దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలలో మాజి ఎంపీ రావుల…

దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలలో మాజి ఎంపీ రావుల
వనపర్తి నేటిదాత్రి .

తెలంగాణ భవన్ లో జరిగిన దొడ్డికోమరయ్య జయంతి వేడుకలలో శాసనమండలి ప్రతిపక్షనేత బీ ఆర్ ఎస్ మధుసూదనాచారి వనపర్తి మాజీ ఎమ్మెల్యే,మాజీ ఎంపీ బీ ఆర్ ఎస్ తెలంగాణ రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి రావుల చంద్రశేఖర్ రెడ్డి నేతలు కురువ విజయ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారని రావు ల శిష్యులు ఎం డి గౌస్ ఒక ప్రకటన లో తెలిపారు

కలెక్టర్ కార్యాలయ ఆవరణలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు…

కలెక్టర్ కార్యాలయ ఆవరణలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో
శుక్రవారం నాడు ఆవరణలో ప్రభుత్వ బీ సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా రావడానికి ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. ఆయన తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన కొమురయ్య ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రజా సంఘాల నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ రాములు యాదవ్ పెండం రాజనగరము కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

దొడ్డి కొమురయ్య ఆశయాలు కొనసాగించాలి…

దొడ్డి కొమురయ్య ఆశయాలు కొనసాగించాలి

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్యను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఐ.డి.ఓ.సి లో దొడ్డి కొమురయ్య జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఇందిరాతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు. వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన ఆయన సాహసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాసు కౌన్సిలర్ అప్పం కిషన్ యాదవ సంఘం నాయకుడు సుధాకర్ సదానందం యాదవ్ బీసీ సంక్షేమ శాఖ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version