చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

చిన్నపిల్లల్లో పెరుగుతున్న, గుండెపోటు ప్రమాదం.. కారణాలు ఇవే..!

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-21.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి:

పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.
గుండెపోటు.. ప్రస్తుతం చాలా మంది పిల్లలు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. గుండెపోటు అనేది తీవ్రమైన సమస్య. దీని ప్రమాదం పెద్దలు మరియు పిల్లలలో పెరుగుతోంది. నిజానికి శరీరంలో రక్తం అడ్డుగా ఉన్నప్పుడు గుండె కండరాలు సక్రమంగా పని చేయకపోవడమే కాకుండా గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లలు ఏమీ తినకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారి జీవక్రియ రేటు క్షీణించడం, హైపోగ్లైసీమియా వారి గుండె సమస్యలను పెంచడం వంటి సమస్య పిల్లల్లో కనిపిస్తుంది.

Heart attack in children

వ్యాయామం లేకుండా ఉండటం..

కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. పిల్లలు ఆడుకోవడం మానేశారు. టీవీ, మొబైల్, ల్యాప్టాప్ ముందు కూర్చుని ఇంట్లో ఏదో తిన్నారు. రోజంతా ఒకే చోట కూర్చుంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నేటి పిల్లలు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారు.. అంటే దానికి బానిసలై మైండ్ ని బలహీనపరుస్తున్నారు.

పిల్లల్లో ఒత్తిడి..

ఇది పిల్లలలో ఒత్తిడి సమస్యలకు దారి తీస్తుంది. ఒత్తిడి కారణంగా వారికి గుండె సమస్యలు కూడా వస్తాయి. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ వాడడం, అందులో గేమ్లు ఆడడం, తెల్లవారుజామున నిద్రలేవడం వంటివన్నీ రోగాలకు కారణమవుతున్నాయి.

పిల్లల్లో ఊబకాయం సమస్య ..

ఊబకాయం సమస్య కూడా పిల్లల్లో గుండెపోటుకు దారి తీస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఈ అలవాట్లపై దృష్టి పెట్టాలి. వారితో సమయం గడపాలి.

పిల్లలు తినే ఆహారం..

పిల్లలు ఒత్తిడితో గుండెపోటు వంటి వ్యాధుల బారిన పడకుండా వారి శారీరక దృఢత్వంపై కూడా తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలన్నారు. అలాగే పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వాలి. బయటికి వెళ్లినప్పుడు చాలా అరుదుగా బయటి ఆహారాన్ని తినవచ్చు. కానీ, క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరంలో ఊబకాయం ఏర్పడుతుంది.

అంతిమ యాత్రలో పాల్గొన్న నాగుర్ల

అంతిమ యాత్రలో పాల్గొన్న నాగుర్ల
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో గురువారం గుండెపోటుతో మరణించిన గండు శ్రీహరి గౌడ్ (85) అంతిమ యాత్రలో తెలంగాణ రైతు విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు ( నవత వెంకన్న ) పాల్గొన్నారు. మృతుని కుమారుడు గౌడ సంఘం రాష్ట్ర నాయకుడు గండు శ్రీనివాస్ మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి..ఓదార్చారు. మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని వేడుకుంటున్నట్లు తెలిపారు. నాగుర్ల వెంట చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్, సర్పంచుల ఫోరం మొగుళ్ళపల్లి మండల మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి తదితరులున్నారు.

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

నేడు జట్టుతో చేరనున్న గంభీర్‌

 

 

shine junior college
భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున…

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ గౌతం గంభీర్‌ మంగళవారం జట్టుతో చేరనున్నాడు. తల్లి సీమా గంభీర్‌ గుండెపోటుకు గురైనందున అతడు ఈనెల 12న స్వదేశానికి వచ్చాడు. గౌతీ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ..ఆమె ఆరోగ్యం మెరుగైందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కెంట్‌లో ఉన్న భారత జట్టు శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం మంగళవారం హెడింగ్లీకి బయల్దేరి వెళ్లనుంది.

