`అధికారంలో ఉన్నప్పుడు కెటిఆర్ ప్రజల్లో లేరనేవారు అవివేకులు.
`కెటిఆర్ ప్రజల్లో లేడనేవారు ఆ సమయంలో ఎవ్వరు లేరు!

`రాజకీయాల కోసం మానవత్వం మర్చిపోవద్దు.
`అబద్దాలు ప్రచారం చేసి అబాసు పాలుకావొద్దు!

`కరోనా కష్ట కాలాన్ని మించిన ఉప ద్రవం మరొకటి లేదు.
`బిఆరఎస్ ఎప్పుడూ తెలంగాణా గుండె చప్పుడే!

`కరోనా కాలంలో ప్రజల్లో వున్నది బిఆరఎస్ నేతలే!
`రెడ్ జోన్ లో తిరుగుతూ ప్రజలకు దైర్యం చెప్పింది కెటిఆర్.
`ప్రాణాలను కూడా లెక్క చేయని నాయకుడు కేటీఆర్.
`కరోనా తర్వాత వరదలొస్తే ఆదుకున్నది బిఆరఎస్.
`అటు కరోనా భయం, ఇటు వరద కష్టంలో కలియ తిరిగింది కెటిఆర్.
`ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసింది బిఆరఎస్ నాయకులే.
`ఆ సమయం లో ఏ ఇతర పార్టీ నాయకులు బైటకు రాలేదు రూపాయి పేదలకు సాయం చేయలేదు.
`కోట్ల రూపాయలు ఖర్చు చేసి సాయం చేసింది బిఆరఎస్ నాయకులే.
`చరిత్రను ఎవ్వరూ మార్చలేరు..ప్రజలను ఏమార్చలేరు.
హైదరాబాద్, నేటిధాత్రి:
పదేళ్లు పార్టీ అధికారంలో వున్నప్ప్పుడు కేటిఆర్, ప్రజల్లో లేడన్న కవిత వ్యాఖ్యలు అమానవీయమైవి. అసందర్భమైనవి. అర్ధం లేనివి. ఒక వ్యక్తి గురించి మరో వ్యక్తి మాట్లాడే ముందు ఆవేశంతో మాట్లాడుతున్నామా? ఆలోచనతో మాట్లాడుతున్నామా? అని చూసుకొని మాట్లాడితే ఆ వ్యక్తులకు విలువ గౌరవం పెరుగుతాయి. నాలుÅ£ వున్న ఆహారం జీర్ణం చేసుకోవడానికే కాదు, అవతలి వారికి జీర్ణమయ్యే మాటలు మాట్లాడాలని పెద్దలు ఎప్ప్పుడో చెప్పారు. రాజకీయాల్లో కొన్ని సార్లు కావాలని అవతలి వ్యక్తిని ఇష్టం లేకున్నా శంకించే విధానం కనిపిస్తుంది. అది కూడా ఒక దశ వరకు మాత్రమే వుంటుంది. ఇటీవల మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బిఆరఎస్ వర్కింగ్ ప్రెడిడెంటు గురించి మాట్లాడుతూ అధికారంలో వున్నంత కాలం ప్రజల్లో లేరు. అధికారం పోయిన తర్వాత కేటిఆర్ ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది నిజంగా సరైన విమర్శ కాదు. కేటిఆర్ తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు జనంలోలేకుండా ఏ ఒక్క రోజు లేరు. అదికారం వున్నప్ప్పుడైనా, తెలంగాణ ఉద్యమం చేసినప్ప్పుడైనా, ఇప్ప్పుడైనా ప్రజలకు దూరంగా కేటిఆర్ వున్నాడనడం సమంజసం కాదు. తెలంగాణ రాష్ట్రంలో, రాజకీయాల్లో కేసిఆర్ సైన్యమంతా ప్రజల్లో వున్నవారే. వుంటున్న వాళ్లే. అగ్ర నాయకులతోపాటు, నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో వున్నవాళ్లే. అలాంటి పార్టీ నాయకుడు ప్రజల్లో లేరని చెప్పడం హాస్యాస్పదం. కేటిఆర్ ప్రజల్లో వున్నారా? లేదా? అని చెప్పడానికి కరోనా సమయం ఒక్కటి చాలు. ఆ సమయంలో కేటిఆర్ ఎంతటి ధైర్యసాహసాలు చేశారో కవితకు తెలియంది కాదు. ఆయన గుండె ధైర్యాన్ని ఆనాడు మెచ్చుకోని తెలంగాణ వాళ్లు లేరు. ఇంకా తెలంగాణ ప్రజలు ఆ సమయంలో బిఆరఎస్ నాయకులు చేసిన మేలును ప్రజలు ఎప్ప్పుడూ మర్చిపోరు. ఆ రెండేళ్ల కాలంలో బిఆరఎస్ నాయకులు ప్రజలకు చేసిన సేవ చరిత్రలో ఎవరో చెరిపేస్తే పోదు. అగ్రనేతలు కేటిఆర్, హరీష్‌రావు, జోగినపల్లి సంతోష్‌రావు లతోపాటు ఆనాడు అగ్ర నేతలుగా వున్న వాళ్లంతా ప్రజల్లో వున్నారు. ప్రజల బాగోగులు చూసుకున్నారు. ప్రపంచమంతా తలుపులు మూసుకొని వుంటే తెలంగాణలో ఒక్క బిఆరఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రమే రోడ్ల మీద వున్నారు. వత్తిపరంగా