నర్సంపేట మున్సిపాలిటీకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలి.

గెలిచి వస్తేనే రాజకీయ భవిష్యత్…

30 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వివరాలు ప్రకటన

* నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి*

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.ఎన్నికల్లో గెలిచిన వారికే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 30 వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను మంగళవారం ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఎన్నికల పోటీలో గెలుపొంది రావాలని దానికోసం వార్డు పరిధిలోని నాయకులు కార్యకర్తలు వార్డు ఇన్చార్జిలు కృషి చేయవలసి ఉంటుందని వివరించారు.నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నుండి మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న 30 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.

30 వార్డులలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీరే..

1వ వార్డు నుండి మేఘన కొత్తకొండ,2వ వార్డు కంపెల్లి వీణ, 3వ వార్డు నుండి ముత్తినేని వెంకన్న, 4వ వార్డు నుండి బీరం భరత్,5వ వార్డు పొన్నాల మనిషా, 6వ వార్డు నుండి పున్నం నర్సింహారెడ్డి,7వ వార్డు నుండి గంధం నరేందర్,8వ వార్డు నుండి కందుకూరి రజిత,9వ వార్డు అభ్యర్థిగా బండి పల్లవి, 10వ వార్డు నుండి చింతల సాంబరెడ్డి,11 వార్డు నుండి స్వరూప చీకటి,12 వ వార్డు నుండి ఇస్లావత్ రమ,13వ వార్డు నుండి భూక్య మాతృ రాథోడ్,14వ వార్డు నుండి గుజ్జుల భవాని,15వ వార్డు నుండి ఏపూరి శ్రీనివాసరెడ్డి,16వ వార్డు నుండి అజ్మీరా మేఘ్య,17వ వార్డు నుండి సల్లావుద్దీన్ అయోబ్ ఖాన్, 18 వ వార్డు నుండి లక్కర్స్ రజిత,19 వార్డు నుండి ఎలికంటి విజయ్ కుమార్,20 వార్డు నుండి శ్రీరామోజు రోజారాణి, 21 వ వార్డు నుండి అంజలి ఓర్సు,22వ వార్డు నుండి బాణాల ప్రసన్నకుమారి, 23వ వార్డు నుండి వేల్పుల శ్రీలత, 24 వార్డు నుండి బత్తిని రాజేందర్ , 25 వార్డు నుండి పెండెం శ్రీలక్ష్మి, 26వ వార్డు నుండి గాజుల విమల,27వ వార్డు నుండి ములకల వినోద ,28వ వార్డు నుండి చిలువేరు రజిని భారతి , 29వ వార్డు నుండి వేముల సంధ్య,30వ వార్డు నుండి మాదాసి రవిలకు బీఫార్మన్స్ ఇచ్చి పోటీ బరిలో ఉన్నట్లు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రకటించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్,సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి,తోకల శ్రీనివాసరెడ్డి, ఎర్ర యాకూబ్ రెడ్డి,ప్రభాకర్,రాజవీర్ లతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో కాంగ్రెస్ మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష

*మున్సిపాలిటీ ఎన్నికల సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

◆-: ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్

◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

◆-: సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

◆-: మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కోహిర్ మునిసిపాల్టీల ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్ ప్రసంగిస్తూ రానున్న మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నాయకులు కార్యకర్తలు సమీక్షిగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయలని కొరకు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పార్టీ పరంగా సమన్వయం పాటించి అధిష్టానం మొగ్గు చూపినా వారికే ఈ ఎన్నికల్లో పని చేసి ప్రతి ఒక్కరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను వివరించి జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తూ అభ్యర్థుల గెలుపు దిశగా కృషి చేసి జహీరాబాద్ లో మరియు కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ ,మాక్సూద్ అహ్మద్,నరసింహా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబ్బాసుం,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,హుగ్గేల్లి రాములు,కోహిర్ పట్టణ అద్యక్షులు శంషీర్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు..

మున్సిపల్‌లో బీజేపీ జెండా ఎగరాలి – డాక్టర్ రఘు

మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రఘు
మెట్ పల్లి జనవరి 10 నేటి దాత్రి

 

ప్రస్తుతం జరగబోయే మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరేయాలని, ఇందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ అధ్యక్షతన మున్సిపల్ ఎన్నికల సన్నహాక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని బీజేపీ సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోబోతున్నామని పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో సుమారుగా 49 శాతానికి పైగా బీజేపీ ఓటు బ్యాంకు పెరగడం శుభ పరిణామం అన్నారు. గతంలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకు ప్రస్తుత ఎన్నికల్లో కలిసి వచ్చే అంశమని పేర్కొన్నారు. వార్డుల్లో పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చినా అభ్యర్థిని గెలిపించుకోవడానికి సాయశక్తుల కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా కృషి చేస్తే ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించనుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఎర్ర లక్ష్మీ, జిల్లా కార్యదర్శి పీసు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సుంకేట విజయ్, కుడుకల రఘు, అన్ని వార్డుల బీజేపీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version