కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక.

కేసముద్రం మండల టిడిపి పార్టీ నూతన కమిటీ ఎన్నిక

టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య

ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ

కేసముద్రం నేటి ధాత్రి:

 

 

shine junior college

కేసముద్రం మున్సిపాలిటీలోని హరిహర గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం మహబూబాబాద్ పార్లమెంట్ అడహక్ కమిటీ కన్వీనర్ గా కొండపల్లి రామచందర్ రావు అధ్యక్షత వహించగా రాష్ట్ర టిడిపి పార్టీ పరిశీలకులుగా యనాల అనంతరెడ్డి హాజరై కేసముద్రం టిడిపి మండల పార్టీ ఎన్నికలను నాయకుల, కార్యకర్తల మధ్య ఏకగ్రీవ ఎన్నిక నిర్వహించారు. కేసముద్రం టిడిపి మండల పార్టీ అధ్యక్షునిగా ఏశబోయిన ఎల్లయ్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర టిడిపి పార్టీ ఉపాధ్యక్షులు బండి పుల్లయ్య,రాష్ట్ర మాజీ కార్యదర్శిలు ఎం డి. ఇమామ్, వెంకటనారాయణ, మహబూబాబాద్ పార్లమెంటు మాజీ అధికార ప్రతినిధి ప్రేమ్ చంద్,కొరివి మండల పార్టీ అధ్యక్షుడు వీరస్వామి, మహబూబాబాద్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వర్లు హాజరైనారు. అదేవిధంగా మండల పార్టీ ఉపాధ్యక్షులుగా యాసారపు నరసయ్య,ప్రధాన కార్యదర్శిగా బోడకుంట్ల సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శులు గూడేలు ముత్తయ్య,గుగులోత్ లక్ష్మణ్,భూక్య లచ్చిరాం, కార్యదర్శులుగా ఆవుల సారయ్య,షేక్ దలాల్ షరీఫ్, కోశాధికారిక గుర్రాల స్వరూపాలను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులుగా ఎన్నికైన యశోబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ… మండల కేంద్రంలో టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి అభివృద్ధి దిశగా నడిపిస్తూ రానున్న స్థానిక ఎన్నికలలో టిడిపిని మంచి స్థానంలో నిలిపేలా కృషి చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా మండల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యక్ష కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక.

టిడిపి నూతన కమిటీ ఎన్నిక

పట్టణ అధ్యక్షునిగా చిరురాల రామన్న

పరకాల నేటిధాత్రి:

 

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు,అరవింద్ కుమార్ గౌడ్,తెలంగాణ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నన్నూరి నర్సిరెడ్డి ఆదేశాల మేరకు పరకాల పట్టణ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.పరకాల పట్టణ కమిటీ అధ్యక్షులుగా చిదురాల రామన్న,ఉపాధ్యక్షులుగా కొత్తపల్లి శంకర్,ప్రధాన కార్యదర్శిగా బోయిని రాజశేఖర్,క్రిస్టఫర్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మహారాజ్,బేగం,రవీందర్,స్వామి,మంజుల లక్ష్మీలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంటు అడా కమిటీ కన్వీనర్ అర్షనపల్లి విద్యాసాగర్ రావు,రాష్ట్ర పరిశీలకులు ముంజ వెంకట రాజ్యం గౌడ్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర రాజు నాయక్,అడా కమిటీ సభ్యులు కందుకూరి నరేష్, లు పాల్గొన్నారు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

43 వ తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి

 

ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో మండల అధ్యక్షులు చట్కూరి నారగౌడ్ ఆధ్వర్యంలో 43 వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు జరిపారు. తదనంతరం నందమూరి తారక రామారావు ఫోటోకు పూలమాల చేసి తెదేపా జెండా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు సూర్య నాయక్ హాజరై రాబోవు రోజుల్లో తెలుగుదేశం పార్టీని తెలంగాణ వ్యాప్తంగా పటిష్టం చేయడానికి నూతన కార్యక్రమాలు రూపొందిస్తున్నాము. స్థానిక సంస్థల్లో తెదేపా పార్టీ నుండి ఫోటిలో ఉండబోతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల ప్రహ్లాద, బందారపు మల్లారెడ్డి, లింగాల దాసు, కట్టెల బాలయ్య, లచ్చ గౌడ్, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

అబద్దాలకు హద్దు లేదు?..మాటలకు పొంతన లేదు!?

`అసలు జనసేన ఎందుకు పుట్టింది?

`ఎవరి కోసం పుట్టింది!

