అనితర సాధ్యుడు హరీష్ రావు

రుస్తుం ప్రఖ్యాత చిత్రకారులు

సిద్దిపేట నేటి ధాత్రి

తెలంగాణ అస్తిత్వం టి హరీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రి పుట్టినరోజు 3 జూన్ ను పురస్కరించుకుని శుక్రవారం స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీ సిద్దిపేటలో కార్యశీలి హరీశ్ రావు చిత్రాన్ని ప్రఖ్యాత చిత్రకారులు రుస్తుం చిత్రించి ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పచెప్పిన పనులను తుచ తప్పకుండా కార్యాన్ని నెరవేర్చే కార్యశీలి, ట్రబుల్ షూటర్, అనితర సాధ్యుడు, తన్నీరు హరీశ్ రావు ఆర్థిక, ఆరోగ్య శాఖామాత్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ లొనే సిద్దిపేటను అభివృద్ధి లో అన్నింటా ముందు నిలిపి ముందంజలో తెలంగాణకు రోల్ మెడల్ గా నిలిపారు. అందరి ప్రేమాభిమానాలు పొంది ప్రతిపక్షనేతల హృదయాలల్లోకూడా ఆదరాభిమానాలు పొంది తిరుగులేని జననేతగా ప్రతి హృదయంలో సుస్థిరస్థానం పొందారు. ఏకష్టమొచ్చిన నేనున్నాను అనే భరోసాను ఇచ్చే మంత్రివర్యులు హరిశ్ రావ్ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండి మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని, పార్టీల కతీతంగా తనచుట్టు ఉన్నవారికి, లేనివారికికూడ ప్రత్యేకశ్రద్దతో అర్హులందరికీ వైద్య సేవలు, ప్రజాసంక్షేమ పతకాలు అందిస్తారని అందించాలని కోరుకుంటూ, మానవతా చిత్రకారులు రుస్తుం ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, నేచర్ ఆర్టిస్ట్ రూబీనారుస్తుం తదితరులు, మొహ్మద్ రాహీమ్, ముస్తఫా తదితరులు టి హరీశ్ రావు, మంత్రివర్యులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *