రైతు భరోసా నిధులు విడుదల చేయాలి…

రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

బి ఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దేవనూరీ కుమార్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

పంట పెట్టుబడికి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షులు దేవును రీ కుమార్ డిమాండ్ చేశారు యాసంగి సీజన్ ప్రారంభమై ఇప్పటికే 20 రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే రైతు భరోసా నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని .
పంట సాయం అందకపోవడంతో రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు చేసి ఆర్థికంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తిగతం చేశారు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు రైతులను పట్టించుకోకుంటే తగిన గుణపాఠం తప్పదు అన్నారు వెంటనే రైతులకు పంట సాయం అందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారుఅలాగే, ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రాష్ట్రంలోని రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేయాలని కోరారు. తమది రైతు ప్రభుత్వం అంటూ ప్రచారం చేసిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం రైతుల సమస్యల పరిష్కారంలో, రైతుల ఆత్మహత్యల నివారణలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

గూగుల్ ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్….

గూగుల్ ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్

 

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని సమస్త రైతు సోదర సోదరీమణులకు, ఎరువుల డీలర్లకు తెలియజేయునది ఏమనగా!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాబోవు యాసంగి పంట కాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగింది.
తేదీ 20.12.2025 నుండి ఈ యాప్ లో రైతులు తమ మొబైల్ నెంబర్ ను ఉపయోగించి ఓటిపి ద్వారా లాగిన్ కావాలి తర్వాత జిల్లాను ఎంచుకుంటే వివిధ సొసైటీలు లేదా డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు కనిపిస్తాయి తమకు అనుకూలమైన మరియు అందుబాటులో ఉన్న సొసైటీలు లేదా డీలర్ వద్ద యూరియా బస్తాల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసే క్రమంలో పంట సీజను,పట్టా పాస్ బుక్ నెంబరు,ఏ పంట ఎంత విస్తీర్ణం,పంట రకము నమోదు చేసుకోవాలి.పంట విస్తీర్ణాన్ని బట్టి యూరియా బస్తాలు తీసుకోవచ్చు. రైతుల బుకింగు కు 24 గంటల వ్యవధి ఉంటుంది. ఈ యూరియా బుకింగ్ విధానంలో ఒక ఎకరం వరకు ఒకేసారి ఒకటి నుండి 5 ఎకరాల వరకు 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఐదు నుండి 20 ఎకరాల వరకు మూడు సార్లు 15 రోజుల వ్యవధిలో బుక్ చేసుకోవచ్చు.
పాసుబుక్ లేని రైతులు ఆధార్ నెంబర్ ద్వారా యూరియా బస్తాలను పొందవచ్చు,కౌలు రైతులను కూడా ఈ యాప్ లో అవకాశం కల్పించారు.
డీలర్లు కూడా మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి రోజువారి స్టాకు అమ్మకం వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది.
కావున నడికూడ మండల సమస్త రైతు సోదర సోదరీమణు లకు ఇట్టి విషయాన్ని తెలియపరుస్తూ మరియు సాధారణ పద్ధతిలో యూరియా బస్తాలు అందించబడదని తెలియజేయడమైనది.
గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లాట్ బుక్ చేసుకొని యూరియా బస్తాలను పొందగలరని తెలియపరచనైనది.
అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్న సంబంధిత క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా సంప్రదించవచ్చని మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version