విజ్ఞానాన్ని అందించడంలో ను జర్నలిస్టుల కీలక పాత్ర,

ఐ ఐ టి కు మించిన విద్యను అందించడమే నా లక్ష్యం, శశి

సమాజంలో జర్నలిస్టుల పాత్ర పై తమ విద్యార్థులకు బోధించడం కూడా జరుగుతుంది, ఉపాధ్యాయుడు కన్నా.


పాఠశాల విద్యార్థుల కంటే ముందు విలేకరుల సమక్షంలో డైరీ ఆవిష్కరణ రిపోర్టర్ల అదృష్టం. మిన్ను బాయ్.

మహాదేవపూర్ -నేటి రాత్రి:

సమాజంలో విజ్ఞానాన్ని అందించడంలోనూ కూడా జర్నలిస్టుల పాత్ర కీలకమని గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ కరస్పాండెంట్ ఎం ఎం శశి అన్నారు. 2024 నూతన సంవత్సర పాఠశాల డైరీలను స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసి మండల పాత్రికేయుల చేతుల మీదుగా డైరీ ని ఆవిష్కరించి పాత్రికేయులకు అందించడం జరిగింది. డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి శశి మాట్లాడుతూ ఉపాధ్యాయులతో పాటు సమాజంలో జ్ఞానాన్ని లోతుగా తీసుకువెళ్లడంలో జర్నలిస్టుల అది కీలక పాత్ర అని అన్నారు, నేడు పాఠ్యపుస్తకాల నుండి మొదలుపెట్టుకొని టెక్నాలజీ స్థాయి వరకు అనేక విధాల ఉపాధ్యాయులు బోధించేవారు ఉన్నప్పటికీ ఒక జర్నలిస్టు మాత్రమే విజ్ఞానాన్ని సమాజానికి లోతుగా అర్థమయ్యే విధంగా ఇలాంటి విజ్ఞానాన్ని కూడా ఒక రూపు దాల్చి సమాజంలో అనేక రకాల పద్ధతుల్లో వాటిని రూపుదిద్ది ప్రజలకు అర్థమై దానిని ఉపయోగించే విధంగా చేయడం కేవలం ఒక జర్నలిస్టు సాధ్యమైతుందని శశి జర్నలిజాన్ని కొనియాడారు. మండలంలోని విలేకరులకు వారి నిష్పక్ష జర్నలిజానికి గౌరవమిస్తూ ఎల్లప్పుడు రిపోర్టర్లకు సహాయ సహకారం ఇవ్వడంలో పాఠశాల వెనకడుగు వేయదని సమాజాన్ని ఉద్ధరించే జర్నలిస్టుల మధ్య తమ పాఠశాల డైరీని రిపోర్టర్ల చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎం ఎం శశి హర్షం వ్యక్తం చేశారు. మూల మూల ప్రాంతంలో ఏర్పడిన గుడ్ మార్నింగ్ రామవర పాఠశాల 30 సంవత్సరాలలో చాలీచాలని ఫీజులతో ఈరోజు ఐ ఐ టి లకు మించి విద్యను అందిస్తున్న ఏకైక పాఠశాల గుడ్ మార్నింగ్ పాఠశాల అని దానికి గడిచిన 30 సంవత్సరాల్లో వైద్యులు టెక్నాలజీ రంగం ఇంజనీర్లు చాటట్ అకౌంట్ మల్టీ నేషనల్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగం సాధించిన విద్యార్థులు కేరాఫ్ గుడ్ మార్నింగ్ అని తమకు చెప్పాల్సిన అవసరం లేదని ఆ విద్యార్థులు తల్లిదండ్రులే నేడు తమకు సాక్ష్యంగా ఉన్నారని శశి అన్నారు. విద్య విషయంలో ప్రతి విద్యార్థి తమ పాఠశాల పేరును నిలబెట్టే విధంగా సాంకేతిక రంగం మింట్ లాంటి విద్యా విధానంతో విద్యార్థులకు పాఠశాల కాకుండా ప్రతి సెలవు దినం కూడా విద్యార్థులు ఉపాధ్యాయులకు అందుబాటులో ఉండి విద్యను కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా రెస్పాండెంట్ శశి పాత్రికేయులకు తమ పాఠశాల విద్యా విషయంలో అభివృద్ధి కొరకు సలహాలు సూచనలకు ఆహ్వానించడం విశేషం. అలాగే గుడ్ మార్నింగ్ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఎం ఎం కన్నయ్య మాట్లాడుతూ జర్నలిస్టుల తో కలిసి పాఠశాల డైరీ ప్రారంభించడం లాంటి మహోన్నత కార్యక్రమంలో తను భాగ్య స్వామి కావడం తనకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఎందుకంటే సాంఘిక శాస్త్రంలో అనేకచోట్ల పీడిత ప్రజలు ప్రజా వ్యవస్థ లాంటి పాఠాల్లో ప్రభుత్వాలకు మరియు ప్రజలకు మధ్య వారధిగా ఉన్న జర్నలిస్టులకు సంబంధించి అనేక సందర్భాల్లో తమ విద్యార్థులకు జర్నలిజం మరియు జర్నలిస్టుల విలువలను వారు చేసే మహోన్నతమైన పనిని పలుమార్లు విద్యార్థులకు వివరించడం జరిగిందని అలాంటి జర్నలిస్టులతో కలిసి ఈరోజు కార్యక్రమంలో పాల్గొని తన ఆనందానికి అంతు లేదని కన్నా అన్నారు. పలు సందర్భాల్లో స్థానిక జర్నలిస్టుల నిర్భయంగా పీడిత ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం చేకూర్చిన సందర్భాలు పలువురు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని కాలింగ్ అలాంటి జర్నలిస్టులతో కలిసి ఈరోజు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో తాను కూడా భాగస్వామి అవుతానని అనుకోలేదని అన్నారు. గుడ్ మార్నింగ్ పాఠశాల కేవలం విద్యార్థులకు నాణ్యత మైన సాంకేతిక పరిజ్ఞానంతో అర్హత అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో విద్యను అందించడమే ఒక లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఈ విషయం పాత్రికేయులుగా మీకు కూడా తెలుసు అని దానికి అనేక ఉదాహరణలు కూడా మీ ముందు ఉన్నాయని మా పాఠశాల ఆహ్వానాన్ని మీరు హుందాతనంగా స్వీకరించినందుకు మండల పాత్రికేయులకు మేము రుణపడి ఉంటామని కరస్పాండెంట్ శశి మరియు ఉపాధ్యాయుడు కన్నా అన్నారు.