`ఎలాంటి నాయకత్వం రాష్ట్రానికి ఇవ్వాలనుకుంటోంది!

`అసలు సిద్దాంతం ఏమిటి?

`చేయాల్సిన రాద్దాంతం ఏమిటి?

`ఆవిర్భావ సభ ఎవరికి భరోసా కల్పించింది?

`కొత్త తరం నాయకత్వానికి ఏమి హామీ ఇచ్చింది?

`గంటకు పైగా సాగిన ఉపన్యాసంలో చెప్పిందేమిటి?

`గతంలో చెప్పిన మాటలకు ఇప్పుడు చెబుతున్న మాటలకు పొంతన వుందా?

`కనీసం అప్పటి మాటలకు, ఇప్పటి మాటలు కొంచైనా సింక్‌ అవుతున్నాయా?

`దేవుని హారతితో తన తండ్రి సిగరెట్‌ వెలిగించుకునే వారు అని చెప్పిందే పవన్‌!

`మా ఇంట్లో ఎప్పుడూ రామ నామ జపం వినిపిస్తూనే వుండేది అంటున్నది పవనే!

`తొలిప్రేమ సినిమా తర్వాత కంప్యూటర్‌ కోర్స్‌ చెన్నై లో నేర్చుకున్నాన్నది పవనే!

`పరీక్ష రాసి రావడం వల్ల లేటైతే ఇంట్లో కంగారు పడ్డారని చెప్పింది ఆయనే.

`పదకొండేళ్ల ప్రస్థానం గురించి పక్కన పెట్టి తన బాల్య స్మృతులు చెప్పడమేమిటి?

`అసలు జన సేన లక్ష్యాలేమిటి?

`జనసేన అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?

`జనసేన వల్ల ఏపికి ఏం లాభం చేకూరింది?

`పార్టీ కోసం కష్టపడుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?

`అవన్నీ వదిలేసి చెప్పిన మాటలేమిటి?

