ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు..

ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు..

మందమర్రి నేటి ధాత్రి

 

స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీలక్ష్మీబాయి జయంతి వేడుకలను రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రస్తుత సింగరేణి ఎస్ అండ్ పిసి ఉద్యోగి రాజేష్ ఫీహ్వాల్ , రాణి ఫీహ్వాల్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయులు జె. పురుషోత్తం మాట్లాడుతూ. ఝాన్సీ లక్ష్మీబాయి 1828 వారణాసిలో మణికర్ణికా తంబేగా జన్మించారు.ఆమె భారత స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన నాయకురాలని,చిన్నతనం నుంచి గుర్రపు స్వారీ కత్తి యుద్ధం నేర్చుకుని 1857 బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన భారత తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించి ఆమె ధైర్యానికి దేశభక్తికి ప్రతికగా నిలిచారు.ఝాన్సీ రాణి చిన్నతనం నుండి దేశ స్వాతంత్రం కోసం పోరాడి 1858 జూన్లో మరణించారు.భారత దేశ చరిత్రలో ఒక వీరవనితగా స్వాతంత్ర సమరయోధురాలిగా గౌరవించబడిందని ఆమె ధైర్యం దూడ సంకల్పం నేటికీ అనేక మందికి ప్రేరణ నిస్తాయని,విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించుకోవడంతో పాటు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవలసిన అవసరం ఉందన్నారు. రాజేష్ రాజేష్ ఫీహ్వాల్ మాట్లాడుతూ..విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో పాఠశాలలో స్వతంత్ర సమరయోధులు, మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎం జీవన్,దేవమ్మ,అనుపమ, రూపాలత,ఆశాజ్యోతి, రవీందర్,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version