుజరాత్‌లోనే వున్నారు. అక్కడ ఇళ్లిళ్లు తిరిగి ప్రచారం సాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు, హోం శాఖ మంత్రి అమిత్‌ షా కూడా పరడాని పాట్లు పడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అయినా ప్రజలు ఈసారి బిజేపి వైపు నిలుస్తారన్న నమ్మకం లేకుండాపోతోంది. ఎంత సేపు కొన్ని దశాబ్ధాల క్రితం గుజరాత్‌కు తెచ్చిన మంచినీటి పధకం తప్ప, చెప్పుకోవడానికి బిజేపికి మరో ప్రగతి లేకుండాపోయింది. ఇక ఈ మధ్య ఎన్నిరకాల కంపనీలు గుజరాత్‌కు తరలించినట్లు వార్తలు వచ్చినా, వాటి పనులు మొదలు కాలేదు. వాటి ఫలాలు గుజరాత్‌కు అందలేదు. అక్కడి యువతకు ఉపాధి రాలేదు. ఒక వేళ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజేపి ఓడిపోతే ఇప్పుడు గుజరాత్‌కు చేర్చుకున్న కంపనీలను మళ్లీ అక్కడి నుంచి తరలించడం కూడా జరగొచ్చు. శంకుస్ధాపన రాయిని చూసి ప్రజలు ఓట్లేస్తారని నమ్మలేం. బిజేపికి ఇదే గుబులు పట్టుకున్నది. ఎలాగైనా ఈసారి గుజరాత్‌ ఎన్నికల్లో బిజేపి గెలవాలి. దాంతో పార్టీ పెద్దలతోపాటు, అందరూ అక్కడే వుండి ప్రచారం సాగిస్తున్నారు. 

 ఆప్‌తో గుజరాత్‌లో బిజేపి అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. 

ఒక రకంగా చెప్పాలంటే ఆప్‌ బిజేపిని తరుముతోంది. ఊపిరాడకుండా చేస్తోంది. గుజరాత్‌లో ఇప్పటి వరకు జరిగిందంతా డొల్ల అన్నది ఆప్‌ బాగానే ప్రచారం సాగిస్తోంది. పైగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటించింది. ప్రజలకు చేరువౌతోంది. సంక్షేమ పథకాలను ఉచితాలన్నట్లు గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఆప్‌ బాగా వాడుకుంటోంది. పేదలకిచ్చే వస్తువులను కూడా ఉచితాలుగా చూడడం అన్నది సహించలేనిదన్నట్లు ఆప్‌ బాగానే ఫోకస్‌ చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే అందించే సంక్షేమ పధకాలను ప్రకటిస్తూ దూసుకుపోతోంది. ఉచితాలు వద్దన్న బిజేపి మాత్రం గతంలో చెసిన పనులను మాత్రమే చెప్పుకునే అవకాశం ఏర్పడిరది. కొత్తగా చెప్పుకోవడానికి ఏదీ లేకుండాపోయింది. ఇదిలా వుంటే గుజరాత్‌లో కాంగ్రెస్‌కూడా బాగానే పుంజుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల రాహుల్‌ గాంధీ జోడో యాత్ర కూడా బాగానే సాగుతోంది. ప్రజలు కూడా జోడో యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. సభలకు కూడా పెద్ద సంఖ్యలో హజరౌతున్నారు. అక్కడి పిసిసి అధ్యక్షుడిపై కూడా ప్రజలకు బాగానే గురి వున్నట్లు వుంది. దాంతో బిజేపికి అటు ఆప్‌, ఇటు కాంగ్రెస్‌తో దబిడిదిబిడే అవుతుందన్న మాటలే వినిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతుండడంతో బిజేపి వెన్నులో వణుకు మొదలైందని అంటున్నారు. దేశమంతా ఇప్పుడు గుజరాత్‌ గురించి చెప్పుకుంటూ అంబానీ, ఆదానిల గురించి తప్ప మరో మాట ఎక్కడా వినిపించడంలేదు. అంటే ఆ ఇద్దరు తప్ప గుజరాత్‌లోనే కాదు, దేశంలోనే బాగుపడ్డట్టు చరిత్ర లేదంటున్నారు. అందుకే బిజేపికి ఈసారి ఎన్నికల్లో చేదు అనుభవం మిగులుతుందని తెలుస్తోంది. 

 వినడానికైనా చెప్పుకోవడానికైనా అభివృద్ధి నమూనా అంటే తెలంగాణలా వుండాలి.

 కేంద్రంలో బిజేపి అధికారంలోకి వచ్చినప్పుడే తెలంగాణలో టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మూడేళ్లలో నిర్మాణం జరిగింది. ఒకప్పుడు తెలంగాణలో 17లక్షల ఎకరాల్లో సాగు సాగేది. ఇప్పుడు కోటి ఎకరాలకు చేరింది. ఒకనాడు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీళ్లు..ఎక్కడా చూసినా పచ్చని పైర్లే…పాడిపంటలతో కూడుకున్న సిరులే…తెలంగాణలో ప్రజెక్టుల నిర్మాణం అన్నది ఊహించుకోవద్దన్నంతగా ఉమ్మడి పాలకులు మోసం చేశారు. కాని కేసిఆర్‌కు తెలుసు. తెలంగాణ వస్తే ఎన్ని అధ్భుతాలు జరగుతాయో! అందుకే పద్నాలుగేళ్ల పాటు కొట్లాడి తెలంగాణ సాధించి, తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆయన సాగిస్తున్న అభివృద్ధి యజ్ఞం..దాని ఫలాలు దేశమంతా చూస్తోంది. అబ్బురపడిపోతోంది. తెలంగాణ మురుస్తోంది. సిరుల మాగాణ తెలంగాణ పులకించిపోతోంది. ఇది కదా! అభివృద్ది అంటే..ఇది కథా! మోడల్‌ అంటే…! తెలంగాణలో అటు ప్రాజెక్టులు, ఇటు పరిశ్రమలు, పండుతున్న పంటలు, పారే కాలువలు, నిర్మాణమైన ప్రాజెక్టులు, అనేక రిజర్వాయర్లు, మళ్లీ పునరుజ్జీవం పొందిన చెరువులు, పంటలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం వున్నాయి తెలంగాణలో…కళ్ల ముందు కనిపిస్తున్నాయి తెలంగాణలో…ఇదీ అభివృద్ది నమూనా…కనీసం గుజరాత్‌లో ఇందులో పదో వంతు కనిపిస్తుందా? ఈ ఎనమిదేళ్లలో ఏమైనా జరిగిందా? అన్నది బిజేపి నేతలు చెప్పాలి. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నారు. రైతులు ఆనంద పడుతున్నారు. తెలంగాణ మోడల్‌ను దేశమంతా అమలు చేయాలని కేసిఆర్‌ అనుకుంటున్నాడు. ఆయనకు అవకాశం వస్తే సాధ్యం చేసి చూపిస్తాడు..దేశమంతా సస్యశ్యామలం చేస్తాడు…దేశాన్ని ప్రపంచంలో అగ్రశ్రేణిలో నిలబెడతాడని చెప్పడంలో సందేహం లేదు. ఒకప్పుడు నమో అన్నది ఎంతగా ప్రమోట్‌ అయ్యిందో ఇప్పుడు బిఆర్‌ఎస్‌, కేసిఆర్‌ అన్నది కూడా అంతగా జనంలోకి వెళ్తే తెలంగాణ మోడల్‌కు తిరుగులేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వానికి ఎదరుండదు.

Leave a Reply

Your email address will not be published.