`జనసేన సభలో పవన్‌ చెప్పాల్సిన మాటలేనా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నోరు తెరిస్తే అబద్దమే..మాట మాట్లాడితే అబద్దమే..చెప్పిందంతా అబద్దమే..చెబుతున్నదంతా అబద్దమే..చెప్పేదేమున్నా అదీ అబద్దమే…ఈ మాటలు ఎవరి గురించో అనుకుంటున్నారా? జనసేన అధినేత పవన్‌ కళ్యాన్‌ గురించి ఏపిలోని వివిధ రాజకీయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ఆది నుంచి ఆయన చెబుతున్న గతం తాలూకు మాటలకు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు ఎక్కడా పొంతనలేదంటున్నారు. పైగా నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించిన ఘనత జనసేనదే అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురంలో జరిగిన పార్టీ 12వ వార్షికోత్సవ సమావేశంలో ఎమ్మెల్సీ నాగబాబు కొంత పొగరాజేశారు. పిఠాపురంలో పవన్‌ గెలుపుకు తామే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు తోడు పవన్‌ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయ వాతావణంలో వేడిని పెంచాయి. తెలుగుదేశం శ్రేణుల నుంచి జనసేన మీద తీవ్ర నిరసనలు వెలువడ్డాయి. ఇదిలా వుంటే ప్రతి సారి పవన్‌ తన వ్యక్తిగత జీవితంలోని అంశాలు ఉటంకించడం పరిపాటిగా మారింది. అయితే ఒకటే విషయాన్ని పదే పదే చెబితే బాగుండదనుకుంటారో..లేక గతంలో చెప్పిన అంశాన్ని మర్చిపోతుంటారో గాని ఎప్పుడూ ఏదో ఒక కొత్త లెక్క చెబుతుంటారు. కాని గతంలోనే చెప్పిన విషయాన్నే మరోలా చెబుతుంటారు. ఇక్కడే అందరూ పవన్‌పై విమర్శలు గుప్పిస్తుంటారు. తాజాగా తాను చెన్నైలో వివక్షను ఎదుర్కొన్నానంటూ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం నెలకొన్నది. చిరంజీవి సినీ స్టార్‌గా ఎదిగింది చెన్నైలోనే. ఆయన తన జీవితంలో ఎక్కువ సినీ కాలం గడిపింది చెన్నైలోనే..అన్నతోనే వుంటూ పవన్‌ కూడా చెన్నైలోనే వున్నారు. కాని ఇప్పుడు చెన్నైలో తాను వివక్షను ఎదుర్కొన్నారని చెబుతుంటే జనం నవ్వుకుంటున్నారని రాజకీయ పార్టీలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక పార్టీ వార్షికోత్సవ సభలో సుమారు 90 నిమిషాల పాటు ప్రసంగించిన పవన్‌ కళ్యాణ్‌ తన జీవితంలో జరిగిన సంఘటనలు చెప్పడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. గతంలో ఆయన నెల్లూరుతోపాటు, అనేక పట్టణాల్లో తన చదవు సాగిందంటూ చెప్పేవారు. చెన్నైలోనూ చదువుకున్నాననేవారు. ఏది నమ్మాలో ఇప్పటికీ ఎవరికీ అర్దం కాకుండాపోయింది. పైగా ఓసారి తెలుగు అంటారు. మరో సారి ఇంగ్లీష్‌ అంటారు. బోటనీ అంటారు..ఇలా ఆయనకు అప్పటికప్పుడు ఏది గుర్తుకు వస్తే అదే చదివినట్లు లెక్క అన్న ధోరణిలో చెబుతుంటారు. పదే పదే ఇలాంటి అంశాలలో చెప్పిన ప్రతీసారి కొత్తదనం కోసం కథలు చెప్పినట్లు తన బాల్యం గురించి చెబుతారు. ఇక తాను చెన్నైలో కంప్యూటర్‌ కోర్సు చదవిన సమయంలో అంటూ పిఠాపురంలో కొత్త కథ చెప్పారు. అప్పటికే తాను నాలుగు సినిమాలు చేసిన హీరోనైనా సరే తాను బైటకు వెళ్తే ఇంటికి వచ్చేవరకు భయపడేవారంటూ చెప్పుకొచ్చారు. ఓవైపు చెన్నైలో వుండగా జరిగిందని ఒక సంఘటన చెప్పిన మరుక్షణమే సికింద్రాబాద్‌లోని సంగీత్‌ ధియేటర్‌ సంగతి చెప్పారు. జనం ఏది నమ్మాలో..ఏది నమ్మకూడదో కూడా అర్దం కాకుండా రాసుకొచ్చుకొని మరీ చెబుతుంటారు. పవన్‌ కల్యాన్‌ తన తండ్రి గురించి గతంలో చెబుతూ ఆయన కమ్యూనిస్టు వాది ఆయన నాస్తికుడు అని చెప్పారు. వాళ్ల నానమ్మ దేవుడికి హారతి ఇస్తే దానితో సిగరెట్‌ వెలిగించుకునేవారు అంటూ స్వయంగా పవన్‌ కళ్యాణే చెప్పారు. ఇప్పుడు మళ్లీ మా కుటుంబంలో నా చిన్న నాటినుంచి ఇంట్లో రామనామం వినిపిస్తూనేవుండేదంటారు. తన తండ్రి రామభక్తుడని పిఠాపురం సాక్షిగా చెప్పుకొచ్చారు. తాను నాస్తికవాదినంటూ పవన్‌ కూడా గతంలో అనేక సార్లు చెప్పారు. పైగా తాను బాప్టిజం తీసుకున్నానని కూడా ఆయనే చెప్పారు. తన పిల్లలకు కూడా బాప్టిజం తీసుకున్నానని గతంలో చెప్పారు. పిఠాపురం సాక్షిగా తాను 14వ ఏటనే పూజలు చేసేవాడినంటూ చెప్పుకొచ్చారు. ఆ మధ్య ఓ సందర్భంలో చిరంజీవి తాను కృషిని మాత్రమే నమ్ముతానని ఏ దేవుడిని నమ్మనంటూ వ్యాఖ్యానించారు. మరో సోదరుడు నాగబాబు తాను ఏ దేవుడిని నమ్మనంటూ కూడా ఆయన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్లుచెప్పారు. మరి పవన్‌ మాత్రం మా ఇంట్లో సనాతనధర్మానికి ఎంతో విలువిస్తామంటూ చెప్పుకొచ్చారు. సనాతన ధర్మమే లేకుంటే మన వ్యవస్ధ చిన్నాభిన్నమయ్యేదంటూ కొత్త కొత్త భాష్యాలు చెప్పారు. ఇవన్నీ విన్న జనసైనికులకు కూడా అసలు సభ ముఖ్య ఉద్దేశ్యమేమిటి? పవన్‌ కళ్యాన్‌ మాట్లాడుతున్నదేమిటని ముక్కున వేలేసుకున్నారు. ఇలా పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా కూడా నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు జనసేన ఎందుకు ఏర్పాటు చేశారు. దాని ఉద్దేశ్యమేమిటి? దాని విధానాలేమిటి? భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి? ఇప్పటి వరకు సాధించిందేమిటి? ఇంకా సాధించాల్సిందేమిటి? జనసేన ఎలా ముందుకు సాగాలి? ఎప్పుడు అధికారంలోకి రావాలి? పార్టీ నిర్మాణం ఎలా సాగాలి? ఎంత మంది సభ్యులున్న పార్టీగా చరిత్ర సృష్టించాలి. ప్రాంతీయ పార్టీగా వుండాలా? జాతీయ పార్టీగా ఎదగాలా? అందుకు నాయకులు ఏంచేయాలి? కార్యకర్తలు ఏం చేయాలి? పార్టీ నిర్మాణంలో ఎవరెవరు? ఎలాంటి పాత్ర పోషించాలి. కార్యకర్తలు పూర్తి సమయం పార్టీకోసం కేటాయిస్తే వారి భవిష్యతేమిటి? రాజకీయంగా వారికి ఎలాంటి పదవులు వస్తాయి? ఎప్పుడు వస్తాయి? కూటమిలో చేరి ప్రజలకు ఇచ్చిన హమీల సంగతి ఏమిటి? వాటి అమలు తీరేమిటి? ఆరు గ్యారెంటీల ప్రస్తావనేది? వాటి అమలులో అవరోదాలు ఎందుకు ఎదురౌతున్నాయి? ఎప్పటి వరకు వాటిని పూర్తి చేసే అవకాశం వుంది? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలకు జనసేను సంబంధం వుందా? లేదా? ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వంలో వుండి ప్రశ్నిస్తారా? లేక అమలు కాకుండా ఎదిరిస్తారా? వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేస్తారా? లేదా మరో 15 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు అని చెప్పిన మాటలకు కట్టుబడి వుంటారా? 2014 ఎన్నికల ముందు కలిసి సాగిన కూటమిలో లుకలుకలు వచ్చినట్లు వస్తాయా? రాకుండా చూసుకుంటానని హమీ ఇస్తారా? ఇలాంటి వాటి గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాని నలభై ఏళ్లు తెలుగుదేశం పార్టీని గెలిపించామని చెప్పి తన వల్లే కూటమి విజయం సాధించిందని పరోక్షంగా ప్రకటించారు. ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. కూటమి మధ్యలో చిచ్చు రాజేసేందుకు కారణమౌతుందని చెప్పడంలో సందేహం లేదు. అయినా 2019 ఎన్నికల్లో 175 సీట్లకు జన సేనపోటీ చేస్తే గెలిచింది ఒక్కటి. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తర్వాత జనసేనలో లేడు. పవన్‌ కళ్యాన్‌ రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ఎవరు గెలవాలో..ఏ పార్టీని ఓడిరచాలో నిర్ణయం చేసేది ప్రజలు. కాని నాయకులు కలలు కంటుంటారు. ఎల్లకాలం మేమే వుంటామన్న భ్రమల్లో బతుకుతుంటారు. కాని ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాక్టికల్‌గా వుంటారు. గెలుపోటములు దైవాదీనాలంటూ చెబుతారు. కాని పవన్‌ కల్యాన్‌ అందుకు భిన్నంగా చెబుతుండడంతో జనం నవ్వుకుంటున్నారు. అసలు జనసేన పోటీ చేసిందే 21. కాకపోతే మొత్తం సీట్లు గెలిచారు. 150 సీట్లలలో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ విజయం సామాన్యమైంది కాదు. 135 సీట్లు గెల్చుకున్నది. ఆ గెలుపు కింద జనసేన గెలుపు అన్నది చాలా చిన్న విషయం. ఇకపోతే పిఠాపురంలో తన గెలుపుకు కారణం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మతోపాటు ఆయన కుమారుడు వర్మ పాత్ర వుందని కొనియాడారు. వర్మ చేత ఆశీస్సులు తీసుకున్నారు. కాని ఇప్పుడు పరోక్షంగా వర్మ లాంటి వాళ్లు అలా అనుకుంటే తమ ఖర్మ అన్నట్లు నాగబాబు అన్నారు. ఇదిలా వుంటే జాతీయ మీడియా పవన్‌ పై రాసిన ఆర్టికల్స్‌పై వివరణ ఇచ్చుకునే క్రమంలో తాను ఏం చెబుతున్నాడో తనకే అర్ధం కాకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రైట్‌ నుంచి లెఫ్ట్‌కు, లెఫ్ట్‌ నుంచి సెంటర్‌కు అంటూ ఓ దినపత్రికలోవచ్చిన కధనంపై రకరకాల బాష్యాలు చెప్పారు. అలా మారాల్సిన పరిస్దితులు వచ్చాయని చెప్పుకున్నారు. చెగువేరా ఒక డాక్టర్‌గా మాత్రమే తెలుసని, ఆయన చేసిన సేవలు మాత్రమే తనకు తెలుసంటూ కొత్త లెక్కలు చెప్పడంతో అందరూ నవ్వుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించింది జనసేన అనే వ్యాఖ్యలతో టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పంచాయితీ ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

