అడ్డా లేక ఆగమగుతున్న ఆటో డ్రైవర్లు.

అడ్డా లేక ఆగమగుతున్న ఆటో డ్రైవర్లు.???
ఐలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఆటో స్టాండ్ ఖాళీ చేయించిన పోలీసులు
అసలే ఉచిత బస్సుతో డీలాపడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు
మండలంలో మల్లికార్జున స్వామి జాతరే వారికి దిక్కు
జాతర లోపలికి లోకల్ ఆటోలను సైతం అనుమతించని పోలీసులు
తమ బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దని వేడుకున్నా కనికరించని పోలీసులు
భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారం ముఖ్యమే.
జాతర నిర్వహణ పేరుతో పేదల బతుకులపై బండలు వేస్తారా??
ఇన్నేళ్లు సజావుగా సాగినా ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి???

నేటి ధాత్రి అయినవోలు :-

 

ఐలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం చుట్టూ ఈసారి జాతర వాతావరణం కంటే ఆటో డ్రైవర్ల ఆవేదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి సజావుగా సాగిన ఆటో వ్యవస్థను ఒక్కసారిగా తుడిచిపెట్టినట్లుగా పోలీసులు తీసుకున్న నిర్ణయాలు స్థానిక ఆటో డ్రైవర్ల బతుకుదెరువును ప్రశ్నార్థకంగా మార్చాయి.ఆలయం పరిసరాల్లో ఉన్న ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయిస్తూ, లోకల్ ఆటోలను జాతర ప్రాంగణంలోకి అనుమతించబోమంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేయడంతో డ్రైవర్లు అడ్డా లేకుండా అల్లాడిపోతున్నారు. అసలే ఉచిత బస్సుల విధానంతో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయిన వేళ, ఏడాదిలో ఒక్కసారైనా మల్లికార్జున స్వామి జాతరే తమకు దిక్కు అనుకున్న ఆటో డ్రైవర్లకు ఇది తీరని దెబ్బగా మారింది.జాతర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం నిజమే. కానీ అదే పేరుతో స్థానిక ఆటోలను పూర్తిగా పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా ఆటోలు నడిచినప్పుడు, ఇప్పుడే ఎందుకు ఈ కిరికిరి అన్న అనుమానాలువ్యక్తమవుతున్నాయి
“మా బతుకుదెరువుపై దెబ్బ కొట్టొద్దు… కనీసం జాతర రోజుల్లో అయినా మాకు ఉపాధి దొరికేలా చూడండి” అంటూ ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నా, పోలీసులు మాత్రం కనికరించని వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల భద్రత పేరుతో తీసుకునే నిర్ణయాలు ప్రజల ఉపాధిని హరించేలా ఉంటే, అది పాలన వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుంది.
జాతర నిర్వహణకు క్రమశిక్షణ అవసరం. ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. కానీ దానికి పరిష్కారం స్థానికుల జీవనాధారాలను మూసివేయడం కాదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, ఆటో స్టాండ్‌ను ఖాళీ చేయించి, లోకల్ ఆటోలను నిషేధించడం పోలీసు యంత్రాంగం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంగా మారిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.భక్తుల సౌకర్యం, భద్రతతో పాటు, స్థానిక పేద కార్మికుల జీవనాధారాన్ని కూడా సమానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిది. అసలే ఉపాధి లేక చీటికి చినిగిపోయిన ఆటో డ్రైవర్ల బతుకులపై ఈ భారం పడకుండా స్థానిక ఎమ్మెల్యే నాగరాజ్ చొరవ తీసుకోవాలి.లేదంటే “జాతర” పేరు చెప్పుకుని “ పేద ప్రజల బతుకులపై బండలు వేసిన” చరిత్రగా ఈ నిర్ణయం మిగిలిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా…

వాగ్దానం పట్ల అడుగుతే అక్రమ అరెస్టులా

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని అడుగుతే అరెస్టు చేస్తారా అని బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు ఆరోపించారు.
మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు జీవన భృతి కింద ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శాంతియుతంగా వెళ్తున్న కార్మికులను నవతెలంగాణ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్, జిల్లా నాయకులు పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నరసయ్యలను అరెస్టు చేయడం సరికాదన్నారు.ఆర్థిక ఇబ్బందులకు గురై రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలకు పది లక్షల ఎక్స్ గ్రేసియ చెల్లించాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లకి జీవన భృతి కింద నెలకు 20 వేల రూపాయలు ఇవ్వాలని మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆటో డ్రైవర్లకి రాష్ట్రంలో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి తద్వారా అర్హులైన కార్మికులకి సంక్షేమ పథకాలను అందే విధంగా చూడాలని కోరారు.

కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రోడ్డు వేయండి. ఆటో డ్రైవర్లు ఆవేదన…

కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రోడ్డు వేయండి. ఆటో డ్రైవర్లు ఆవేదన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గo కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారిపోయింది కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రెండు కిలోమీటర్లు మాత్రమే కానీ ఆ రోడ్డులో ప్రయాణం చేయడానికి కనీసం ముప్పై నిముషాలు పడుతుంది మరి ముఖ్యంగ ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆటో డ్రైవర్లు అంత బుధవారం నాడు ఆటో బందుకు పిలుపు నిచ్చారు రోడ్డు పై దర్న నిర్వహించరు ఆ గ్రామ మాజీ ఏం పి టి సి . బి. జ్ఞానారత్నం కల్పించుకొని. కోహీర్ నుండి పైడిగుమ్మల్ కు రోడ్డు గత సంవత్సరం ప్రభుత్వం సుమారు ఒక కోటి ఇరవై లక్షలు మంజురు చేసిందన్నారు అందుకు టెండర్లు వేయడం జరిగింది అన్నారు కానీ కంటాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు త్వరలో నే కంటాక్టర్ లతో మాట్లాడి సమస్య తీరుస్తాం అన్నారు అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్డు చేయిస్తాం అన్నారు దాంతో ఆటో డ్రైవర్లు అతనికి కృతజ్ఞతలు తెలియజేసారు,

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version