దోస్త్ మేరా దోస్త్ అని నిరూపించుకున్న స్నేహితులు

దోస్త్ మేరా దోస్త్ అని నిరూపించుకున్న స్నేహితులు

గణపురం నేటి ధాత్రి : 

 

గణపురం మండల కేంద్రంలో ఇటీవల కాలంలో పసునూటి వెంకటేష్ గుండెపోటుతో అకాల మరణంచెందడం తన స్నేహితులు వెంకటేష్ మరణాన్ని ప్రతి క్షణం వెంకటేష్ ఉన్నాడని భావించి వెంకటేష్ తమ వెంటే ఉన్నాడని తెలియజేయడంలో ముందడుగులో ఉన్నారు దానికి వెంకటేష్ దశ దినకర్మ నిర్వహించడం వారి యొక్క వెంకటేష్ పట్ల ఉన్న ప్రేమ స్నేహానికి ఇచ్చే గౌరవం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే పసునూటి వెంకటేష్ భౌతికంగా తమతో లేకున్నా ప్రతి విషయంలో మాకు తోడునీడగా ఉంటాడని భావించి వారు వెంకటేశు దశదినకర్మను నిర్వహించిన ఆటపాటలు, దశదిన కార్యక్రమంలో నిర్వహించిన కార్యక్రమా లు వారి స్నేహాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం గమనార్హం ఇలాంటి స్నేహితులను దక్కించుకోవడంవెంకటేష్ ఏ లోకంలో ఉన్న ఆత్మకు శాంతి కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఈరోజు నిర్వహించిన దశదిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వెంకటేష్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం.

గుండెపోటుతో బిల్ కలెక్టర్ ఇటీవల మరణం
కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తూ గత అయిదు రోజుల క్రితం గుండెపోటుతో చనిపోయిన పులాల కుమార్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన *జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వర రావు, కుమార్ కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు కుమార్ చనిపోవటం చాలా బాధాకరం అని తెలిపారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దయ్యాల శ్రీనివాస్, BRS నాయకులు బోగం వెంకటేష్ మరియు నాయకులు ఉన్నారు

ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు.

ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్, మండల్ కు చెందిన ప్రముఖ మరియు సుప్రసిద్ధ వ్యక్తి, ముహమ్మద్ సజ్జాద్ పటేల్ చిష్తి, మోహి ఖాద్రీ రిజ్వానీ అహ్మదీ యూసుఫీ,అల్-నైబీ అల్-మిర్జా కలందరీ,సజ్జాదా నషిన్ అస్తానా,ప్రస్తుతం జహీరాబాద్ లో నివసిస్తున్న గురుజువాడ నివాసి అహ్మద్ హుస్సేన్ గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు గురుజువాడ లో సాయంత్రం మగ్రిబ్ ప్రార్థన తర్వాత మృతుడి అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి.పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి.

గుండెపోటుతో మొగుళ్లపల్లి ఎంపిడిఓ మృతి

మొగుళ్లపల్లి నేటి ధాత్రి

 

మండలంలో ఎంపిడిఓ గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ హుస్సేన్ శనివారం రోజున గుండెపోటుతో మృతి చెందారు.ఎంపిడిఓ హుస్సేన్ స్వగ్రామం హన్మకొండ జిల్లా పరకాల పట్టణం కాగా గత సంవత్సరంలో ప్రమోషన్ తో మొగుళ్లపల్లి మండలానికి ఎంపిడిఓ గా బాధ్యతలు చేపట్టి మండల అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి మండల ప్రజల్లో అభిమానం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో టైపిస్ట్ గా బాధ్యతలు చేపట్టి వృత్తిపట్ల అంకిత భావంతో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ. ఎంపిడిఓ గా మండలంలో పనిచేస్తున్న హుస్సేన్ నెల రోజుల్లో పదవి విరమణ పొందనున్నారు. గత మూడు రోజులుగా ఆరోగ్యం సరిగా లేదని ఆఫీస్ లో సెలవు తీసుకొని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న క్రమంలో హటాత్తుగా గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపిడిఓ హుస్సేన్ మృతితో మొగుళ్లపల్లి ఎంపిడిఓ కార్యాలయం మూగబోయింది ఎంపిడిఓ హుస్సేన్ మరణవార్తతో మండలంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version