టిడిపి తీర్థం పుచ్చు కున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పుంగనూరు(నేటి ధాత్రి) మార్చి03:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మరియు అభివృద్ధికి అందులోని మంచిని గ్రహించి తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న అభివృద్ధిని మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు రెడ్డి) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న రొంపిచర్ల మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రొంపి చెర్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ ఇబ్రహీం ఖాన్ మండల వైస్ ఎంపీపీ నూలు రెడ్డప్ప మాజీ జెడ్పిటిసి చంద్రమ్మ భాస్కర్ రెడ్డి
రొంపిచెర్ల ఎంపీటీసీ రహిమాబీ , బండ కింద పల్లె సర్పంచ్ అన్సర్ బాష, రొంపిచర్ల వైస్ సర్పంచ్ శ్రీపతి,
జాండ్లా వారిపల్లి వైస్ సర్పంచ్ బాలాజీ,రొంపిచర్ల వార్డ్ మెంబర్లు నాగరాజా లక్ష్మయ్య మొదలైన వారు అనుచరులతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధికి ఆకర్షితులై ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రజలను మరింత అభివృద్ధి చెందే విధంగా తమ వంతు కృషి చేస్తూ చల్లా రామచంద్రారెడ్డి నాయకత్వంలో పని చేస్తామని తెలియజేశారు..

