కుల గణన పై సుప్రీం కోర్టు తీర్పు స్వాగతిస్తున్నాం..
– డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
జనగణనలో కులగణన లెక్కింపుకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కుల గణన నిర్వహించి ఎవరెంతో వారికంతా అనే సామాజిక న్యాయం తో ముందుకు పోతుంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన మాదిరి దేశ వ్యాప్తంగా కుల గణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జన గణనలో కుల గణన చేస్తామని గతంలో 2025 ఏప్రిల్ 1 తేదీన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చి తరువాత వరుస సంఖ్య 13 లో బీసీల అంశం చేర్చలేదు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన రోజు మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు అమరన నిరాహార దీక్ష వరుస సంఖ్య 13 లో ఎస్సీ ఎస్టీ లతో పాటు బీసీ గణన లెక్కించాలని కోరడం జరిగింది. దేశంలో 80 కోట్ల మంది ఓబీసీల ఆత్మగౌరాన్ని కాపాడిన కోర్టుకు ధన్యవాదములు అన్నారు.
కుల గణన వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టివేయడం సామాజిక న్యాయానికి బలాన్నిచేదిగా ఉంది అన్నారు. జనగణనలో కులగణన లెక్కిస్తే సామాజిక న్యాయం జరుగుతుంది. కులగణన ద్వారా కచ్చితమైన లెక్కలున్నప్పుడే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ప్రజా పాలన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చేయడానికి చట్టం చేసి ఆ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది, కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపచేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
