దప్పళం’ భోజనానంద రాగం.. ఆ ఆరు రుచులూ ఉన్న వంటకాన్ని..
ఒక ద్రవ్యంలోని విటమిన్లు మినరల్స్, ఇతర రసాయనాలే దానికి వగరూ, తీపీ లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుకుర్బి టాసిన్ గ్లైకోసైడ్స్ చేదు రుచిని ఇచ్చి, స్థూల కాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణనిస్తుంది. కాకరకాయ బిట్టర్ టానిక్ అందుకే! పసుపులో ఉండే కర్కుమిన్ దానికి వగరు రుచినిస్తోంది.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ ఉన్న వంటకాన్ని షడ్రసో పేతమైనదిగా భావిస్తాం. ఆరోగ్యంగా జీవించటానికి ఆహారపదార్థాలు ఈ ఆరు రుచులతో కూడుకున్నవిగా ఉండాలనేదే ఆయుర్వేద సూత్రం!ఒక ద్రవ్యంలోని విటమిన్లు మినరల్స్, ఇతర రసాయనాలే దానికి వగరూ, తీపీ లాంటి రుచుల్ని ఇస్తున్నాయి. కాకరకాయలో కుకుర్బి టాసిన్ గ్లైకోసైడ్స్ చేదు రుచిని ఇచ్చి, స్థూల కాయాన్ని, షుగర్ని తగ్గించి పోషణనిస్తుంది. కాకరకాయ బిట్టర్ టానిక్ అందుకే! పసుపులో ఉండే కర్కుమిన్ దానికి వగరు రుచినిస్తోంది. వగరు వలన కలిగే ఉపయోగాలన్నీ పసుపుకి ఉన్నాయి. ఇలా ఆరు రుచులకు సంబంధించిన ద్రవ్యాల్ని కలిపి షడ్రసోపేతమైన వంటకాలకు మనం ప్రాధాన్యతనిస్తే అది సమతుల్య ఆహారమవుతుంది. దప్పళంలో మనకు ఆరురుచులూ కలిసి ఉంటాయి. అందుకే అది గొప్ప పోషకం, ఎక్కువ కాయ గూరలు కలిసిన పప్పు పులుసు దప్పళం! ఆరు రుచుల్లాగానే నవరసాలూ కలిసి ఉంటాయి కాబట్టి, జీవితమే ఓ దప్పళం! తెలుగువాళ్లకి దప్పళం శుభప్రదమైంది. పండగలకీ, పబ్బాలకీ పులుసూ, చారూ ఉన్నా సరే, ‘దప్పళం’ అదనంగా కావాలి! దప్పళం పాడు ఊరు పేరు, దప్పళం ఇంటిపేరు కూడా ఉన్నాయి.
ద్రావిడభాషా పదం ‘దప్ప’ తెలుగు, తమిళ, కన్నడ, తుళు భాషల్లో ‘దట్టమైన’, ‘చిక్కనైన’ అనే అర్థాల్లో ఉంది. నిండా కాయగూర ముక్కలు పోసి దట్టంగా వండుతారు కాబట్టి, అది దప్పళం అయ్యింది. ఇది అత్యంత ప్రాచీన ద్రావిడ వంటకం! అది సంస్కృతపదం అనుకుని ‘ధప్పళం’ అని వత్తి పలుకుతారు కొందరుఒక్క తెలుగువాళ్లే అచ్చతెలుగులో దీన్ని దప్పళం అంటున్నారు. కన్నడిగులు, తమిళులు ‘కదంబం’ అంటారు. కదంబం లేదా కదంబకం అంటే సంస్కృతంలో మిశ్రమం అని! మిక్సెడ్ వెజిటబుల్ సూప్ అని వాళ్లంటే ‘థిక్ సూప్’- దప్పళం అని తెలుగులో అంటున్నాంచింతకాయ బొంతకాయ చిగురు భూమిడ కాయ/ కొల్లేటివంకాయ కొమ్మనిమ్మా పండు/ ఈరుగురు గుంటలో బాలుగులు మెయ్యగా/ ఒకటే కాయగా ఒంటి పువురాలగా/ తాటాకు దప్పళం, కోట వెలుగో!’’ అనే జానపద గీతంలో వామన చింత కాయలు, (కూర అరటి కాయ, లేత నేలములక కాయ, కొల్లేటి వంకాయ, కొమ్మనిమ్మపండు ఇవన్నీ కలిసి కాచిన దప్పళం ఆకాశంలో వెన్నెల్లా ఉందట. ఒకటే కాయతో వండితే ఒంటిపువ్వు రాలినట్టు అది తాటాకు దప్పళం అవుతుందట. మరి కోటకి (శరీరానికి) వెలుగు మాటేమిటీ? అని అడుగుతోంది ఈ జానపద గీతంపపప్ప పసన ధప్పళం అన్నం నెయ్యి – వేడి వేడి అన్నంమీద కమ్మని పప్పు, కాచిన నెయ్యా పప్పు దప్పళం- కలిసి కొట్టడం’’అంటూ ఆరుద్ర ఓ సినిమాకి రాశాడు. ‘కన్యాశుల్కం’లో గిరీశం వెంకటేశానికి రెలిజియన్ రిఫార్మ్స్ గురించి లెక్చరిస్తూ, ‘‘తెల్లవాడు యేవని ధ్యానం చేస్తాడోయి రోజూనూ? ‘‘ఫాదర్‌గివ్‌అస్ అవర్ డెయిలీ, బ్రెడ్’’ అనగా ‘‘నన్ను కన్న తండ్రీ! రోజూ ఒక రొట్టెముక్క ఇయ్యవోయి అని! ఇక, మనవేవనాలి? ‘‘తండ్రీ! రోజూ కంది పప్పు, దప్పళం ఇయ్యవయ్యా’’ అనిధ్యానించాలి. మన చమకంలో యేవన్నాడూ?శ్యామాకాశ్చమే.. చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుడా!’’ అన్నాడు. ఆ చమకంలో యవడికి యిష్టవైన వస్తువులు వాడు కలపవచ్చును ‘‘కంది గుండాచమే, యింగువ నూనాచమే’’ దీనినే రెలిజియన్ రిఫార్ము అంటారంటాడు గిరీశం! పప్పు, దప్పళం ధర్మపిండం దొరికితే చాలు ఎలాగైనా బతికేయొచ్చని అనుకునే గిరీశాలున్నారు.ఒక్కదప్పళం చాలు వంద వంటకాల పెట్టు కదా! కూర, పప్పు, పచ్చడి, దప్పళం, పెరుగు ఇంతమాత్రం ఉంటే దాన్ని ‘ఎగ్జిక్యూటివ్ లంచ్’ అంటారు. రోజువారీ భోజనం అని! దప్పళంలో పప్పు, కూరగాయలతో పాటు వేపపూలు, కరి వేపాకులు, కాకరముక్కలు కూడా ఉంటాయి. చాలినంత డయటరీ ఫైబర్, ప్రొటీన్లతో పాటు వగరూ చేదుతో కూడిన ఆరు రుచులూ ఉండటంతో ఆరోగ్యకరం అవుతుందిభోజనం చేయటాన్ని శ్రీనాథుడు ‘భుజిక్రియ’ అన్నాడు. అలాగని భోజనం కేవలం తినే పనే కాదు, అది మన జీవనరాగం! దప్పళం దానికి తోడైన ‘ఆది’తాళం!