‘‘తొందరపడకు సుందరవదన’’!

`అన్నీ వున్న విస్తరి అణిగిమణిగి ఉంటుంది.

`ఏమీ లేని విస్తరి ఎగిరెగిరిపడుతుంది.

`నాగబాబుకు ఆవేశమెక్కువ..ఆలోచన తక్కువ!

`లోకేష్‌ సీఎం అంటే ఎందుకు ఉలికిపడుతున్నావు?

`మీడియా పై నాగబాబు జులుం సాగదు.

`నాగబాబుకు నచ్చినట్లు ఏ మీడియా వార్తలు రాయదు.

`కూటమిలో జనసేన ఒక నూలు పోగు మాత్రమే.

`తెలుగు దేశంతో ఉంటేనే జనసేనకు బలం.

`తెగదెంపులు చేసుకుంటే తెగిన గాలిపటం.

`ఆకాశంలో ఎగిరే గాలిపటానికి దారమే ఆధారమని మర్చిపోవద్దు.

`తెలుగు దేశం వల్లనే జనసేనకు సీట్లొచ్చాయన్నది అసలే మరువొద్దు.

`వాపు ఎప్పుడూ బలపు కాదు

`నిజం మీద రాజకీయం చేయకపోతే మనుగడ ఉండదు.

`నాగబాబు తొందరపడి నోరు జారకు?

`నోటిని అదుపులో పెట్టుకో!

`మాటల పొదుపు నేర్చుకో!

`అన్ని వేళల్లో ఆవేశం పనికి రాదు.

`పవన్‌ కళ్యాణ్‌ ఎంతో కష్టపడి జనసేన నిర్మించుకున్నాడు.

`తేనె సీసాలో నీటి చుక్కలు వేయకు.

`పవన్‌ కళ్యాణ్‌ కు రాజకీయ పరిమితులు తెలుసు

`పాలనలో ఎలా ఒదిగిపోవాలో తెలుసు

`ఎప్పటికైనా కూటమిలో లోకేషే సీఎం అని పవన్‌కు తెలుసు

`తెలుగు దేశం పార్టీ ఆలోచనలు పవన్‌కు తెలుసు

`కూటమికి ఎవరూ బీటలు పెట్టడం లేదు

`పవన్‌ ఎక్కడికెళ్లినా అభిమానులు సీఎం అంటారు

`ఏనాడు తెలుగు దేశం పార్టీ నొచ్చుకోలేదు. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

