ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు….

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐడిఓసి కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 96వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా యాదవ సంఘం నాయకులు మాట్లాడుతూ
కడివెండి గ్రామం జనగామ ఉమ్మడి వరంగల్ జిల్లా
భూస్వాముల దోపిడీ, దొరల వెట్టిచాకి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కడివెండి గ్రామంలో రైతు సంఘం తరపున ఉద్యమాలు చేశారు 1946 జూలై 4న జరిగిన నిరసన ప్రదర్శనలో విస్నూరు దేశ్‌ముఖ్ గుండాల కాల్పుల్లో మరణించారు.
ఈ ఘటన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని (1946-51) తీవ్రతరం చేసింది. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరవీరుడుగా నిలిచారు అయిన ఆశయాలను కొనసాగించాలి అన్నారు ఈ కార్యక్రమంలో
యాదవ సంఘం నాయకులు కౌన్సిలర్ అప్పం కిషన్ పెంట సదానందం యాదవ్. నల్గేట్ సతీష్ యాదవ్ మూడేత్తుల రవి యాదవ్ మహేష్ యాదవ్ దాసరి రాజు యాదవ్ మెండు వెంకటస్వామి యాదవ్ గడవైన దేవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version