Who Will Win the Sarpanch Seat in Chityala?
ఈ ఇద్దరిలో ఎవరిని వరించునో సర్పంచ్ పీఠం?
ఆదరించి గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా. బి ఆర్ఎస్ అభ్యర్థి తౌటం లక్ష్మి.
అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే అభివృద్ధి చేసి చూపిస్తా. కాంగ్రెస్ అభ్యర్థి కట్కూరి పద్మ.
చిట్యాల నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్ర గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి బిసి మహిళకు రిజర్వు కావడంతో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు పోటీపడుతూ హోరాహోరీగా ప్రచారం చేపడుతున్నారు, ఒకరిపై ఒకరుఆరోపణ ప్రతి ఆరోపణలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు, ఆ మహిళా మణుల వెనక ఉన్న యువ నాయకుల వ్యక్తిగత,రాజకీయ నేపథ్యం,,వారి విజయానికి మొదటి ప్రాధాన్యత నిస్తుందని గ్రామ ప్రజలు చర్చించుకున్నట్లు సమాచారం,అధికార ప్రతిపక్ష పార్టీలసర్పంచ్ అభ్యర్థుల ప్రచారం రోజురోజుకు కొత్తదనంతో కోన సాగుతుంది, గ్రామాభివృద్ధి కోసం హామీల వర్షం కురిపిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకోవడంలో ఒకరిని మించి ఒకరు వినూత్న ప్రచారం కొనసాగుతుంది, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అండదండలతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మా నరేందర్ ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్నారు, అలాగే అధికారంలో లేకున్నా ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని రామాలయం కట్టించి గ్రామాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తౌఠం లక్ష్మి అంతయ్య ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు, గతంలో చిట్యాల ఎంపీటీసీగా గెలిపించి ఆదరించినారని మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే అధికార పార్టీ అండదండలతో గ్రామంలోని సమస్యలు తీర్చుతానని యువతకు అండగా ఉంటానని కాంగ్రెస్ అభ్యర్థి హామీ ఇస్తూ గ్రామంలోని ఇంటి ఇంటికి తిరుగుతూ మహిళలను యువకులను వృద్ధులను కలుస్తూ తమకు ఓటేయాలని గెలిపించాలని కోరుతున్నారు, అలాగే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ అధికారుల అండదండలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గ్రామంలో ఎల్ఈడి లైట్లు, సైడ్ డ్రైనేజీలు, వైకుంఠధామానికి సిసి రోడ్ నిర్మాణం, గెలిపించిన వెంటనే రామాలయానికి ప్రత్యేక కమిటీ వేసి నిర్మాణంలో తోడ్పాటు, యువతకు క్రీడా ప్రాంగణం , మహిళా సంఘాలకు కమ్యూనిటీ హాలు నిర్మాణానికి కృషి, విద్యా వైద్య పై ప్రత్యేక దృష్టి, నూతన గ్రంథాలయం ఏర్పాటు, నిరంతరం గ్రామాభివృద్ధిలో నిమగ్నమై ఉండడమే మా ఏకైక లక్ష్యమని అభివృద్ధి చేయడమే మా ధ్యేయమని బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తౌటం లక్ష్మీ అంతయ్య ప్రచారం లో చెబుతున్నారు, ఏది ఏమైనా ఇలా అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల హామీలతో గ్రామంలోని మేధావులు రాజకీయ విశ్లేషకులు, ఓటర్లు,ప్రజలు, పోలింగ్ సమయం దగ్గర పడడంతో ఆలోచించడం మొదలు పెడుతున్నారు,ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే గ్రామాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతారో,ఎవరైతే గ్రామాన్ని అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తారో, వారికి పట్టం కట్టాలని దృఢ నిశ్చయంతో ఓటర్లు సిద్ధమవుతున్నట్లు సమాచారం, అలాగే రెండో విడత పోలింగ్ తేదీ ఈ నెల 14న ఆదివారం రోజు కావడంతో సమయం రెండు రోజులు ఉండడంతో అభ్యర్థుల ప్రచారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మమ్మురంగా సాగుతుంది, ఈసారి గ్రామ అభివృద్ధి అనేది అభ్యర్థి ఎంపికతోనే ముడిపడి ఉందని ముందుగానే ఆలోచించి నిర్ణయించుకుని అభ్యర్థిని పెట్టుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి , ఏది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఏది ఏమైనా 48 గంటలు గడిస్తే కానీ ఓటర్ల నాడి తెలిసే పరిస్థితి లేదని రాజకీయమేధావులు అంటున్నారు, ఓటర్లు కూడా ఈసారి బాగా ఆలోచించి అభివృద్ధి చేసే వారికే సర్పంచి పదవి కట్టబెట్టాలని, మండల కేంద్రంలోని చిరకాల సమస్యలను పరిష్కరించే అభ్యర్థినే గెలిపించుకుంటామని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