`లోకేష్‌ సీఎం అనగానే నాగబాబు స్పందించాల్సిన అవసరం లేదు

`కూటమిలో ఎవరో కుంపటి పెడుతున్నారని భ్రమ పడాల్సిన పని లేదు

`ఒకప్పుడు అభిమానులు పవర్‌ స్టార్‌ అని అరుస్తుంటేనే నాగబాబు జీర్ణించుకోలేదు

`అభిమానుల మీద ఆగ్రహం వ్యక్తం చేశావు

`జనసేన బలపడడంలో నాగబాబు పాత్ర నయాపైస కూడా లేదు

`పార్టీ నడపలేని సమయంలో దిల్‌ రాజు సినిమాతో పార్టీ బతికింది

`స్వయంగా ఈ మాట పవనే చెప్పింది

`గతంలో బాలకృష్ణ అంటే ఎవరో తెలియదన్నావు

`చరిత్ర ఎవరినీ మర్చిపోదు

`వడ్డీ తో సహా అన్నీ కాలమే చెల్లిస్తుంది

`అన్న చూసి ఓపిక నేర్చుకోలేదు,తమ్ముణ్ణి చూసి కష్టం నేర్చుకోలేదు

`మధ్యలో దూరి చిలువలు పలువలు చేయకు

`ఉన్న కాస్త పరువు తీసుకోకు..