ముందు వరుసలో వుండే పోలీసుల శాఖ, వైద్యశాఖ, మున్సిపల్ శాఖల ఉద్యోగులంతా ప్రజలకు చేరువలో వున్నారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా చూసుకున్నారు. ఏ ఒక్కరు ఆకలితో అలమటించకుండా చూసుకున్నారు. వారికి వైద్యసేవలందించారు. కరోనా మహమ్మారికి ఆనాడు బిఆరఎస్ నాయకులు భయపడలేదు. కరోనాను పారద్రోలే ధైర్యం చేశారు. మున్సిపల్ మంత్రిగా కేటిఆర్ చూపిన ధైర్యం అంతా ఇంతా కాదు. ఏకంగా రెడ్ జోన్ ఏరియాల్లో కూడా తిరుగుతూ, ప్రజలకు భరోసా కల్పించారు. కేసిఆర్ వున్నారు. మీరు అధైర్య పడొద్దు. ప్యానిక్ కాకండి. ప్రభుత్వం అందర్ని అన్ని విధాల ఆదుకుంటామని కేటిఆర్ హైదరాబాద్ నగరం కలియ తిరిగుతూ చెప్పారు. ఎక్కడో దాక్కొని మీడియా ముఖంగా చెప్పిన మాటలు కాదు. కరోనా అనే పేరు వింటేనే గజగజ వణికిన ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏకైక ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం. బిఆరఎస్ క్యాడర్ అంతా బ్రేవ్ లీడర్స్ అని ప్రపంచమే మెచ్చుకున్నది. మామూలు సమయాల్లో ఏ నాయకుడైనా జనంలోకి వస్తారు. కాని ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా ప్రజల్లోకి వచ్చి, సేవలు చేసిన నాయకులు బిఆరఎస్ నాయకులు. అందులో ముందు వరుసలోవున్న నాయకుడు కేటిఆర్. నాయకుడే అభద్రతా భావంతో వుంటే, నాయకులు కూడా ధైర్యం కోల్పోతారని ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేటిఆర్. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎక్కడా అలా ప్రజలకు భరోసా కల్పించిన నాయకులు లేరు. కేవలం తెలంగాణలో అప్పటి పాలకపక్షం నాయకులు మాత్రమే ఆ దైర్యంచూపారు. ఆ సమయంలో దేశంలోని అనేక ప్రాంతాలనుంచి, ఆఖరుకు డిల్లీ నుంచి కూడా కరోనా వైద్యం కోసం ఎంతోమంది హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందుతున్నందన్న నమ్మకంతో వచ్చారు. డిల్లీ లాంటి రాష్ట్రాలలో ఆక్సీజన్ సిలిండర్లు కూడా అందకుండా చనిపోయిన వారు ఎంతో మంది వున్నారు. అలాంటిది తెలంగాణలో అలాంటి పరిస్దితి ఉత్పన్నం కాకుండా చూసుకున్న పాలకులు బిఆరఎస్ నాయకులు కాదా? ఆఘ మేఘాల మీద కరోనా వైద్యం కోసం టిమ్స్‌ను ఏర్పాటు చేసి అత్యవసర వైద్య సేవలు అందించించింది కేసిఆర్ కాదా? కేటిఆర్దగ్గరుండి ఆ పనులన్నీ నిద్రాహారాలు మాని పర్యవేక్షించలేదా? ఆ సమయంలో కవిత ఎక్కడున్నారు? అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే ఆమె ఏం సమాదానం చెబుతారు? ప్రజలు కష్ట కాýంలో వున్నప్ప్పుడు జనం చెంత వున్న నాయకులే అసలైన నాయకులు. కేవలం రాజకీయాల కోసం, పదవుల కోసం, ఎన్నికల్లో గెలుపుకోసమే ప్రజల్లో వుండే వాళ్లు స్వార్ధపరులు. కాని ఎన్నికలు లేకున్నా, పదవులున్నా, లేకున్నా ప్రజల్లో వుండే నాయకులు కేటిఆర్ హరీష్‌రావులు అని తెలంగాణ జనమే ఏనాడో గుర్తించింది. వాళ్లకు ఇప్ప్పుడు కొత్తగా ఎవరి గుర్తింపు అవసరం లేదు. ఓ వైపు కరోనా కాలం, మరో వైపు హైదరాబాద్‌లో అకాల వర్షంతో రాత్రికి రాత్రి అతలా కుతలమైంది. కాలనీలన్నీ నీటిలో మునిగిపోయాయి. ఆ సమయంలో అప్పటికప్ప్పుడు బోరున వానలో కూడా నగరంలో పర్యటించిన నాయకుడు కేటిఆర్. బిఆరఎస్ నాయకులు. రాత్రి వేళల్లో నీళ్లలో, బురద నీళ్లలో కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించిన నాయకుడు కేటిఆర్. ఇది జనం మర్చిపోలేదు. కాని కవితకు