ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య ఆధ్వర్యంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభోత్సవం.
కల్వకుర్తి /నేటి దాత్రి :
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్, ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో కల్వకుర్తి ప్రయాణికుల ప్రాంగణం వద్ద అంబలి కేంద్రము, చలివేంద్రము ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సోమవారం కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి మున్సిపల్ పట్టణ కేంద్రము ప్రయాణికుల ప్రాంగణం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ వేసవికాలంలో దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు వారి దాహార్తిని తీర్చడం కోసం అంబలి కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు ఫోటోకు పూలమాల లేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పాపిశెట్టి రాము, గంప వెంకటేష్, గంధం ప్రసాద్, దాచేపల్లి శ్రీనివాసులు, సూర్యప్రకాష్ రావు, భావండ్ల మధు, మనోహర్ రెడ్డి దారమోని గణేష్, పూరి రమేష్ ,సుశీల, ఈశ్వరయ్య ,వెంకటయ్య,వెంకటేష్, పోల నరేష్, శివ, దాచేపల్లి తిరుపతయ్య, దాచేపల్లి మనోహర్, బాదం గణేష్, నరసింహ , గంప శ్రీనివాసులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కల్వకుర్తి మున్సిపల్ కౌన్సిలర్రు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