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు వుండరు. ఇది రాజకీయాలకు వున్న మొదటి సిద్దాంతం. మూల సిద్దాంతం. రాజకీయ రాజ్యాంగంలో ఇది రాసి పెట్టకపోయినా, అనుసరిస్తున్న ఏకైక విదానం. సిద్దాంతం. సహజంగా మనం ప్రయాణం చేసే సమయంలో ఎంతో మంది కలుస్తుంటారు. ఇది కూడా అంతే. రాజకీయ పార్టీలకు, నాయకులకు ఎప్పుడు ఎవరు స్నేహితులౌతారో..ఎవరు ఎప్పుడు రాజకీయంగా శత్రువులౌతారో చెప్పడం కష్టం. రాజకీయాల్లో ఎలాంటి పరిస్ధితినైనా సరే ఒకే రకంగా తీసుకోవాలి. కాని జనసేన నాయకుడు నాగబాబు కొంత విరుద్దం. విచిత్రం. ఆయన మాటలు, తీరు, వ్యవహార శైలి కొంత వివాదాస్పదం. కారణం ఆయన ఆలోచనలు లేని, ఆవేశం మూలంగా చాల వరకు ఇరుకున పడుతుంటాడు. ముందూ వెనుక ఆలోచించడన్న అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్య ఆయన పెద్దగా మీడియా ముందుకు వచ్చింది లేదు. పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సిఎం. అయిన తర్వాత చాల కాలం తర్వాత నాగబాబు మీడియా ముందుకు వచ్చారు. అయితే కేవలం కారులో కూర్చొని ఓ వీడియా విడుదల చేశారు. కూటమి ఒక బలమైన, దృఢమైన బంధమన్నారు. మంచి మాట. కాని ఎవరో కూటమి మధ్యలో చిచ్చు పెడుతున్నారని, ఆ బంధాన్ని ఎవరో బలహీన పర్చాలని చూస్తున్నారని, అలాంటి వార్తలు కొన్ని మీడియా సంస్ధలు సృష్టిస్తున్నాయని మాట్లాడుతూ ఓ వీడియో విడుదల చేశారు. గతంలో ఎప్పుడూ మాట్లాడినట్లే ఇప్పుడూ చెల్లుతుందని అనుకున్నట్లున్నారు. అందుకే కొంచెం ఆవేశం ఎక్కువ కదా? అందుకే లోకేష్‌ సిఎం అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకోవడం ఆయనకు నచ్చడం లేదు. దాంతో కొన్ని పత్రికలు, సోషల్‌ మీడియా పనిగట్టుకొని రాతలు రాస్తుందని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అసలు దేనికి చర్యలు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? అన్న ఆలోచన కూడా చేయకుండా తన నోటి దూలను మరోసారి నాగబాబు చూపించుకున్నారు. ఇక్కడ నాగబాబు ఒక మాట మర్చిపోతున్నారు. జనసేన పార్టీ పెట్టింది ఎందుకు? ఎప్పటికైనా పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో వుంటున్నారు. ప్రజల కోసం పనిచేస్తున్నారు. రాష్ట్రాభివృద్దిని కాంక్షిస్తున్నారు. అలాంటప్పుడు తాను ముఖ్యమంత్రి కావాలన్న కోరిక పవన్‌ కళ్యాణ్‌కు వుంటుంది. ఆయనను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని అభిమానులకు వుంటుంది. జనసేన ఏర్పాటు చేసిన నాటి నుంచి, నేటి వరకు పవన్‌ ఎక్కడికెళ్లినా సిఎం. సిఎం. అంటూ నినాదాలు చేయడం పరిపాటి. 2019 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ కూడా గెలవలేదు. రెండు చోట్ల పోటీ చేస్తే కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్‌ కళ్యాణ్‌ ఎక్కడికెళ్లినా జనం సిఎం. సిఎం అంటూ గోల చేశారు. ఆ సమయంలో ఓట్లు వేయలేదు..కాని సిఎం. సిఎం. అని అరిస్తే అవుతానా? ఓట్లేస్తే అవుతానని పవన్‌ అన్న మాటలు నాగబాబుకు గుర్తులేనట్లున్నాయి. సిఎం. సిఎం అనడం కాదు ఓట్లేసి చూపించండి సూచిస్తూనే ఒక దశలో ఓట్లేయండి అని వేడుకున్న సందర్భం కూడా వుంది. అలాంటప్పుడు 2009 నుంచి క్రియాశీల రాజకీయాల్లో వున్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్‌ ముఖ్యమంత్రి కావాలనుకోవడం అభిమానుల తప్పా? పవన్‌ కళ్యాణ్‌ జనసేన అధ్యక్షుడు. లోకేష్‌ తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి. అంటే రాజకీయంగా పార్టీ పరంగా పవన్‌ కల్యాన్‌కన్నా పవర్‌ పుల్‌ నాయకుడు లోకేష్‌. ఆంధ్రప్రదేశలో కూటమి వున్నా, లేకపోయినా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించినంత కాలం ఆ పార్టీయే అధికారంలోవుంటుంది. ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు, కొంత కాలం తర్వాత ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యేది లోకేష్‌ మాత్రమే. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రి అయ్యేది లోకేష్‌ మాత్రమే. ఏపిలో కూటమి ప్రభుత్వం ఎన్ని సార్లు అధికారంలోకి వచ్చినా పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. పవన్‌ కల్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేంత మెజార్టీ సాదించలేదు. అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లులేవు. సరిగ్గా గత ఎన్నికల మందు జనసేకు కేవలం 15 సీట్లు మాత్రమే ఇస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. కాని బిజేపి రాయబారంతో పవన్‌ కళ్యాణ్‌కు 21 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు వరకు తెలుగుదేశంపార్టీ ఏ కూటమిలో కూడా లేదు. కేవలం పవన్‌ తన రాజకీయ జీవితంలో ఒక మెట్టు ఎక్కడానికి నిచ్చెనగా తెలుగుదేశం పార్టీ సహకారంకోసం పాకులాడాడు. డిల్లీ వెళ్లి బిజేపిని కూటమి కోసం ఒప్పించారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు బిజేపి నాయకుల కోసం ఎదురుచూడలేదు. డిల్లీ పెద్దలు రమ్మంటేనేవెళ్లారు. జాతీయ స్ధాయిలో బిజేపి బలహీనపడుతుందన్న సంగతి గ్రహించిన తర్వాతే చంద్రబాబు కోసం ఆ పార్టీ పెద్దలు ఆహ్వానం పలికారు. 