ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీ పాలకవర్గ సభ్యులు
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా సర్పంచ్ గా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కొంగంటి తిరుపతి, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైనా గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆశీస్సులు అందించి అభినందనలు తెలిపారు. గ్రామపంచాయతీ పాలకవర్గం కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించిచారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో సర్పంచ్ కొంగంటి తిరుపతి,ఉపసర్పంచ్ కంఠాత్మకూర్ కుమారస్వామి, వార్డుసభ్యులు బుస్సా భాగ్య,గూడూరు నాగరాజు,తడుక రగుపతి,బాయి సంధ్య,కుమ్మరి మౌనిక,బుస్స తిరుపతి,ఆకుల వనిత,ఎడ్ల కిరణ్,గూడూరు జాన్సీ రాణి.
ఈ కార్యక్రమం లో నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్,మండల సమన్వయ కమిటీ సభ్యులు పాడి ప్రతాప్ రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భైరపాక భద్రయ్య, ఉపాధ్యక్షులు పరమండ్ల మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం మహేందర్, కార్యదర్శి బొమ్మకంటి విజేందర్, గూడూరు మధుకర్,బాయి సుమన్,సీనియర్ నాయకులు కంఠాత్మకూర్ కొమురయ్య, కొత్తూరు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
