పిల్లలు, గర్భిణీల ఆరోగ్యమే లక్ష్యం:పౌష్టికాహారం అందించిన సర్పంచ్ మందుల నాగయ్య.
కోదాడ, నేటి ధాత్రి :
అంగన్వాడి కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మందుల నాగయ్య అన్నారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఉన్న అంగన్వాడి 2 సెంటర్ల లో నందు టీచర్ నసీమా, జానమ్మ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య పౌష్టికాహార పదార్థాలను గర్భిణీ, బాలింత స్త్రీలకు బాలామృతం, గుడ్లు, పాలు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేసే ఆహార పదార్థాల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ దానెయేలు, మాదాసి నాగరాజు, ఇస్సాకు, కరుణాకర్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