మర్చిపోయినట్లున్నారు. అలా నగర ప్రజలు అల్లాడుతుంటే ప్రతి ఇంటికి పది వేల రూపాయలు ఇచ్చిన ఆదుకున్న పాలకుడు కేసిఆర్. ఇంతకన్నా ఏ పాలకులు ప్రజలకు మేలు చేసినట్లు చరిత్రలో లేదు. అలా ప్రజలను అడుగడుగునా అటు ప్రభుత్వ పరంగా, ఇటు పార్టీ పరంగా ఆదుకున్న నాయకులు ఎవరైనా వున్నారా? అంటే అది బిఆరఎస్ నాయకులు మాత్రమే. తొలి కరోనా కేసు నమోదైన సందర్భంలో కర్నాటక నుంచి వచ్చిన కరోనా వ్యాధి గ్రస్తుడిని ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానిది. ఆ సమయంలో తొలి కేసును కూడా ఒక మంత్రిగా వెళ్లి పరారమర్శించింది ఆనాటి వైద్య శాఖ మంత్రి, అప్పటి బిఆరఎస్ నాయకులు ఈటెల రాజేందర్. అలా ప్రభుత్వం తరుపున మంత్రులు, పార్టీ తరుపున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఇతర జిల్లా నాయకులు మొత్తం తెలంగాణకు సేవ చేశారు. కరోనా కాలం నుంచి ప్రజలను గట్టెక్కించారు. ఆదిలా బాద్ నుంచి మొదలు ఖమ్మం వరకు, ఇటు పాలమూరు జిల్లా వరకు తెలంగాణ మొత్తం ప్రజలను ఆదుకున్నది బిఆరఎస్ నాయకులు, కార్యకర్తలు. ఖమ్మం జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చేసిన సాయం కొన్ని కోట్లు. రెండు సంవత్సరాలు ప్రజలను పీడించిన కరోనా కాలంలో ప్రజలను ఆయన ఖమ్మంలో ఎంతో ఆదుకున్నారు. తాతా మధు కూడా ఎంతో సేవ చేశారు. వరంగల్ జిల్లాలో అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రలైన దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్, శంకర్ నాయక్, నన్నపనేని నరేందర్, వినయ్ భాస్కర్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, ఆరూరి రమేష్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా దర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, మధుసూదనా చారి, రాజయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, మాలోతు కవిత, నాగుర్ల వెంకన్న, నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్వరెడ్డి, గొంగిడి సునీత, కర్నె ప్రభాకర్, హైదరాబాద్ లో మంత్రి కేటిఆర్‌తోపాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావ్ గౌడ్, బొంతు రామ్మెహన్ , మన్నె గోవర్థన్‌రెడ్డి, అరికెపూడి గాందీ, నిజామాబాద్ జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మహబూబ్ నగర్ శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, బాలమల్లు, మర్రి జనార్ధన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుబాష్‌రెడ్డి, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, వినోద్ కుమార్, రసమయ్ బాలకిషన్, కొప్ప్పుల ఈశ్వర్, బాల్క సుమన్, పాడి కౌషిక్ రెడ్డి, నడిపల్లి దివాకర్, ఆదిలాబాద్‌లో జోగు రామన్న, మెదక్ పద్మాదేవేందర్‌రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి , రామగుండం మాజీ ఎమెల్యే కోరుకంటి చందర్, రాజ్యసభ సభ్యుడు హెటిరో పార్ధసారధి రెడ్డి, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంపగోవర్థన్, నాయకుడు తిమ్మయ్య గారి సుభాష్‌రెడ్డి, పుట్టా మధు, ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్, మాధవరం కష్ణారావు లాంటి వారితోపాటు కొన్ని లక్షల మంది బిఆరఎస్ కార్యకర్తలు సేవల్లో పాలు పంచుకున్నారు. ఇందులో కవిత ఎక్కవున్నారు? అని ఏ ఒక్కరైనా ప్రశ్నిస్తే సమాధానం ఎవరు చెబుతారు?