2014 ఎన్డీయేలో వున్న చంద్రబాబును పక్కన పెట్టిందే బిజేపి పార్టీ. ఆ ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఊహించని మెజార్టీతో కేంద్రంలో గెలిచిన తర్వాత బిజేపి తన రాజకీయం చూపించింది. దాంతో చంద్రబాబు కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో పవన్‌ కళ్యాణ్‌ కూడా బిజేపితో కటీఫ్‌ చేసుకున్నారు. తర్వాత మళ్లీ బిజేపి పంచన చేరారు. కారణం రాజకీయ అవకాశ వాదం. ఇంతకు మించే ఏముంది? జనసేన పార్టీకి ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌కు వున్న అభిమానులు తప్ప, ఇప్పటికీ పార్టీ యంత్రాంగంపూర్తిగా లేదు. గ్రామ గ్రామాణ పార్టీ శ్రేణి నిర్మాణం జరగలేదు. కాని తెలుగుదేశం పార్టీ పరిస్దితి అది కాదు. నలభై సంవత్సరాలుగా పార్టీ పటిష్టమైన పునాదులతో వుంది. గ్రామ గ్రామాణ పార్టీ యంత్రాంగం బలంగా వుంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి లోకేష్‌ సుధీర్ఘమైన పాదయాత్ర చేశారు. పార్టీని మరింత పటిష్టం చేశారు. లోకేష్‌ గట్టి ప్రయత్నం మూలంగా తెలుగుదేశం పార్టీకి సుమారు కోటి మంది సభ్యులున్నారు. జనసేనకు ఎంత మంది కార్యకర్తలున్నారో ఎవరైనా చెప్పలగరా? గత ఎన్నికల్లో పరస్పరసహాకారం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేది. కాని జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఎలా వుంటుందో ఓసారి ఊహించుకుంటే అర్దమౌతుంది. ఇక్కడ అటు జనసే, ఇటు తెలుగుదేశం పరస్పర అవగాహనతో ఎన్నికల్లో వెళ్లారు. ఒకరి ఓటు బ్యాంకు మరొకరికి ఉపయోగపడిరది. దాంతోనే అంత పెద్ద మెజార్టీ స్దానాలు కూటమి కైవసం చేసుకున్నది. అంతే కాని కూటమికి అన్ని సీట్లు రావడానికి తామే కారణమని పవన్‌ కళ్యాన్‌ కూడా అనుకోవడం లేదు. ఈ విషయాన్ని నాగబాబు గ్రహించాలి. రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరూ చెప్పలేరు. పైగా తెలుగుదేశం పార్టీ మరో వంద సంవత్సరాలు నిలవాలన్నా, అధికారంలో వుండాలన్నా లోకేష్‌ నాయకత్వం ఎంతో అవసరం. లోకేష్‌ ముఖ్యమంత్రి కావడం ఆ పార్టీ శ్రేణులకు ఎంతో ముఖ్యం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకుడు వున్నప్పటికీ పార్టీ యంత్రాంగాన్నంతా కోఆర్డినేట్‌ చేస్తున్నది మొత్తం లోకేష్‌ మాత్రమే. ఆయన ఎంతో కష్టపడి సుధీర్ఘమైన పాదయాత్ర చేసి, కూటమి అదికారంలోకి రావడంలో పవన్‌ పాత్ర ఎంత వుందో చంద్రబాబు పాత్ర ఎంత వుందో, అంతకు మించి లోకేష్‌ పాత్ర వుందని చెప్పడంలో సందేహం లేదు. అందువల్ల నాగబాబు ఇప్పుడు తమ్ముడి మీద ఎంతో ప్రేమ ఒలకబోస్తే అభిమానులు కూడా నమ్మరు. గతంలో ఓసారి చిరంజీవి సినిమా ఫంక్షన్‌లో అభిమానులంతా పవర్‌ స్టార్‌, పవర్‌ స్టార్‌ అంటూ గోల చేస్తునప్పుడు వారిపై కోపం ప్రదర్శించింది నాగబాబు కాదా? సర్ధిచెప్పాల్సిన సమయంలో సహనం కోల్పోయి మాట్లాడిరది నాగబాబు కాదా? జనసేన పార్టీలో నయాపైన నాగబాబు కష్టం వుందా? జనసేన పార్టీని ఎలా నడపాలో అర్ధం కాని సమయంలో, ఆర్ధిక ఇబ్బందులతో పవన్‌ కొట్టుమిట్డాడుతున్న తరుణంలో వకీల్‌ సాబ్‌ సినిమా తీసి, తనను ఆర్ధికంగా ఆదుకున్నది దిల్‌ రాజు అని అశేష జనవాహిని ముందు సాక్ష్యాత్తు పవన్‌ కళ్యాన్‌ చెప్పారు. అంతే కాని జనసేన కోసం తన సోదరులు ఆర్ధిక సాయం చేశారని చెప్పలేదు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారని చెప్పినసందర్భం ఎప్పుడూ లేదు. సాఫీగా సాగుతున్న రాజకీయాలలో నాగబాబు వేలు పెట్టడం అవసరమా? మీడియా మీద అక్కసు వెల్లగక్కడం అవసరమా? కాలం రాజకీయాలను ఎటు వైపు తిప్పుతుందో ఎవరూ చెప్పలేరు. అయినా కూటమి మూలంగా ఎప్పటికైనా లోకేష్‌ ముఖ్యమంత్రి అవుతారన్న సంగతి తెలియకుండానే పవన్‌ కళ్యాన్‌ పొత్తుకు అంగీకరించి వుంటారా? అందుకే నాగబాబుకాస్త నోరు అదుపులో పెట్టుకో అని జనసైనికులే అంటున్నారు. ఇల్లు అలకగాన పండుగ కాదు. కూటమి పేరుతో ఒక్కసారి ఉప ముఖ్యమంత్రి కాగానే రాజకీయం ఏలినట్టు కాదు. జనసేన ఒంటరిగా పోటీ చేసి గెలిచి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నప్పుడు లెక్క. అప్పడు నాగబాబు ఏది మాట్లాడినా దానికి ఓ విలువ వుంటుంది. ఇప్పుడు ఏది మాట్లాడినా తట్టుకోలేక మాట్లాడినట్లౌవుతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version