గిరిజనులు ఆర్థికంగా ఎదగాలి
ఎమ్మెల్యే మాతృమూర్తి శశికళ రెడ్డి
బాలానగర్/ నేటి ధాత్రి
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో సోమవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మాతృమూర్తి జనంపల్లి శశికళ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు ప్రతి గిరిజనుడు ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తే కుటుంబాలు కూడా సంతోషంగా, స్థిరంగా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని యువత ఉపాధి రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
