జగన్ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారింది.. పరిటాల సునీత ఫైర్
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత (Paritala Sunitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఏపీ అభివృద్ధి అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) రాప్తాడు నియోజకవర్గ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని కక్కలపల్లి గ్రామ చెరువుకి జలహారతి ఇచ్చారు పరిటాల సునీత. గ్రామస్తులతో కలిసి చెరువు వద్ద బోనాలతో పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పరిటాల సునీత.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని తెలిపారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు పాలనతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతోందని పరిటాల సునీత పేర్కొన్నారు.
