*సంకల్ప హస్పెటల్ లో రక్త దానశిభిరం…
*రెడ్ క్రాస్ చే సంకల్ప సిబ్బంది రక్త దాతలు…
తిరుపతి(నేటిధాత్రి:
సంకల్ప హాస్పిటల్ లో రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు, బుధవారం స్థానిక తుడ రోడ్ లో గల సంకల్ప హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహరి రావు అతిధులుగా విచ్చేసి ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంకల్ప హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగరాజు కుమార్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అనంత్ నాగ్,సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ సోమేష్ బండ్ల అలాగే సంకల్ప హాస్పిటల్ సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు,
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని అది తెలిసిన డాక్టర్లు ఇలా ముందుకు వచ్చే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం ఒక శుభ పరిణామం ప్రాణం విలువ తెలిసిన డాక్టర్లు ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం కొంతమందికి అత్యవసర సమయాలలో ప్రాణదానంగా నిలుస్తుందని సంకల్ప హాస్పిటల్ సేవలను సిబ్బందిని హాస్పిటల్ వారిని అభినందించారు, అలాగే రక్త నిధి కై రెడ్ క్రాస్ వారకి అభినందనలు తెలుపుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరుతున్నానని తెలిపారు, ఈ సందర్భంగా రక్తదానం చేసిన సిబ్బందికి సర్టిఫికెట్లను ప్రధానం చేశారు…