పాఠశాల విద్యార్థుల కంటే ముందు విలేకరుల సమక్షంలో డైరీ ఆవిష్కరణ రిపోర్టర్ల అదృష్టం. మిన్ను బాయ్.

ఒక ప్రైవేట్ పాఠశాల ప్రతి సంవత్సరం మొదటి కానుకగా జర్నలిస్టుల మధ్య జర్నలిస్టుల తోనే తమ పాఠశాల డైరీ ని ఆవిష్కరించి జర్నలిస్టులకు అందించడం జర్నలిస్టుల హృదయాలను గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ గెలుచుకుంటుందని మండల సీనియర్ పాత్రికేయుడు మిన్ను భాయ్ అన్నారు. నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మిన్ను భాయ్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ వరంగల్ జిల్లాలో అలాగే పక్క రాష్ట్రం మహారాష్ట్ర లోని పలు జిల్లాల్లో విద్య అందించడంలో ఒక వజ్రంలా విరిసిపోతున్న పాఠశాల గుడ్ మార్నింగ్ గ్రామర్ హై స్కూల్ మండల జర్నలిస్టులకు వారు అందించే ప్రేమ ఆదరణ మండల పాత్రికేయులు ఎన్నటికీ మర్చిపోరని అన్నారు, ఒక ప్రైవేట్ పాఠశాల ప్రజల పక్షాన పోరాడే జర్నలిస్టులను గుర్తించి నేడు వారి పిల్లలను 50 శాతం ఫీజు రాయితీ తో గుడ్ మార్నింగ్ పాఠశాలలో విద్యాభ్యాసం చేయుటకు అవకాశం ఇవ్వడం అంతేకాకుండా 2024 25వ సంవత్సరానికి కూడా జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ లేదా అంతకంటే ఎక్కువ పాఠశాల ఆర్థిక వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు ఫీజు రాయితీ అందిస్తారని ముందే ప్రకటించడం కరస్పాండెంట్ ఎంఎం శశి జర్నలిస్టులపై అలాగే జర్నలిస్ట్ వృత్తిపై వారికి ఉన్న గౌరవాన్ని సమాజం మరియు జర్నలిస్టులు మర్చిపోలేని విధంగా వారు భరోసా కలిగించడం జరిగిందని మిన్ను భాయ్ ప్రెస్ క్లబ్ రిపోర్టర్లు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా పలు జర్నలిస్టులు ఆయా గ్రామాలకు సంబంధించిన తల్లిదండ్రులకు కలుగుతున్న ఇబ్బందులను వారి దృష్టికి తీసుకు తీసుకువస్తే మీరు జర్నలిస్టులు చెప్పిన మాటలను నేను అంగీకరిస్తున్నానని వారికి పలు సమయాల్లో ఇబ్బందులు జరుగుతే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని తల్లిదండ్రులకు ఇబ్బందులు కలగకుండా హామీ ఇవ్వడం జరుగుతుందని కరస్పాండెంట్ శశి చెప్పడం పాత్రికేయులకు ఎంతో గర్వంగా భావించడం జరిగిందని పాఠశాల అంటే కేవలం ఫీజులకు కక్కుర్తి పడి విద్యను గాలికి వదిలేసి కాలం గడుపుతున్న సందర్భాల్లో మహదేవ్పూర్ మండల కేంద్రంలో ప్రజల పక్షాన పోరాడే పాత్రికేయులకు అలాగే పాత్రికేయుల సూచనలకు తల్లిదండ్రులకు ఇబ్బంది పడకుండా వారికి అండగా నిలుస్తామని భరోసా కలిగించినటువంటి ఎంఎం శశి మరియు గుడ్ మార్నింగ్ పాఠశాల అందిస్తున్న ప్రేమ ఆప్యాయత గౌరవాన్ని ఎన్నటికీ మరిచిపోయేది కాదని మండల పాత్రికేయుల పక్షాన గుడ్ మార్నింగ్ పాఠశాలకు మిన్ను బాయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాత్రికేయుల నుండి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు ముబీన్, ప్రవీణ్ కుమార్ సయ్యద్ జమీల్ రాజబాబు అనిల్ కుమార్ సయ్యద్ షఫీ దుర్గయ్య రాజు శ్రీనివాస్ సాంబయ్య భాస్కర్ తో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *