నాగ మహారాజ్ ధర్మసమాజ్ పార్టీ మండల అధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన చిహ్నన్ని రాష్ట్ర చిహ్నంగా పరిగనించాలని ఎంఆర్ఒ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు నాగ మహారాజ్ మాట్లాడుతూ ఈ చిహ్నం గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ,దాని నుండి డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ చిత్రపటం ఉండటం అణగారిన వర్గాల రాజ్యంకోసం,హక్కుల కోసం పోరాటం చేసిన పండగ సాయన్న,సర్దార్ సర్వాయ్ పాపన్న,సమ్మక్క సారక్క చిత్రలను కుడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిత్రం లో ఉంచడం జరిగిందని తెలియజేసారు.ఈ కార్యక్రమం లో ధర్మ సమాజ్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు బొచ్చు నాగమహారాజ్,ప్రశాంత్,కృష్ణ,బాలు,మహేందర్ లు పాల్గొన్నారు.