నేషనల్ క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి ఏరియా నుండి ఐదుగురు క్రీడాకారులు ఉత్తర్ ప్రదేశ్ లక్నో లో నవంబర్ 23 నుండి 29 వరకు జరిగే 19 వావ నేషనల్ జంబోరీ కి పయోనీరింగ్, స్టేట్ గేట్, క్యాంపు క్రాఫ్ట్ తదితర ఈవెంట్లలో ఎంపికయ్యారు. తొట్ల స్వామి, స్కౌట్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్, కేటికే 6 ఇంక్లైన్ వీ.శ్రీనివాసరావు, జనరల్ అసిస్టెంట్ రోవర్ స్కౌట్ లీడర్, కేటికే ఓసీ-2”, ఎస్.తిరుపతి, స్కౌట్ మాస్టర్ ట్రామర్, కేటికే 1 ఇంక్లైన్ శ్రీ సూర్య తేజ, కబ్ మాస్టర్ జనరల్ అసిస్టెంట్, కేటికే 5 ఇంక్లైన్ కే. రాజమొగిలి, సీనియర్ రోవర్ సపోర్టుమెన్, కేటికే 1 ఇంక్లైన్ .
అదే విధంగా మన సింగరేణి పాఠశాల నుండి ముగ్గురు గైడ్స్ అమ్మాయిలు బిట్స్ నుండి ఇద్దరు స్కౌట్స్ అబ్బాయిలు పాల్గొనుటకు అర్హత సాధించారు. భూపాలపల్లి టీమ్ కు స్కౌట్ మాస్టర్ తొట్ల స్వామి నాయకత్వం వహిస్తున్నారు.
జాతీయ స్థాయిలో జరిగే జంబోరీ లో పాల్గొంటారు ఈ సందర్భంగా సింగరేణి జనరల్ మేనేజర్, పర్సనల్ మేనేజర్ క్రీడాకారులను అభినందించారు
