రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన. కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి..

రోడ్డు భద్రత పై విద్యార్థులకు అవగాహన.కోదాడ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి

కోదాడ, నేటి ధాత్రి:

పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని కోదాడ పట్టణ ట్రాఫిక్ అంజిరెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రత పాటించవలసిన నియమ నిబంధనలను విద్యార్థులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష పడుతుందని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దు, వాహనం నడిపే వారితో పాటు కూర్చున్న వారు కూడా హెల్మెట్ ని ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపొద్దు ప్రాణాలను కోల్పోవద్దు అని విద్యార్థులకు కోరుతూ ఆకాక్షించారు. సెల్ ఫోనులో వాట్సప్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ లలో పరిచయంలేని వారి రీల్స్ చూడవద్దు, లింకులు తెరవొద్దు, విద్యా విషయ పరిజ్ఞానం కోసమే సెల్ ఫోన్ ఉపయోగించాలని సైబర్ క్రైమ్ దూరంగా ఉండాలని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తల్లిదండ్రులకు సంతోషాన్ని కీర్తి ప్రతిష్టలు తేవాలని ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని తెలిపినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ…

పెద్దూర్ లో ఉన్న కేజీబీవీ ఆకస్మిక తనిఖీ

విద్యార్థులతో కలిసి.. అల్పాహారం తిన్న జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని(కేజీబీవీ) జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకొని.. ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.

మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచనలు చేశారు. మంచిగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం…

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం

రూ.50 వేల పుస్తకాలు అందజేసిన డాక్టర్ మాలోతు రవీందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), నర్సంపేటలో విద్యార్థుల భవిష్యత్ పోటీ పరీక్షల సన్నద్ధతకు తోడ్పడే ఉద్దేశంతో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షులు, మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు రూ.50 వేల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను అందజేశారు.
కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బైరి సత్యనారాయణ అధ్యక్షతన, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సోమయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకింగ్, రైల్వే, గ్రూప్స్, సివిల్స్, ఎస్ఎస్సీ, పోలీస్ తదితర పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే సమయపాలన, క్రమశిక్షణ, సరైన పాఠ్య ప్రణాళిక, నిరంతర సాధన అవసరమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు సరైన మార్గదర్శకత్వం, వనరులు లభిస్తే ఉన్నత స్థానాలను సాధించగలరని పేర్కొన్నారు. విద్యార్థులు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే విజయాన్ని సాధించగలరని, ముఖ్యంగా ఆడపిల్లలు చదువుల్లో ముందుండాలని పిలుపునిచ్చారు.
వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో రాణించేందుకు నాణ్యమైన పుస్తకాలు, సరైన మార్గదర్శకత్వం అవసరమని, ఈ సెల్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. సోమయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీ పరీక్షలపై అవగాహన పెంపొందించడం, ప్రారంభ దశ నుంచే సిద్ధం చేయడం, సరైన మార్గనిర్దేశం చేయడం ఈ సెల్ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ కందాల, స్టాఫ్ సెక్రటరీ ఎం.ఎం.కె. రహీముద్దీన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్. కమలాకర్, డాక్టర్ బద్రు భూక్య, డాక్టర్ రాంబాబు, డాక్టర్. రాజీరు రుద్రాణి, గ్రంథాలయ పాలకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

వ్యవసాయంలో ఉద్యోగాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు….

తంగళ్ళపల్లినేటి ధాత్రి….

 

బి జె ఆర్ వ్యవసాయ కళాశాల సిరిసిల్లలో.08.10.2025.న. వ్యవసాయ ఉద్యోగ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి ప్రధాన అతిథిగా. శ్రీ మెండు శ్రీనివాసులు. సహాయ వ్యవస్థాపకుడు సమృద్ధి ego అగ్ర ఫ్లెక్సీ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారు హాజరై. విద్యార్థులకు వ్యవసాయ రంగంలో ఉన్న వివిధ అవకాశాలు వ్యవసాయ పారిశ్రామికత. నైపుణ్య అభివృద్ధి అంశాలపై విలువైన సూచనలు చేశారు కళాశాల అసోసియేట్ డాక్టర్ సునీత దేవి మాట్లాడుతూ విద్యార్థులకు కొత్త నైపుణ్యాలు అర్జించాలని నూతన వ్యవస్థాపక తలు. చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్లేస్మెంట్ ఇన్చార్జి డాక్టర్ ఆర్ సతీష్. డాక్టర్ భవ్య శ్రీ. ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ సందేహాలు నివృత్తి చేసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు అవగాహన సదస్సుకు విచ్చేసిన. వారు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version