రేవంత్‌రెడ్డి జూనియర్ యోగిలా మారారు.. హరీశ్‌రావు సెటైర్లు
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కట్టలేదు కానీ లక్ష ఇళ్లను కాంగ్రెస్ సర్కార్ కూల్చిందని ధ్వజమెత్తారు.
మైనార్టీ నాయకులు సలీం రూ.10వేలతో కిట్లను పంపిణీ చేశారని హరీశ్‌రావు ప్రశంసించారు. కేసీఆర్ నిరుపేదల గురించి ఆలోచించి షాదీ ముబారక్ పథకంతో లక్ష రూపాయలను అందించేవారని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షాదీముబారక్‌ను అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక్క మంచి పనైనా చేశారా..? అని ప్రశ్నించారు. ఇమామ్, మోజమ్‌లకు వేతనం పెంచుతామన్నారని, తులం బంగారం ఇస్తామన్నారని.. ఏ ఒక్కటి అయినా ఇచ్చారా.? అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో తాగునీటి ఇబ్బందులు పరిష్కరించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజలందరూ ఇబ్బందుల్లో ఉన్నారని ఫైర్ అయ్యారు.
